కేరళలోని కొల్లం జిల్లాలో చమయవిళక్కు ఉత్సవాలు ఈ మధ్యే ఘనంగా జరిగాయి
వందల సంఖ్యలో పురుషులు మహిళల వేషధారణలో వచ్చి శ్రీ కొట్టంకులంగర దుర్గ భగవతి ఆలయంలో దీపార్చన చేశారు
పురుషులు.. మహిళల వేషధారణలో వచ్చి ఇక్కడ పూజలు చేయడం సంప్రదాయంగా వస్తోంది
వారు ఐదు ఒత్తులు కలిగిన ప్రత్యేక దీపాలు వెలిగించి అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకుంటారు
రెండు రోజుల పాటు జరిగే చమయవిళక్కు ఉత్సవాల్లో ట్రాన్స్‌జెండర్లు కూడా భారీగా తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు
పురుషులు స్త్రీగా అలంకరించుకుంటే దేవుడు సంతోషించి వారి కోరికలను తీరుస్తాడని ఇక్కడి భక్తుల నమ్మకం
కుల మతాలకు అతీతంగా అన్ని ప్రాంతాలవారూ పెద్ద సంఖ్యలో ఈ ఉత్సవాల్లో పాల్గొనడం మరో విశేషం


