
దీపావళి పర్వదినాన్న పురస్కరించుకుని ప్రమిదలతో పాటు బొమ్మల కొలువులు, వ్రతాలకు ఉపయోగించు కునే కుందుల తయారీలో మహిళలు నిమగ్నమయ్యారు. కుమ్మరి కళాకారులు
సంప్రదాయబద్ధంగా చేతులతోనే ప్రమిదలతో పాటు కుందులు తయారుచేసి చక్కని డిజైన్లకు ఆకర్షణీయమైన రంగులు వేస్తూ మార్కెట్లోకి పంపిణీ చేస్తున్నారు. అమీర్‌పేటలోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వెనుక ఈ వృత్తి కళాకారులు, మహిళలు వీటి తయారీలో నిమగ్నమయ్యారు. కుందులకు, ప్రమిదలకు తగిన రంగులు అద్దుతూ ఆకట్టుకునేవిధంగా తీర్చిదిద్దుతున్నారు.
వీటిని మార్కెట్లో విక్రయించేందుకు పలువురు వ్యాపారులు ఆర్డర్లు ఇవ్వడంతో తమకు చేతినిండా పని దొరికిందని మహిళలు చెబుతున్నారు. వీటి తయారీ కోసం ఈ కుటుంబాలన్నీ ముఖ్యంగా మహిళలు నిమగ్నమయ్యారు. ప్రతియేటా దీపావళికి రెండు నెలల ముందు నుంచే వీటి తయారీపై దృష్టి పెడతామని కుమ్మరి శ్రీను తెలిపారు.
ఇదీ చదవండి: ముద్దుల కోడలితో నీతా అంబానీ : బుల్లి బ్యాగ్ ధర ఎన్ని కోట్లో తెలుసా?