breaking news
Lord Ganesh
-
రూ.1.53 కోట్ల కరెన్సీతో అలంకరణ
వరంగల్ శివనగర్‌లోని వాసవి కాలనీలో వినాయక ట్రస్టు ఆధ్వర్యంలో ప్రతిష్టించిన మట్టి విఘ్నేశ్వరుడిని శుక్రవారం రాత్రి కోటీ యాభై మూడు లక్షల, నూట పదహారు రూపాయల కరెన్సీతో అలంకరించారు. సుమారు 200 మందికిపైగా ఉత్సవ కమిటీ సభ్యులు, ప్రతి నిధులు, కాలనీవాసులు ఈ కరెన్సీని అందజేశారు. ఈ కార్యక్రమంలో వినాయక ట్రస్టు భవనం అధ్యక్షుడు సాదుల దామోదర్, కార్యదర్శి మంచాల కృష్ణమూర్తి, కోశాధికారి రావికంటి అశోక్ పాల్గొన్నారు. – ఖిలా వరంగల్గణపతి.. ధనపతిమంచిర్యాల అర్బన్: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని విశ్వనాథస్వామి ఆలయ కాలక్షేప మండపంలో ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో ప్రతిష్టించిన వినాయకుడిని కరెన్సీ నోట్లతో అలంకరించారు. శుక్రవారం రాత్రి రూ.25,11,116 కరెన్సీ నోట్లతో మండపాన్ని తీర్చిదిద్దారు. భక్తులు కరెన్సీ గణపతిని దర్శించుకునేందుకు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ధననాథుడు గుంటూరు జిల్లా మంగళగిరి మెయిన్ బజారులో ఆర్యవైశ్య సంఘం, సంకా బాలాజీ గుప్తా యూత్, స్థానిక వ్యాపారుల సహకారంతో ఏర్పాటు చేసిన గణనాథుడు శుక్రవారం ‘ధన’నాథుడుగా దర్శనమిచ్చాడు. ఉత్సవ నిర్వాహకులు రూ.2.35 కోట్ల కరెన్సీ నోట్లతో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. – మంగళగిరి టౌన్వినాయక లడ్డు, కలశం @రూ.49 లక్షలుప్రకాశం జిల్లా సీఎస్‌పురం మండలం అయ్యలూరివారిపల్లెలో వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా 3వ రోజు శుక్రవారం గణపతి మండపం వద్ద నిర్వహించిన లడ్డు, కలశం వేలంలో లడ్డు రూ.30 లక్షలు, కలశం రూ.19 లక్షలు పలికింది. వేలంలో లడ్డును అదేగ్రామానికి చెందిన పాలుగుళ్ల మోహన్‌రెడ్డి, కవిత దంపతులు రూ.30,00,116కు దక్కించుకోగా, కలశాన్ని అదేగ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్యాల నారాయణరెడ్డి, సర్పంచ్ ముత్యాల భారతీరెడ్డి దంపతులు రూ.19.10 లక్షలు వెచ్చించి దక్కించుకున్నారు. – సీఎస్‌పురం (పామూరు) -
కొలువుదీరిన గణనాథులు.. పాఠకులు పంపిన ఫోటోలు
-
వినాయక చవితి పూజ ప్రాముఖ్యత, అష్టోత్తర శతనామావళి
వినాయకచవితి నాడు ఉదయాన్నే మేల్కొని, కాలకృత్యాలు తీర్చుకొని, అభ్యంగన స్నానమాచరించి, శుభ్రమైన దుస్తులు ధరించి, వ్రతమాచరించాలి. ఇంటిని శుభ్రపరచుకొని, స్వస్తిక్ పద్మాన్ని లిఖించి, అరటిబోదెలతో మంటపాన్ని ఏర్పాటు చేసుకొని, పాలవెల్లి కట్టిన పీఠంపై తెల్లటి వస్త్రం పరచి, హరిద్రా గణపతిని, మట్టి వినాయకుని స్థాపించి, ఆహ్వానించి దూర్వా (గరిక) తదితర ఏకవింశతి (21) పత్రాలతో, షోడశోపచారాలతో పూజించి, వినాయకోత్పత్తి కథను చదువుకొని, అక్షతలను శిరస్సుపై ధరించాలి. స్వామివారికి వడపప్పు, కొబ్బరి, చెరకు, బెల్లం, ఉండ్రాళ్లు, లడ్డూలు, మోదకాలు, కుడుములు నివేదించాలి. పూజ ప్రాముఖ్యతవినాయకుడు విఘ్నాలను తొలగించే దేవుడు. అందుకే ఏ శుభకార్యం మొదలుపెట్టే ముందు ‘వక్రతుండ మహాకాయ‘ మంత్రంతో ఆయనను ప్రార్థించడం ఆచారం.