బంగ్లాదేశ్ విమోచన పోరాటంలో పాల్గొన్న స్వాతంత్య్ర సమరయోధుల వారసులకు ప్రభుత్వం ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కేటాయింపు అన్న అంశం చిలికి చిలికి గాలివానలా మారి..మాజీ ప్రధాని షేక్ హసినా ప్రభుత్వం కూలి, పదవిని కోల్పోవడం తోపాటు మరణశిక్ష పడేందుకు దారితీసింది. ఉక్కు మహిళగా కీర్తిగడించిన ఆమెను ఒక్కసారిగా నేరస్తురాలిలా నిలబెట్టి మరణశిక్ష విధించింది అంతర్జాతీయ నేరాల ట్రిబ్యూనల్. ఆ తీర్పుపై తనదైన శైలిలో షేక్ హసీనా స్పదించారు కూడా . దీన్ని ఆమె రాజకీయ ప్రేరేపిత తీర్పుగా అభివర్ణించారు కూడా. కాలం అనుకూలించకపోతే ఎంతటి శక్తిమంతమైన వాళ్లైనా నిర్వీర్యం అయిపోతారనేందుకు ఉదాహరణగా నిలిచిన షేక్ హాసినా దౌత్యపరమైన సంబంధాలను నెరిపేందుకు ఏం చేసేవారో తెలిస్తే విస్తుపోతారు. మరి ఆ విశేషాల గురించి సవివరంగా తెలుసుకుందామా..!.
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హాసినా..తన స్టైలిష్ లుక్‌తోనే ఆకట్టుకుంటారామె. ముఖ్యంగా ఆమె ధరించే జమ్దానీ చీరలు.. యావత్తు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. ఆ నేపథ్యంలోనే ఆమె ఈ చీరలను ధరించేవారా అని అంతా ఆశ్చర్యపోయేలా రాజకీయాలను ఫ్యాషన్‌ని మిళితం చేసిందామె. అంతేగాదు ఆమె కృషి ఫలితంగా చేతివృత్తుల వారికి ఉపాధి లభించడం తోపాటు పురాతన సాంస్కృతికి వారసత్వాన్ని పదిలపర్చుకునేలా.. ప్రపంచ దేశాలు దాని విశిష్టతను గుర్తించేందుకు దోహదపడింది.
జమ్దానీ చీరలను బెంగాల్‌లో అత్యంత అద్భుతమైన వస్త్ర సంప్రదాయాలలో ఒకటిగాగా చెబుతుంటారు. చేతితోమాత్రమే నేసే గొప్ప కళాఖండంగా అలరారే ఈ చీరలు అంతర్జాతీయ దృష్టిని సైతం అమితంగా ఆకర్షించాయి. అందుకు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనానే కారణం.
ఆమె చేసిన సాంస్కృతిక దౌత్య ప్రయత్నలేనని అంటుంటారు రాజకీయ విశ్లేషకులు. హసీనా మనం ధరించే దుస్తులే సంభాషిస్తాయి అని ప్రగాఢంగా విశ్వసించేవారామె. ఆ నేపథ్యంలోనే బంగ్లాదేశ్ సాంస్కృతిక కళా నైపుణ్యం, జాతీయ గర్వాన్ని ప్రతిబింబించేలా ఇలాంటి సాంప్రదాయ దుస్తులనే ఎంచుకునేవారామె.
అంతర్జాతీయ వేదికపై జమ్దానీ మెరిసిన క్షణాలు..
2014లో భారతదేశంలో సంబంధాలను బలోపేతం చేసే విషయమై ఈ చీరలోనే కనిపించారు. అంతేగాదు జూన్ 2014లో అప్పటి భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ బంగ్లాదేశ్ పర్యటన సందర్భంగా హసీనాకు దక్షిణ భారత పట్టు చీరను బహూకరించగా, హసీనా జమ్దానీ చీరను బహూకరించింది.
2015 ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌ను సందర్శించినప్పుడు హసీనా తెలుపు-బూడిద రంగుతో మిళితమైన జమ్దానీని ధరించింది.
అజర్‌బైజాన్‌లో జరిగిన NAM సమ్మిట్‌లో హసీనా జమ్దానీ-ప్రేరేపిత బృందం బంగ్లాదేశ్ నేత సంప్రదాయాన్ని ప్రపంచ దౌత్య వేదికపై ఉంచింది.
