butter chicken
-
బటర్ చికెన్? కొరియన్ ఫ్రైడ్ చికెన్? టాప్ టెన్ డిషెస్ ఏవో తెలుసా?
చికెన్ వంటకాలంటే ఇష్టపడే వారికి ఇంట్రస్టింగ్ న్యూస్. ప్రముఖ ఫుడ్ అండ్ గైడ్ టేస్ట్ అట్లాస్ ప్రపంచంలోని టాప్ 100 చికెన్ వంటకాల ఏప్రిల్ 2026 ర్యాంకింగ్‌ను విడుదల చేసింది. భారతదేశానికి చెందిన క్రీమీ అండ్ టాంగీ చికెన్ గ్రేవీ వంటకం బటర్ చికెన్, ఈ ప్రపంచ జాబితాలో 6వ స్థానాన్ని దక్కించుకుంది.ఈ ఏడాది ర్యాంకింగ్స్‌లో, కొరియన్ ఫ్రైడ్ చికెన్ ‘చికిన్’అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఫిలిప్పీన్స్ ఇనాసల్ చికెన్‌కు మూడవ స్థానం దక్కింది. వెనిగర్, మసాలాలు , అన్నాటో నూనెల యొక్క ప్రత్యేకమైన మిశ్రమం దీనికి చక్కటి రంగులు, విలక్షణమైన రుచిని ఇస్తుంది.గత కొన్నేళ్లుగా యూఎస్, యూకే ఇతర దేశాలలో అపారమైన ప్రజాదరణ పొందిన, ఐకానిక్ బటర్ చికెన్ గత ఏడాది నవంబరులో జాబితాలో 5వ స్థానంలో నిలిచింది.టేస్ట్ అట్లాస్ ప్రకటించిన టాప్ 10 చికెన్ వంటకాలు చికిన్ (కొరియన్ ఫ్రైడ్ చికెన్) - సౌత్ కొరియా పోలో ఎ లా బ్రసా (పెరూవియన్ రోస్ట్ చికెన్) - పెరూఇనాసల్ నా మనోక్ - ఫిలిప్పీన్స్ పిలిక్ తోప్కపి - టర్కీముర్గ్ కరాహీ (చికెన్ కరాహీ) - పాకిస్థాన్ముర్గ్ మఖానీ (బటర్ చికెన్) - ఢిల్లీ, ఇండియారఫిస్సా - మొరాకో కరాగే - జపాన్పౌలెట్ రోటీ (ఫ్రెంచ్ రోస్ట్ చికెన్) - ఫ్రాన్స్సిట్సిలా టబాకా (చికెన్ టబాకా) - జార్జియా🍗 50 best chicken dishes⁰Tasteatlas ranking (Apr 2026)1🇰🇷 Chikin ★ 4.42🇵🇪 Pollo a la brasa ★ 4.43🇵🇭 Inasal na manok ★ 4.44🇹🇷 Piliç topkapı ★ 4.45🇵🇰 Chicken karahi ★ 4.46🇮🇳 Butter chicken ★ 4.47🇲🇦 Rfissa ★ 4.38🇯🇵 Karaage ★ 4.39🇫🇷 Poulet rôti ★ 4.310🇬🇪… pic.twitter.com/skWn4YsqNA— Cata Paul 🃏 (@CataPaul2) April 21, 2026కొరియన్ ఫ్రైడ్ చికెన్ ప్రత్యేకత ఏమిటి?