
విఘ్నాలను తొలగించే వినాయకుడిని అత్యంత భక్తి శ్రద్దలతో కొలిచేందుకు యావత్ భక్తజనం సంసిద్ధమవుతోంది. చిన్నా పెద్దా అంతా బొజ్జగణపయ్యను కొలిచేందుకు ఉవ్విళ్లూరుతారు. తొమ్మిది రోజుల పాటు దేశవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి.గణేష్ చతుర్థిని భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా అపారమైన భక్తితో జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా తప్పక సందర్శించాల్సిన అయిదు ప్రత్యేకమైన గణేష్ విగ్రహాల గురించి తెలుసుకుందాం.
ప్రతి సంవత్సరం వినాయక చవితిని భాద్రపద శుక్ల చవితి తిథి నాడు జరుపుకుంటారు. కోరిన కోర్కెలు నేరవేర్చు స్వామీ అని ఆ గణనధుడుని వేడుకొని వినాయకవత్రకథను చదువుకొని అక్షితలు వేసుకొని చంద్రుడిని దర్శించుకుంటారు. అనేక మంటపాల్లో కొలువుదీరిన గణపతిని తనివితీరా దర్శిస్తారు. ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గోవా వంటి రాష్ట్రాలతోపాటు, మలేషియా, నేపాల్, సింగపూర్, మారిషస్ ,కెనడా లాంటి దేశాల్లో కూడా సంబరాలు జరుగుతాయి. ప్రపంచంలో కూడా గణేష్ విగ్రహాలకు ప్రత్యేకత ఉంది. థాయిలాండ్‌లోని ఎత్తైన విగ్రహంతోపాటు, జపాన్, మలేషియా,అమెరికా, బాలిలోని అద్భుతమైన గణపతి విగ్రహాలకు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది.
ఇదీ చదవండి: Yoga మైగ్రేన్‌తో భరించలేని బాధా? బెస్ట్ యోగాసనాలు
మహా గణపతి ఆలయం, ఫ్లషింగ్, న్యూయార్క్ (USA)
ఉత్తర అమెరికాలోని అతిపెద్ద హిందూ దేవాలయాలలో ఒకటి, ఇది అద్భుతమైన గణేష్ విగ్రహాన్ని కలిగి ఉంది. గణేష్ చతుర్థి సందర్భంగా భక్తులు ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తారు.
గణేష్ విగ్రహం, చాచోఎంగ్సావో (థాయిలాండ్)
థాయిలాండ్ ప్రపంచంలోనే ఎత్తైన గణేష్ విగ్రహాలలో ఒకటి. ఈ విగ్రహం 39 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ గులాబీ రంగు గణేష్ విగ్రహం, రిలాక్స్డ్ భంగిమలో కూర్చుని, జ్ఞానం , శ్రేయస్సును సూచిస్తుంది.
గణేశ మందిరం, టోక్యో (జపాన్)
టోక్యోలోని కన్నోన్-జి ఆలయంలోని గణేశ మందిరంలో జపాన్ బౌద్ధ మరియు హిందూ దేవతలతో సాంస్కృతిక సంబంధాలు ప్రతిబింబిస్తాయి. ఇక్కడి విగ్రహాన్ని సంపదకు, విజయానికి సంరక్షకుడిగా భావిస్తారు.

బాటూ కేవ్స్, మురుగన్ కౌలాలంపూర్ (మలేషియా)
మలేషియాలోని బాటు గుహల వద్ద కొలువుదీరని మురుగన్‌కు కూడా చాలా ప్రాధాన్యత ఉంది. ఈ గుహల ప్రవేశ ద్వారం వద్ద ఒక అద్భుతమైన గణేశ విగ్రహం కొలువుదీరి ఉంటుంది. గణేశ చతుర్థి సందర్భంగా పర్యాటకులు, భక్తులకు ఇది ప్రధాన ఆకర్షణ.

గణేశ విగ్రహం, బాలి (ఇండోనేషియా)
బాలిలో,ఉబుద్‌లోని ఒక ప్రత్యేకమైన రాతితో చెక్కిన విగ్రహం అత్యంత ప్రజాదరణ పొందిన వాటిలో ఒకటిగా వెలుగొందుతోంది. ఇది రక్షణ జ్ఞానానికి ప్రతీకగా భావిస్తారు.