2021లో గ్లాస్గోలో జరిగిన COP26 వాతావరణ సదస్సులో నీలం బూడిదర రంగుతో కలగలసిన చీరలో మెరిసింది. అంతేగాదు అది నెట్టింట విపరీతంగా వైరల్ అయిన ఫోటోగా నిలిచింది.
సెప్టెంబర్ 2022లో హసీనా నాలుగు రోజుల భారతదేశ పర్యటన ఒక శిఖరాగ్ర క్షణం అని చెప్పొచ్చు. ఆమె ఆ సమయంలో కూడా ఆ చీరలనే ఎంచుకోవడం అనేది వ్యాపార నాయకులల్లో చర్చనీయాంశంగా హైలెట్ అయ్యింది.
G20 సమ్మిట్‌లో, హసీనా తిలక్ రంగు ధకై జమ్దానీని ధరించింది. ఇది భారతదేశంతో బంగ్లాదేశ్‌కి ఉన్న సంబంధాలను సూక్ష్మంగా నొక్కి చెబుతూనే ప్రపంచ వేదికపై ఈ కళను హైలైట్ చేసింది.
న్యూ ఢిల్లీ, లండన్, బ్రస్సెల్స్, మ్యూనిచ్‌లోని నాయకులతో జరిగిన అనేక ఉన్నత స్థాయి సమావేశాలలో జమ్దానీ చీరలోనే కనిపించారు హసీనా.
జమ్దానీ చరిత్ర
జమ్దానీ మూలాలు రెండు వేల సంవత్సరాల క్రితం పురాతన ఢాకా మగ్గాల నుంచి రూపుదిద్దుకుంది. ఈ పేరు పర్షియన్ పదాలైన "జామ్" (పువ్వు) "డాని" (కుండీ) నుంచి వచ్చింది. చీరలలో ఉపయోగించే నేత నమూనాలు వాటి నుంచి తీసుకోవడంతోనే ఈ చీరకు ఆ పేరు వచ్చింది.
జమ్దానిని ప్రత్యేకంగా నిలబెట్టేది శ్రమతో కూడిన "పారదర్శక నేత" సాంకేతికత. దీన్ని యాంత్రిక మద్దతు లేకుండా చేతితోనే తయారు చేస్తారు. అందువల్ల ఒక చీర తయారైందుకు నెలల తరబడి సమయం పడుతుంది. ఈ ప్రక్రియ చూసేందుకు తేలికగా కనిపించినా..చాలా క్లిష్టతరమైన చేతి పని.
అయితే ఇదే జమ్దాని చీర పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో విభిన్న వెర్షన్లు ఉన్నాయి. అయితే ప్రతి చీర వెనుక అపారమైన నైపుణ్యం, గంటల తరబడి శ్రమ తప్పక ఉంటుంది. అంతేగాదు ఇది ప్రపంచంలోనే అత్యంత గౌరవనీయమైన విలువైన చేసేత వస్త్రాల్లో ఒకటిగా పేరొందింది. అలాంటి చేనేత చీరను మాజీ ప్రధాని షేక్ హసీనా ధరించడంతో అంతర్జాతీయ ఆకర్షణ తోపాటు బంగ్లాదేశ్ స్వదేశీ నేత కార్మికులకు నేరుగా మద్దతు లభించినట్లయ్యింది కూడా. అలాగే ఈ చీరలకు భౌగోలిక(GI) గుర్తింపు సైతం లభించడం విశేషం.
గతేడాది నిరసనల టైంలో కూడా..
ఆగస్టు 2024లో, హసీనా రాజీనామా, బహిష్కరణకు దారితీసిన సందర్భంలో కూడా ఈ చీరలు వార్తల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. ఎందుకంటే ఆ ఘటనలో సాముహిక నిరసనకారులు ఢాకాలోని ఆమె అధికారిక నివాసాన్ని ముట్టడించి ఆమె వార్డ్‌రోబ్‌లోని జమ్దానీ చీరలను ఎత్తకుపోవడం అందర్నీ తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది.
(చదవండి: మానికా విశ్వకర్మకు అప్పుడు సుష్మితాను అడిగిన అదే ప్రశ్న..! స్త్రీగా ఉండటం అంటే అదే..)