కొరియన్ ఫ్రైడ్ చికెన్ ముఖ్య లక్షణాలలో ఒకటి డబుల్-ఫ్రైయింగ్ పద్ధతి. ముందుగా చికెన్‌ను తక్కువ ఉష్ణోగ్రత వద్ద వేయిస్తారు, దీనివల్ల మాంసం అంతా సమానంగా ఉడుకుతుంది. ఆ తర్వాత దానిని మళ్లీ అధిక ఉష్ణోగ్రత వద్ద వేయిస్తారు, దీని ఫలితంగా దానికి ప్రత్యేకమైన లేత, క్రిస్పీ , కరకరలాడే పైపొర వస్తుంది. కొరియన్ ఫ్రైడ్ చికెన్‌ను మరింత ప్రత్యేకంగా నిలబెట్టే విషయం ఏమిటంటే.. దానికి జోడించే అనేక రకాల సాస్‌లు , మసాలాలు. కారానికి పాపులర్అయిన గోచుజాంగ్, సోయా గార్లిక్, హనీ బటర్,తీపి-పులుపు కలగలిసిన గ్లేజ్‌లు ఉన్నాయి. వంటకాన్ని బట్టి, ఫ్రైడ్ చికెన్‌ను ఈ సాస్‌లలో ముంచి తినవచ్చు లేదా పైన సాస్‌తో కూడా వడ్డించవచ్చు.కొరియన్ ఫ్రైడ్ చికెన్‌ను సాధారణంగా ఊరగాయ ముల్లంగి, కోల్‌స్లా లేదా చల్లని పుచ్చకాయ ముక్కల వంటి వాటితో కలిపి వడ్డిస్తారు. దీనిని ఎక్కువగా బీరుతో ఆస్వాదిస్తారు. దీనికి 'చిమాక్' అనే ప్రత్యేక పేరు కూడా ఉంది. -
ది బెస్ట్ చికెన్ వంటకంగా బటర్ చికెన్..!
ప్రముఖ ఫుడ్ అండ్ ట్రావెల్ గైడ్ టేస్ట్ అట్లాస్ తాజాగా ప్రపంచంలోనే అత్యుత్తమమైన చికెన్ వంటకాల జాబితాను ఆవిష్కరించింది. దక్షిణ కొరియా, ఫ్రాన్స్ చికెన్ రెసిపీలు కూడా ఈ జాబితాలో చోటుదక్కించుకున్నాయి. అయితే ఈ జాబితాలో అగ్రస్థానంలో పిలిక్ టాప్కాపి రెసిపీ ఉంది. ఇది చికెన్ తొడ వద్ద ఉండే బోన్‌లెస్ ముక్కలతో చేసే వంటకం. దీన్ని ఎండుద్రాక్ష, ఉల్లిపాయలు, సుగంధ ద్రవ్యాల మిశ్రమంతో తయారు చేస్తారు. ఆ తర్వాతి స్థానంలో మొరాకోకు చెందిన రిఫిస్సా ఉంది. ఇది ఉడికించిన ఉల్లిపాయలు, కాయధాన్యాలతో తయారు చేసే సాంప్రదాయ వంటకం. ఇది తేలికపాటి తీపితో కూడిన రుచిని అందిస్తుంది. తదుపరి మూడవ స్థానంలో ఫ్రైడ్ చికెన్, నాల్గవ స్థానంలో రోస్ట్ చికెన్లు ఉన్నాయి. టాప్ 5లో ఇండియాకు చెందిన బటర్ చికెన్ చోటు దక్కించుకోవడం విశేషం. ఇది ఎలా తయారు చేస్తారంటే.. రోస్ట్ చేసిన చికెన్ ముక్కలకు పుష్కలంగా మసాల దినుసులు జోడించి, క్రీమ్, టమోటాలు, వెన్నతో మంచి గ్రేవీ రూపంలో చేసే బటర్ చికెన్ ఇది. అంతేగాదు దీంతోపాటు మరికొన్ని ఇతర భారతీయ చికెన్ వంటకాలు కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకోవడం విశేషం. అవేంటంటే..తందూరీ చికెన్ (ర్యాంక్ 14)చికెన్ టిక్కా (ర్యాంక్ 35)చికెన్ 65 (ర్యాంక్ 38)చికెన్ రెజాలా (ర్యాంక్ 51)చికెన్ కాథి రోల్ (ర్యాంక్ 74)టేస్ట్ అట్లాస్ ప్రకారం ప్రపంచంలోని టాప్ 10 చికెన్ వంటకాలు ఇవే:పిలిక్ టాప్కాపి (టర్కియే)రిఫిస్సా (మొరాకో)కొరియన్ ఫ్రైడ్ చికెన్ (దక్షిణ కొరియా)పెరువియన్ రోస్ట్ చికెన్ (పెరూ)బటర్ చికెన్ (ఇండియా)కరాగే (జపాన్)ఫ్రెంచ్ రోస్ట్ చికెన్ (ఫ్రాన్స్)డాక్ గల్బి (దక్షిణ కొరియా)చికెన్ కరాహి (పాకిస్తాన్)ఇనాసల్ నా మనోక్ (ఫిలిప్పీన్స్)(చదవండి: షేక్ హసీనా 'జమ్దానీ' చీరల వెనక ఇంత స్టోరీ ఉందా..! ఆ కారణంతోనే ఆమె..) -
మన బిర్యానీకి ప్రపంచమే ఫిదా
న్యూఢిల్లీ : భోజన ప్రియులు అత్యధికంగా తినే ఆహార పదార్ధాల్లో బిర్యానీ ముందు వరసలో ఉంటుంది. ఇందులో నాన్ వెజ్ ప్రియులు ఎక్కువగా తీసుకునే ఆహరం చికెన్ బిర్యానీ. ఆదివారం వచ్చిందంటే చాలు ఇంట్లో తయారు చేసుకోనో లేదా ఫుడ్ యాప్స్‌లో ఆర్డర్ చేసుకొనో లొట్టలేసుకుంటూ తింటారు. ఇక ఆన్లైన్ బుకింగ్‌లో చికెన్ బిర్యానీది ఎప్పుడూ నెంబర్ వన్ ప్లేసే.ఇది ఒక్క హైదరాబాద్ లేదా ఇండియాకే పరిమితం కాదు.. ప్రపంచమంతా మన బిర్యానీకి ఫిదా అయిపోయింది. 2019 సంవత్సరానికి గానూ ఆన్ లైన్ ఫుడ్ యాప్ సెర్చ్ లో టాప్ 10 ఐటమ్స్ లో దీనికే తొలిస్థానం దక్కింది. ఆ తర్వాతి స్థానంలో బటర్ చికెన్, సమోసా, చికెన్ టిక్కా మసాలా, దోశ, తందూరి చికెన్, పాలక్ పనీర్, నాన్, దాల్‌మఖని, చాట్ వంటి భారత వంటకాలు నిలిచాయి. వీటి గురించి కూడా నెటిజన్లు పెద్ద సంఖ్యలో వెతుకుతున్నట్టు అధ్యయనంలో తేలింది. పంజాబీ ప్రత్యేక వంటకమైన బటర్ చికెన్ కోసం 4 లక్షలసార్లు వెతికారట. సమోసా కోసం 3.9 లక్షల సెర్చ్‌లు రాగా, చికెన్ టిక్కా మసాలా కోసం నెలకు సగటున 2.5 లక్షల సెర్చ్‌లు వస్తున్నట్లు సర్వే తెలిపింది.ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లో భారతీయులు ఉండడం వల్లే ఇండియన్ ఫుడ్స్ టాప్ లో ఉన్నాయని సర్వే పేర్కొంది. -
సింగిల్స్‌కోసం కోహ్లీ ఏం చేశాడంటే..?
న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీలో ఒక్క జుట్టు, గడ్డం విషయంలో తప్ప ఫిట్‌నెస్‌లో మాత్రం ఎలాంటి మార్పు కనిపించదు. అతడు ఎప్పుడూ చాలా యాక్టీవ్‌గా ఉంటూ ఫుల్ ఎనర్జిటిక్‌గా అదే పర్సనాలిటీతో దర్శనమిస్తుంటాడు. ఇందుకు ప్రధాన కారణం ఈ పరుగుల వీరుడు తాను తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాడంట. ఆట ఆడే సమయంలో సింగిల్స్ ఎక్కువగా తీయాలనే ఉద్దేశంతో అందుకు అడ్డుగా ఉన్న బటర్ చికెన్, మటన్ రోల్స్ మొత్తానికి వదిలేశాడంట. ఈ విషయాన్ని స్వయంగా కోహ్లీ కోచ్ రాజ్ కుమార్ క్రికెట్ నెక్స్ట్‌తో మాట్లాడుతూ చెప్పారు. ఈ ఢిల్లీ క్రికెటర్ ప్రస్తుతం టీమిండియాలో ఉన్నత శిఖరం అధిరోహించడానికి ప్రతి విషయంలో విరాట్ నిబద్ధతే కారణం అని తెలిపారు. సాధారణంగా కోహ్లీ ఏవైనా సరే తాజాగా ఉండేవి మాత్రమే ఉపయోగిస్తాడని, ఇంటికొచ్చినప్పుడు ప్యాకెట్లలో ఉండే పండ్ల రసాలను ఇస్తే వాటికి నో అని చెప్పి ఇంట్లో పండ్లు ఉంటే వాటిని జ్యూస్‌గా తీసి ఇవ్వండని కోరతాడని చెప్పారు. అలాగే, కోహ్లీ అరటిపండ్లు బాగా తింటాడట. ప్రతి మ్యాచ్ ప్రారంభం సమయంలో కనీసం రెండు మూడు అరటిపండ్లు తింటాడని ఆయన చెప్పుకొచ్చారు. -
బిర్లా... బటర్ చికెన్ చిక్కు!
న్యూఢిల్లీ: రోమ్‌లో ఉన్నప్పుడు రోమన్‌లాగా ఉండాలని సామెత. ఇది వ్యాపారానికీ బాగా వర్తిస్తుంది. అంతర్జాతీయంగా విస్తరిస్తున్న భారత కంపెనీలు ఆయా దేశాల పరిస్థితులకు తగ్గట్లుగా మారక తప్పడం లేదు. 36 దేశాల్లో 4,000 కోట్ల డాలర్ల బిర్లా గ్రూప్‌ను నడిపిస్తున్న కుమార మంగళం బిర్లా ఉదంతమే దీనికి నిదర్శనం. ఆయన మార్వాడీ కమ్యూనిటీకి చెందినవారు. మార్వాడీల జీవితాల్లో శాకాహారం ప్రధానమైన అంశం. అందుకే ఈ కంపెనీ క్యాంటీన్లలో, కంపెనీ కార్యక్రమాల్లో ఎక్కడా మాంసాహారం, వైన్, విస్కీల సరఫరా ఉండదు. ఇదంతా అంతర్జాతీయ విస్తరణకు ముందు మాత్రమే. ఈ గ్రూప్ 2003లో ఆస్ట్రేలియా లో చిన్న రాగి గనుల కంపెనీని కొనుగోలు చేసింది. ఆస్ట్రేలియా కార్మికుల రోజువారీ జీవితాల్లో ఫోస్టర్ బీర్, బటర్ చికెన్ తప్పనిసరి. దీంతో ఆక్కడి బిర్లా క్యాంటీన్లలో ఈ రెండింటినీ సరఫరా చేయక తప్పలేదని బిర్లా పేర్కొన్నారు. రీ ఇమాజినింగ్ ఇండియా, అన్లాకింగ్ ద పొటెన్షియల్ ఆఫ్ ఏషియాస్ నెక్స్ట్ సూపర్ పవర్ అన్న పుస్తకంలో రాసిన వ్యాసంలో ఆయన ఈ ఉదంతం వెల్లడించారు.


