అధ్బుతమైన దీపోత్సవంతో రెండు ప్రపంచ రికార్డులు | Ayodhya Sets Two World Records With 26 Lakh Diyas At Deepotsav 2025, Celebrating Lord Ram's Return | Sakshi
Sakshi News home page

అధ్బుతమైన దీపోత్సవంతో రెండు ప్రపంచ రికార్డులు

Oct 20 2025 12:09 PM | Updated on Oct 20 2025 1:17 PM

Deepotsav 2025 Ayodhya sets two world 26 lakh lamps light up

ఉత్తరప్రదేశ్‌లోని పవిత్ర నగరం అయోధ్య ఆదివారం 2025 దీపోత్సవంలో సరికొత్తగారెండు  ప్రపంచ రికార్డును సృష్టించింది. 2.6 మిలియన్ల దీపాల ప్రదర్శనతో గిన్నిస్ ప్రపంచ రికార్డును సృష్టించింది.   దీంతో గత ఏడాది  అక్టోబర్‌లో అయోధ్యలో  25.12 లక్షల దీపాలను సాధించిన  గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ను తిరిగ రాసింది.  

రెండోది 2,128 మంది పూజారులు , భక్తులు ఒకేసారి మా సరయు ఆరతి ప్రదర్శించడం మరో విశేషంగా నిలిచింది. ఈ సందర్భంగా బాణా సంచా పేలుళ్లతో ఆకాశం మిరుమిట్లు  కాంతులతో వెలిగిపోయింది.

వేలాది మంది భక్తులు, యాత్రికులు , సందర్శకులు ఈ వేడుకలలో పాల్గొనేందుకు తరలి వచ్చారు. ఇది  ఇది భారతదేశంలో అత్యంత ప్రసిద్ధ సాంస్కృతిక ,ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ఒకటిగా  నిలిచింది. ఉత్తరప్రదేశ్ పర్యాటక , సాంస్కృతిక శాఖ నిర్వహించిన ఈ ప్రత్యేక వేడుకలో లక్షలాది దీపాలు (మట్టి దీపాలు) సరయు నదీ ఒడ్డు దీదీప్య మానంగా వెలిగిపోయింది. భక్తులకు అద్భుతమైన ఆనందాన్ని పంచింది. ఈ సందర్బంగా ఈ ఏడాది  2100 మంది భక్తులు సరయూ నదీ తీరాన దీపాలను వెలిగించి తరించారు. 

అయోధ్య అభివృద్ధి అథారిటీ ఏర్పాటు చేసిన ఘాట్‌లలో 26,17,215 దివ్య దీపాలు వెలిగించడం ఆశ్చర్యాన్ని కలిగించింది. డ్రోన్ల సాయంతో ప్రమిదలను లెక్కించి గిన్నిస్‌ పుస్తక ప్రతినిధులు ప్రపంచ రికార్డ్‌ను ధ్రువీకరించారు.  ఇది 14 సంవత్సరాల వనవాసం ,రావణుడిపై విజయం తర్వాత శ్రీరాముడు అయోధ్యకు తిరిగి రావడాన్ని గౌరవంగా  దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

2017లో మొదలైన ఈ వేడుక ఇలా సాగింది. 
యూపీ ముఖ్యమంత్రి యోగి నాయత్వంలో 2025లో తొమ్మిదవ ఎడిషన్ 26.17 లక్షలకు పైగా దీపాలతో రికార్డు సృష్టించింది. 2017లో 1.71 లక్షల దీపాల నుండి 2018లో 3.01 లక్షలు, 2019లో 4.04 లక్షలు, 2020లో 6.06 లక్షలు, 2021లో 9.41 లక్షలు, 2022లో 15.76 లక్షలు, 2023లో 22.23 లక్షలు , 2024లో 25.12 లక్షలకు చేరింది. 2025లో తొమ్మిదవ ఎడిషన్ 26.17 లక్షలకు పైగా దీపాలతో రికార్డు సృష్టించిన సంగతి తె లిసిందే. 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement