వరంగల్ జిల్లా : ఒక్కేసి పువ్వేసి చందమామ.. అంటూ యువతులు, మహిళలు పాటలతో సందడి చేశారు పోయి రావమ్మ.. గౌరమ్మ అంటూ దీపావళి (నేతకాని) బతుకమ్మను సాగనంపారు.
హసన్‌పర్తి మండలం సీతంపేట గ్రామంలో మూడు రోజులపాటు నిర్వహించిన దీపావళి(నేతకాని)బతుకమ్మ వేడుకలు గురువారం ముగిశాయి.
తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలతో మహిళలు, పురుషులు గ్రామ వీధులగుండా కిలోమీటర్ దూరం వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు.
అనంతరం బతుకమ్మ ఆడి స్థానిక చెరువులో నిమజ్జనం చేశారు.


