కిడ్స్ స్పెషల్
కల్చర్..
పిల్లలూ... మన ఊర్లో ‘ఎడ్ల పందాలు’, ‘కోడి పందాలు’ లాగే ఇంగ్లాండ్‌లో గుర్రాల పండగ జరుగుతుంది. ఇంగ్లాండ్‌లో ‘యాపిల్‌బై’ అనే చిన్న ఊరులో మొన్న జూన్ 6న ‘గుర్రాల స్నానం పండుగ’ జరిగింది. ప్రతి వేసవిలో ఈ పండగ చేస్తారు. ఇది 300 ఏళ్ల పాత పండగ!
పండుగ రోజు ‘జిప్సీ’ అనే సంచార జాతి వాళ్లు ఎక్కడెక్కడి నుంచో అందమైన గుర్రాలు, రంగురంగుల బండ్లతో యాపిల్ బైకి వచ్చేస్తారు. తాము ప్రయాణం చేసి వచ్చిన గుర్రాలకి అక్కడి ‘ఈడెన్’ నదిలో స్నానం చేయిస్తారు. చల్లటి నీళ్లలో గుర్రాలు హాయిగా ఈదుతాయి. స్నానం చేసి, జూలు దువ్వుకున్న గుర్రాలు మెరిసిపోతాయి. అప్పుడు వాటిని కొనడానికి, అమ్మడానికి బేరాలు జరుగుతాయి.
గుర్రాలే కాదు, చిన్న పిల్లలు, పెద్దవాళ్లు అందరూ కలుసుకుని ఆడతారు, పాడతారు, కథలు చెప్పుకుంటారు. గుర్రాలు నదిలో ‘టప్ టప్’ అని నడుస్తుంటే చూడ్డానికి వేల మంది వస్తారు. కొందరు గుర్రాల మీద కూర్చునే నదిలోకి దిగుతారు. భలే థ్రిల్లింగ్‌గా ఉంటుంది! ఈ జాతరలో ‘బౌ–టాప్ వాగన్’ అనే గుండ్రని పైకప్పు ఉన్న బండ్లు స్పెషల్. ఇవి జిప్సీల తిరుగాడే ఇళ్లు. మనం ప్రతి సంస్కృతిని గౌరవించాలి.


