చంద్రబాబు పాలనలో వెలుగులు లేని దీపావళిపై వైఎస్ జగన్ ట్వీట్ | YSRCP Chief YS Jagan Criticizes Chandrababu Naidu Leadership In His Diwali Tweet, Check Out Post Inside | Sakshi
Sakshi News home page

చంద్రబాబు పాలనలో వెలుగులు లేని దీపావళిపై వైఎస్ జగన్ ట్వీట్

Oct 20 2025 2:34 PM | Updated on Oct 20 2025 4:17 PM

YS Jagan Criticizes Chandrababu Leadership in Diwali Tweet

సాక్షి,తాడేపల్లి: చంద్రబాబూ.. మీరూ, మీ కూటమి ఇంటింటా వెలిగిస్తాం అన్న దీపాల్లో ఏ ఒక్క దీపం అయినా, మీ ఈ 18 నెలల కాలంలో వెలిగిందా? అంటూ వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు పాలనలో వెలుగులు లేని దీపావళిపై సోమవారం (అక్టోబర్‌ 20)  వైఎస్‌ జగన్‌ ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు.  

ఆ ట్వీట్‌లో .. చంద్రబాబు మీరూ, మీ కూటమి ఇంటింటా వెలిగిస్తాం అన్న దీపాల్లో ఏ ఒక్క దీపం అయినా, మీ ఈ 18 నెలల కాలంలో వెలిగిందా? ఆ సంతృప్తి ఎవరికైనా ఉందా?

1.నిరుద్యోగులందరికీ నెలకు రూ.3వేల చొప్పున భృతి

2.ప్రతి అక్కా చెల్లెమ్మకూ నెల నెలా రూ.1500, సంవత్సరానికి రూ.18,000

3.50 ఏళ్లకే పెన్షన్‌, నెల నెలా రూ.4వేలు.

4.ప్రతి రైతుకూ ఏడాదికి రూ.20,000, పీఎం కిసాన్‌ కాకుండా ఇస్తానంటూ మీరు ఇచ్చిన మాట

5.ఎంతమంది పిల్లలు ఉన్నా, ఆ పిల్లలందరికీ, ప్రతి ఒక్కరికీ ఏటా రూ.15,000

6.ప్రతి ఇంటికీ ఏటా 3 ఉచిత గ్యాస్‌ సిలిండర్లు, ఈ రెండేళ్లలో 6 సిలిండర్లు

7.అక్క చెల్లెమ్మలందరికీ ఎక్కడికైనా, ఏ బస్సులో అయినా ఉచిత ప్రయాణం…

8.ఉద్యోగులకు ఇచ్చిన వాగ్దానాలు

ఇవన్నీ వెలగని దీపాలో…లేక చేశాం అంటే చేశాం అన్నట్టుగా వెలిగించిన అరకొర దీపాలా..? లేక మీరు రాకముందు వరకూ దేదీప్యమానంగా వెలుగుతున్న దీపాలను ఆర్పడమా?. వీటితోపాటు స్కూళ్లు, ఆస్పత్రులు, విద్యా, వైద్యం, వ్యవసాయం, లా అండ్‌ ఆర్డర్‌, పారదర్శకత ఇవన్నీకూడా వెలగని దీపాలే కదా.

మా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనలో 2019-24 మధ్య… ఇంటింటికీ అందిన డీబీటీ అనే ఇంధనం ద్వారా దేదీప్యమానంగా వెలిగిన దాదాపు 30 పథకాలు అనే దీపాలను మొత్తం ఆర్పేసిన మీరు, ఇంటింటా నెలకొన్న చీకటికి ప్రతినిధులు’ అంటూ ధ్వజమెత్తారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement