
అటు దేశవ్యాప్తంగా, ఇటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దీపావళి వేడుకలు అత్యంత ఉత్సాహంగా జరిగాయి. చిన్నాపెద్దా కులమత భేదాలు లేకుండా వెలుగుల పండుగను అత్యంత ఘనంగా నిర్వహించుకున్నారు. ఆలయాలు సర్వాంగ సుందరంగా విద్యుద్దీప కాంతులతో వెలిగిపోయాయి. అయితే తెలంగాణా,హైదరాబాద్ లోని భాగ్యలక్ష్మి దేవాలయంలో దీపావళి సంబరాలు ఎప్పటిలాగానే విశేషంగా నిలిచాయి.
వెండి బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో హైదరాబాద్ పాతబస్తీలోని చార్మినార్ వద్ద కొలువై ఉన్న భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయంలో అమ్మవారికొలువైన ఉన్న వెండి నాణేలను పంపిణీ చేశారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకలకు భక్తులు తరలి వచ్చారు. ఈ క్రమంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా సంపదకు మారుపేరైన అమ్మవారిని దర్శించుకున్న మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ట్రస్టీ ఆధ్వర్యంలో భక్తులకు వెండి నాణేలు పంపిణీ చేశారు.
మహాహారతి తరువాత ఏడాదంతా అమ్మవారి ఖజానాకు భక్తులు సమర్పించిన వెండి కానుకలతో ప్రత్యేకంగా తయారు చేయించిన వెండి నాణేలను దీపావళి రోజు భక్తులకు పంపిణీ చేయడం ఆనవాయితీ. ఈక్రమంలో ఈ ఏడాది కూడా వెండి నాణెలు పంపిణీ చేసినట్లు ఆలయ ట్రస్టీ వివరించారు. అలాగే ఈ హారతి మూడు రోజుల పాటు జరుగుతుందని తెలిపారు.
కాగా భాగ్యలక్ష్మి దేవాలయంలో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్‌నగర్ మేయర్ గద్వాల విజయలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె ట్వీట్ చేశారు.
On this auspicious Diwali, I visited the sacred Charminar Bhagyalakshmi Temple, offered heartfelt prayers for peace & prosperity. Wishing everyone a joyous, prosperous Diwali filled with light! 🪔✨#Diwali #Charminar #Diwali2025 #BhagyalakshmiTemple pic.twitter.com/ZdxYxVsHek
— Vijayalaxmi Gadwal, GHMC MAYOR (@gadwalvijayainc) October 20, 2025