మొదట గణపతి పూజ చేయడం ద్వారా అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. జ్ఞానం, బుద్ధి, ధైర్యం ప్రసాదిస్తాడు. భక్తుని మనసులో ఆత్మవిశ్వాసాన్ని నింపుతాడని విశ్వాసంవినాయకచవితి పండుగ వచ్చిందంటే ఉదయాన్నే మేల్కొని, అభ్యంగన స్నానమాచరించి, పూజా ఏర్పాట్లు మొదలుపెడతాం. ఇంటిని శుభ్రపరచుకొని, అరటిబోదెలతో, పుష్పాలతో మంటపాన్ని అలంకరించి, పైన పాలవెల్లి వ్రేలాడదీసి మండపంలో స్వస్తిక్ పద్మాన్ని లిఖించి, హరిద్రా గణపతిని, మట్టి వినాయకుని స్థాపించి, దీపారాధన గావించి స్వామిని ఆహ్వానిస్తాం. సేకరించిన పత్రి, గరిక (దుర్వాయుగ్మాలు)లతో, అర్కపూలతో, షోడశోపచారాలతో పూజించి, యథాశక్తితో ఉండ్రాళ్లు, చలిమిడి, వడపప్పు తదితర ప్రసాదాలు నివేదించి వినాయక కథ, శమంతకోపాఖ్యానము చదువుకొని లేదా విని అక్షింతలు కొన్ని స్వామి పాదాలవద్ద వుంచి, తమ శిరస్సుపై ధరించాలి.శ్రీ విఘ్నేశ్వరుని పూజకు ముందుగా సమకూర్చుకోవలసినవిపూజాద్రవ్యాలు : వినాయక ప్రతిమ, పత్రి, పసుపు, కుంకుమ, అగరువత్తులు, హారతి కర్పూరం, గంధం, సాంబ్రాణి, అక్షతలు, బియ్యం, ఆవునెయ్యి లేదా నువ్వులనూనె, పంచామృతాలు (ఆవుపాలు, పెరుగు, నేయి, తేనె, పంచదార), తమలపాకులు, పోకచెక్కలు, పువ్వులు, పూమాల, పళ్ళు, కొబ్బరి కాయలు, కలశం, నైవేద్య పదార్థములు, సుగంధ ద్రవ్యములు.పూజావస్తువులు : దీపం కుందులు, వత్తులు, అగ్గిపెట్టె, వస్త్రం, యజ్ఞోపవీతం, పంచపాత్ర, ఉద్ధరిణి, కలశంమీద నూతన వస్త్రం, పూజాస్థలంలో పీఠంపై వేయడానికి తగిన పరిమాణంలో తెల్లని వస్త్రం/ తువ్వాలు, పళ్ళెం, పాలవెల్లి, నూలు వస్త్రాలు, మామిడి తోరణాలు, దేవునికి తగిన పీఠం.నైవేద్యం : ఉండ్రాళ్లు–21, కుడుములు, వడపప్పు, పానకం, అటుకులు, కొబ్బరి ముక్కలు, బెల్లం, అరటిపళ్ళు, దోసపండు, పిండివంటలు మొదలగునవి.పూజాపత్రి : గరిక, మాచిపత్రి, బలురక్కసి లేక ములక, మారేడు, ఉమ్మెత్త, రేగు, ఉత్తరేణి, తులసి, మామిడి, గన్నేరు, విష్ణుక్రాంతం, దానిమ్మ, దేవదారు, మరువం, వావిలాకు, జాజి, దేవకాంచనం, జమ్మి, రావి, తెల్లమద్ది, జిల్లేడు మొదలగునవి తమకు లభ్యమగు పత్రిని సంపాదించి ఆయా మంత్రాలతో స్వామి వారిని భక్తి శ్రద్ధలతో పూజించాలి. ఒకవేళ పత్రిలో లోపం కలిగినా భక్తిలో మాత్రం లోపం ఉండరాదు. పత్రి సకాలంలో లభ్యంకానిచో పువ్వులు, అక్షింతలతో పూజించి నమస్కరించాలి.