
వయసు తేడాలు లేకుండా అందరికీ నచ్చేది. ఎవరికైనా కానుకగా ఇవ్వాలన్నా సరైన ఎంపికగా ఉండేది. భావోద్వేగాల అదుపుకు సహాయకారిగా మారేది. నలుగురిలో ఉన్నప్పుడు ఆనందపు సంబరాన్ని క్షణాల్లో మూటగట్టి తెచ్చే నేస్తం... చాక్లెట్. పండ్ల ముక్కలతో, డ్రై ఫ్రూట్స్‌తో చాక్లెట్‌ను సులువుగా తయారు చేసుకుందాం. ఆరోగ్యకరమైన ఆనందాన్ని ఇంటర్నేషనల్ చాక్లెట్ డే సందర్భంగా మన వంటింటి నుంచే పంచుకుందాం.

ఫ్రూట్ – నట్స్ చాక్లెట్
కావల్సినవి: డార్క్ చాక్లెట్ – 350 గ్రా.లు; జీడిపప్పు – 50 గ్రా.లు / అర కప్పు; బాదం పప్పు – 50 గ్రా.లు / అర కప్పు; కిస్మిస్ – 50 గ్రా.లు / అరకప్పు; టూటీ ఫ్రూటీ – అరకప్పు (నారింజ – ఆకుపచ్చవి); నచ్చిన అచ్చు – 1; బటర్ – అచ్చులపైన రాయడానికి టీస్పూన్;
తయారీ: ∙ముందుగా నచ్చిన అచ్చు తీసుకొని, దానిని బటర్‌తో రాసి, కాసేపు పక్కన ఉంచాలి.
డబుల్ బాయిలర్ పద్ధతిలో చాక్లెట్‌ను కరిగించి, పక్కన పెట్టాలి.
నట్స్, డ్రై ఫ్రూట్స్‌ని సన్నని ముక్కలుగా కట్ చేయాలి. వీటిని కరిగిన చాక్లెట్‌లో వేసి బాగా కలపాలి.
ఈ మిశ్రమాన్ని స్పూన్‌తో తీసుకొని, సిద్ధంగా ఉంచిన అచ్చును నింపి, పైన డ్రై ఫ్రూట్స్‌తో అలంకరించి, గంటసేపు డీప్ ఫ్రీజర్‌లో ఉంచాలి. ∙మిశ్రమం పూర్తిగా గట్టిపడిందని నిర్ధారించుకున్నాక, దానిని ఆస్వాదించవచ్చు. గిఫ్ట్‌గానూ ఇవ్వచ్చు.

చాక్లెట్ కవర్డ్ ఫ్రూట్
కావల్సినవి:
సెమీ స్వీట్ కోకో చాక్లెట్ చిప్స్ – కప్పు
బటర్ – 2 టేబుల్ స్పూన్లు
ఫ్రూట్స్ (స్ట్రాబెర్రీ/ఆరెంజ్/ ద్రాక్ష / అరటిపండు,.. ) స్లైసులుగా కట్ చేసుకోవాలి – తగినన్ని
బేకింగ్ షీట్ – 1
తయారీ:
చాక్లెట్‌ను డబుల్ బాయిలర్ పద్ధతిలో కరిగించాలి. (స్టెయిన్ లెస్ లేదా గాజు గిన్నెలో చాక్లెట్ వేసి, మరుగుతున్న నీటిలో ఆ గిన్నెను ఉంచి, కలుపుతూ ఉండాలి. చాక్లెట్ కరిగాక ఆ గిన్నెను బయటకు తీసి, ఒక్కో స్ట్రాబెర్రీ లేదా నచ్చిన పండు ముక్కను ఆ మిశ్రమంలో ముంచి, ప్లేట్‌పై పరిచిన బేకింగ్ షీట్‌పై ఉంచాలి. దానిని డీప్ ఫ్రీజర్‌లో ఉంచి, అరగంట తర్వాత బయటకు తీసి సర్వ్ చేయాలి.

చాక్లెట్ బాల్స్
కావల్సినవి:
డ్రై ఆప్రికాట్స్ – 125 గ్రా. (తరగాలి);
ఎండుద్రాక్ష – అర కప్పు (తరగాలి);
ఆరెంజ్ తొక్క తరుగు – 2 టీ స్పూన్లు;
డార్క్ చాకోలెట్ తరుగు – 75 గ్రా.;
డార్క్ చాకోలెట్ (అదనంగా) – 200 గ్రాం.లు;
బటర్ – 75 గ్రా.;
తయారీ:
ఒక గిన్నెలో ఆప్రికాట్, ఎండ్రుద్రాక్ష, ఆరెంజ్ తొక్క తరుగు, డార్క్ చాకోలెట్ తరుగు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని టీ స్పూన్ అంత తీసుకొని బాల్స్‌లా చేయాలి. వీటిని డీప్ ఫ్రీజర్‌లో రాత్రంతా ఉంచాలి. అదనంగా తీసుకున్న 200 గ్రా.ల చాకోలెట్‌ను ముక్కలుగా చేయాలి. ఒక గిన్నెలో బటర్, చాకోలెట్ ముక్కలు వేయాలి.
పాన్‌లో నీళ్లు ΄ోసి, మరిగించి, ఆ నీటిలో ఈ గిన్నె ఉంచి చాకోలెట్ కరిగించాలి. మిశ్రమం మృదువుగా అయ్యాక దించాలి. ఫ్రిజ్ నుంచి తీసిన ఫ్రూట్ బాల్స్‌ని చాకోలెట్ మిశ్రమంలో ముంచి, తీయాలి. ఆరాక ఫాయిల్ పేపర్‌లో ఒక్కో చాకోలెట్ బాల్‌ని ఉంచి, చుట్టాలి. వీటిని ఫ్రిజ్‌లో ఉంచి అరగంట తర్వాత సర్వ్ చేయాలి.
(చదవండి: