ప్రముఖ ఫుడ్ అండ్ ట్రావెల్ గైడ్ టేస్ట్ అట్లాస్ తాజాగా ప్రపంచంలోనే అత్యుత్తమమైన చికెన్ వంటకాల జాబితాను ఆవిష్కరించింది. దక్షిణ కొరియా, ఫ్రాన్స్ చికెన్ రెసిపీలు కూడా ఈ జాబితాలో చోటుదక్కించుకున్నాయి. అయితే ఈ జాబితాలో అగ్రస్థానంలో పిలిక్ టాప్కాపి రెసిపీ ఉంది. ఇది చికెన్ తొడ వద్ద ఉండే బోన్‌లెస్ ముక్కలతో చేసే వంటకం. దీన్ని ఎండుద్రాక్ష, ఉల్లిపాయలు, సుగంధ ద్రవ్యాల మిశ్రమంతో తయారు చేస్తారు.
ఆ తర్వాతి స్థానంలో మొరాకోకు చెందిన రిఫిస్సా ఉంది. ఇది ఉడికించిన ఉల్లిపాయలు, కాయధాన్యాలతో తయారు చేసే సాంప్రదాయ వంటకం. ఇది తేలికపాటి తీపితో కూడిన రుచిని అందిస్తుంది. తదుపరి మూడవ స్థానంలో ఫ్రైడ్ చికెన్, నాల్గవ స్థానంలో రోస్ట్ చికెన్‌లు ఉన్నాయి. టాప్ 5లో ఇండియాకు చెందిన బటర్ చికెన్ చోటు దక్కించుకోవడం విశేషం.
ఇది ఎలా తయారు చేస్తారంటే.. రోస్ట్ చేసిన చికెన్ ముక్కలకు పుష్కలంగా మసాల దినుసులు జోడించి, క్రీమ్, టమోటాలు, వెన్నతో మంచి గ్రేవీ రూపంలో చేసే బటర్ చికెన్ ఇది. అంతేగాదు దీంతోపాటు మరికొన్ని ఇతర భారతీయ చికెన్ వంటకాలు కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకోవడం విశేషం.
అవేంటంటే..
తందూరీ చికెన్ (ర్యాంక్ 14)
చికెన్ టిక్కా (ర్యాంక్ 35)
చికెన్ 65 (ర్యాంక్ 38)
చికెన్ రెజాలా (ర్యాంక్ 51)
చికెన్ కాథి రోల్ (ర్యాంక్ 74)
టేస్ట్ అట్లాస్ ప్రకారం ప్రపంచంలోని టాప్ 10 చికెన్ వంటకాలు ఇవే:
పిలిక్ టాప్కాపి (టర్కియే)
రిఫిస్సా (మొరాకో)
కొరియన్ ఫ్రైడ్ చికెన్ (దక్షిణ కొరియా)
పెరువియన్ రోస్ట్ చికెన్ (పెరూ)
బటర్ చికెన్ (ఇండియా)
కరాగే (జపాన్)
ఫ్రెంచ్ రోస్ట్ చికెన్ (ఫ్రాన్స్)
డాక్ గల్బి (దక్షిణ కొరియా)
చికెన్ కరాహి (పాకిస్తాన్)
ఇనాసల్ నా మనోక్ (ఫిలిప్పీన్స్)
(చదవండి: షేక్ హసీనా 'జమ్దానీ' చీరల వెనక ఇంత స్టోరీ ఉందా..! ఆ కారణంతోనే ఆమె..)