పాలవెల్లి పూజ : శ్రీ విఘ్నేశ్వరస్వామి వారి పీఠానికి పైభాగాన పాలవెల్లిని కట్టాలి, పాలవెల్లిని పసుపు కుంకుమలతోను, పూజాపత్రితో తోచినవిధంగా శోభాయమానంగా అలంకరించు కోవచ్చు. దీనినే మనం సాధారణంగా పాలవెల్లి పూజ అంటాము.పూజా మందిరంలో : విఘ్నేశ్వరస్వామి పూజకు ఉపక్రమించే ముందు ఇంటిలో చదువుకునే పిల్లలు ఉన్నట్లయితే స్వామి ప్రతిమతోపాటు సరస్వతీదేవి పటం, వారి పాఠ్యపుస్తకాలు, పెన్ను, పెన్సిల్. అలాగే గృహస్థు(యజమాని) వ్యాపారి అయితే శ్రీలక్ష్మీ అమ్మవారి పటం, వ్యాపార లెక్కల పుస్తకాలు, సంబంధిత వస్తువులు ఇలా ఇతర వృత్తులలో వున్నవారు వారి ప్రధానమైన వస్తువులతోపాటుగా వారి ఇష్టదైవం పటాన్ని పెట్టి పూజించడం శుభఫలదాయకం.గణేశుని పూజ పూజకు ఏర్పాట్లుముందుగా పీట మీద ముగ్గువేసి, బియ్యంపోసి, దానిమీద శ్రీ విఘ్నేశ్వరస్వామి వారి ప్రతిమను ఉంచి పైభాగాన పసుపుకుంకుమలతో అలంకరించిన పాలవెల్లిని కట్టాలి. పసుపు వినాయకుణ్ణి చేయాలి. పూజ చేసేవాళ్ళు బొట్టు పెట్టుకుని దీపారాధనచేసి వినాయకునికి నమస్కరించి పూజ ప్రారంభించాలి. ముందుగా పసుపుతో చేసిన గణపతిని పూజించాలి.ఓం శ్రీ మహాగణాధిపతయే నమఃదీపారాధన : (ఈ క్రింది శ్లోకాన్ని చదువుతూ దీపాన్ని వెలిగించి, దీపం కుందివద్ద అక్షతలు ఉంచి నమస్కరించాలి.)శ్లో‘‘ భోదీపదేవి రూపస్త్యం, కర్మసాక్షి హ్యామిఘ్నకృత్‘ యావత్పూజాం కరిష్యామి తావత్వం సిద్ధిదో భవ ‘‘ దీపారాధన ముహూర్తస్తు సుముహూర్తోస్తు‘‘పరిశుద్ధి : (పంచపాత్రలోని నీటిని ఉద్ధరిణతో తీసుకుని కుడిచేతి బొటనవేలు, మధ్య ఉంగరపు వేళ్ళతో నీటిని ఈ క్రింది మంత్రం చెబుతూ తలపై చల్లుకోవాలి)అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా!యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతరశ్శుచిఃపుండరీకాక్ష, పుండరీకాక్ష, పుండరీకాక్షాయ నమః శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు శ్రీ గణేశాయ నమఃశ్లో‘‘ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వ విఘø్నపశాన్తయే ‘‘ అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేక దన్తం భక్తానాం యేకదన్త ముపాస్మహే ‘‘శ్రీ గణేశ షోడశ నామ ప్రతిపాదక శ్లోకాఃశ్లో‘‘ సుముఖశ్చైకదన్తశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః వక్రతుండః శూర్పకర్ణో హేరమ్బస్కన్దపూర్వజఃషోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపిఃవిద్యారమ్భే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా,సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తన్య నజాయతే ‘‘ఆచమనంఓం కేశవాయ స్వాహానారాయణాయ స్వాహామాధవాయ స్వాహా (అని 3 సార్లు తీర్థం పుచ్చుకోవాలి) తరువాత చేయి కడుక్కోవాలి.గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమఃత్రివిక్రమాయ నమః వామనాయ నమఃశ్రీధరాయ నమః హృషీకేశాయ నమఃపద్మనాభాయ నమః దామోదరాయ నమఃసంకర్షణాయ నమః వాసుదేవాయ నమఃప్రద్యుమ్నాయ నమః అనిరుద్ధాయ నమఃపురుషోత్తమాయ నమః అధోక్షజాయ నమఃనారసింహాయ నమః అచ్యుతాయ నమఃజనార్దనాయ నమః ఉపేంద్రాయ నమఃహరయే నమః శ్రీ కృష్ణాయ నమః(రెండు అక్షింతలు వాసన చూసి వెనుకకు వేయవలెను)శ్లో‘‘ ఉత్తిష్ఠంతు భూత పిశాచాః! యేతే భూమి భారకాః ఏతేషామవిరోధేన! బ్రహ్మకర్మ సమారభే!(ముక్కుపట్టుకుని ఎడమవైపు నుండి గాలిపీల్చి క్రింది మంత్రం చదివిన తరువాత ముక్కు కుడివైపు నుండి గాలి వదలవలెను.)ప్రాణాయామముఓం భూః ఓం భువః ఓగ్ం సువః ఓం మహః ఓం జనఃఓం తపః ఓగ్ం సత్యం ఓం తత్సవితుర్వ రేణ్యం భర్గోదేవస్యధీమహి ధియోయోనః ప్రచోదయాత్‘‘ ఓమాపో జ్యోతీరసోమృతం బ్రహ్మభూర్భువస్సువరోమ్‘‘సంకల్పం : మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభన ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞేయా ప్రవర్తమానస్య ఆద్యబ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే, ్జకృష్ణా – గోదావరి నదీ మధ్య ప్రదేశే స్వగృహే (సొంత ఇల్లుకానివారు మమ వసతిగృహే అని చెప్పుకోవాలి) సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక స్వస్తిశ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వావసు నామ సంవత్సరే, దక్షిణాయనే, వర్ష బుుతౌ, భాద్రపద మాసే, శుక్లపక్షే, చతుర్థి తిథౌ, ఋధవాసరే, శుభనక్షత్రే, శుభయోగే, శుభకరణ, ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ, శ్రీమాన్ శ్రీమతః గోత్రః................. (మీ గోత్రం చెప్పవలెను) నామధేయః ................................ (ఇంటిపెద్ద / యజమాని తన పేరు చెప్పుకోవలెను) ధర్మపత్నీ సమేతస్య మమ సపుత్రకస్య, సపుత్రికస్య సహ కుటుంబానాం క్షేమ, స్థైర్య, ధైర్య, వీర్య, విజయ, అభయ, ఆయురారోగ్య, ఉద్యోగ, వ్యాపార, ఐశ్వర్యాభివృద్ధ్యర్థం, ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం, సకల ధనకనక, విద్యా ప్రాప్త్యర్థం, వస్తువాహన సమృద్ధ్యర్థం, పుత్రపౌత్రాభివృద్ధ్యర్థం, సర్వాభీష్ట ఫల సిద్ధ్యర్థం శ్రీ వరసిద్ధివినాయక దేవతా ముద్దిశ్య శ్రీ వరసిద్ధివినాయక దేవతా ప్రీత్యర్థం కల్పోక్త ప్రకారేణ యావచ్ఛక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే‘‘(కుడిచేతి ఉంగరపు వేలిని నీటిలో తాకవలెను)తదంగ కలశపూజాం కరిష్యేః(మరలా కుడిచేతి ఉంగరపు వేలిని నీటిలో తాకవలెను)కలశపూజ : (కలశాన్ని గంధం, పుష్పాలు, అక్షతలతో పూజించి కలశంపై కుడిచేతిని ఉంచి, కింది శ్లోకం చెప్పుకొనవలెను)శ్లో‘‘ కలశస్య ముఖే విష్ణుః కంఠేరుద్ర సమాశ్రితఃమూలేతత్రస్థితో బ్రహ్మా మధ్యే మాతృగణా స్మృతాఃకుక్షౌతు సాగరాః సర్వేసప్తద్వీపా వసుంధరా!ఋగ్వేదోధయజుర్వేదస్సామవేదో హ్యధర్వణఃఅంగైశ్చసహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాఃగంగేచ యమునేచైవ కృష్ణా గోదావరి సరస్వతి!నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు ‘‘అయాంతు శ్రీ గణపతి పూజార్థం దురితక్షయ కారకాః కలశోదకేన పూజా ద్రవ్యాణిచ సంప్రోక్ష్యః దేవమాత్మానాంచ సంప్రోక్ష్యః(పసుపుతో చేసిన గణపతిని తమలపాకుపై ఉంచి కుంకుమతో బొట్టు పెట్టవలెను. పసుపు విఘ్నేశ్వరుని కింది విధంగా పూజించాలి)శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి (నమస్కరించవలెను) గణానాంత్వా గణపతిగ్ం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణాస్పత ఆనఃశృణ్వన్నూతిభిస్సీదసాధనంఆవాహయామి ఆవాహనం సమర్పయామి (నీటిని చల్లవలెను)పాదయోః పాద్యం సమర్పయామి (మరల నీటిని చల్లవలెను)హస్తయోః అర్ఘ్యం సమర్పయామి (మరల నీటిని చల్లవలెను)ముఖే ఆచమనీయం సమర్పయామి (మరల నీటిని చల్లవలెను)ఔపచారిక స్నానం సమర్పయామి (నీటిని చల్లవలెను)స్నానానంతర ఆచమనీయం సమర్పయామి (నీటిని చల్లవలెను)వస్త్రం సమర్పయామి (పత్తితో చేసిన వస్త్రం లేదా పుష్పం ఉంచాలి)గంధాన్ ధారయామి (గంధమును చల్లవలెను)కుంకుమం సమర్పయామిగంధస్యోపరి అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి (అక్షతలు చల్లవలెను)పుష్పాని సమర్పయామి (పూలతో స్వామివారిని అలంకరించవలెను) స్వామికి పుష్పాలతో పూజ(ఈ క్రింది నామాలు చదువుతూ పుష్పాలతో పూజ చేయవలెను)ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజకర్ణికాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం గణాధిపాయనమః ఓం ధూమకేతవే నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం ఫాలచంద్రాయ నమః ఓం గజాననాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః ఓం హేరంబాయ నమః ఓం స్కంద పూర్వజాయ నమః ఓం మహాగణాధిపతయే నమః నానావిధ పరిమళ పత్రపుష్పాణి సమర్పయామి(పుష్పాలతోను, పత్రితోనూ పూజించవలెను)ధూపం ఆఘ్రాపయామి (అగరువత్తిని వెలిగించవలెను)దీపం దర్శయామి (దీపమును చూపవలెను)నైవేద్యం సమర్పయామి (బెల్లం ముక్కను నైవేద్యం పెట్టాలి)ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహిః ధియోయోనః ప్రచోదయాత్‘‘ సత్యం త్వర్తేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి (అని చెప్పి నైవేద్యముపై చుట్టూ నీటిని తిప్పి నైవేద్యంపై నీటిని అభికరించి ఎడమచేతితో కుడిచేతిని పట్టుకొని, కుడిచేతితో నైవేద్యాన్ని గణాధిపతికి చూపిస్తూ ఈ కింది మంత్రాలు చెప్పుకోవలెను).ఓం ప్రాణాయ స్వాహా, ఓం అపానాయ స్వాహా, ఓం వ్యానాయ స్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహాశ్రీ మహాగణాధిపతయే నమః యథాభాగం గుడం నివేదయామి (బెల్లం ముక్కను నివేదించాలి)మధ్యే మధ్యే పానీయం సమర్పయామి (నీటిని చల్లవలెను)హస్తప్రోక్షయామి, పాదౌ ప్రోక్షయామి, ముఖే ఆచమనీయ సమర్పయామి (4సార్లు నీళ్ళు చూపించి వదలాలి)తాంబూలం సమర్పయామి (తాంబూలం ఉంచవలెను)ఆచమనీయం సమర్పయామి (నీటిని చల్లవలెను)ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి (కర్పూరమును వెలిగించాలి)శ్లో‘‘ వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభ ‘అవిఘ్నంకురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా ‘‘శ్రీ మహాగణాధిపతయే నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి.గణాధిపతిః సుప్రీతః సుప్రసన్నో వరదో భవతు. మమ ఇష్టకామ్యార్థ çఫలసిద్ధ్యర్థం గణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి(గణపతికి పూజచేసిన అక్షతలు కొన్ని తీసుకొని శిరస్సున ఉంచుకొనవలెను.)శ్రీ మహాగణాధిపతిం యథాస్థానం ప్రవేశయామి (పసుపు గణపతిని తూర్పునకు కొద్దిగా జరిపి మరల యథాస్థానంలో పెట్టాలి)స్వామిన్, సర్వజగన్నాథ యావత్పూజావసానగా ఃతావత్త్వం ప్రీతిభావేన బింబేస్మిన్ సన్నిధింకురుధ్యానం : స్వామి వారి రూపాన్ని ఊహించుట (పువ్వులు, అక్షతలు చేతితో పట్టుకుని గణపతికి నమస్కరిస్తూ ఈ క్రింది ప్రార్థన చేసిన తరువాత ఆయన పాదాల వద్ద ఉంచాలి) ఓం భవసంచిత పాపౌçఘ విధ్వంసన విచక్షణం‘‘విఘ్నాంధ కారభాస్వంతం విఘ్నరాజ మహం భజే‘‘ ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం‘‘పాశాంకుశధరం దేవం ధ్యాయేత్సిద్ధి వినాయకమ్‘‘ ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం ‘‘ భక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్తం విఘ్న నాయకమ్ ‘‘ ద్యాయేద్గజాననం దేవం తప్తకాంచన సన్నిభం‘‘చతుర్భుజం మహాకాయం సర్వాభరణ భూషితం ‘‘శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధివినాయక స్వామినే నమః ధ్యాయామి. (వినాయకుని ధ్యానించండి...)ప్రాణ ప్రతిష్ఠః (స్వామి వారికి ప్రాణం పోయుట) ఓమ్ అసునీతే పునరస్మాను చక్షుః పునః ప్రాణ మిహనో దేహి భోగమ్‘ జ్యోక్పశ్యేమ సూర్యముచ్ఛరంత మనుమతే మృడయాన స్వస్తి అమృతం నై ప్రాణాః అమృత మాపః‘ ప్రాణానేవ యథాస్థాన మువహ్వయతే ‘‘ స్వామిన్ సర్వజగన్నాథ యావత్పూజావసానకమ్‘ తావత్త్వం ప్రతిభావేన ప్రతి మేస్మిన్ సన్నిధిం కురు‘‘ సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీ పుత్రం పరివార సమేతం శ్రీ వరసిద్ధివినాయక స్వామిన్ ఆవాహితో భవ, స్థాపితో భవ, సుముఖోభవ, సుప్రసన్నోభవ, వరదో భవ, స్థిరాసనంకురు, ప్రసీదః ప్రసీదః ప్రసీద‘‘ఆవాహనమ్ : స్వామివారిని పిలవటం స్వామివారు వచ్చినట్లుగా భావించటం. (పువ్వులు, అక్షతలు చేతితో పట్టుకుని గణపతికి ఆసనం చూపుతూ నమస్కరించి ఈ క్రింది శ్లోకాన్ని చదివిన తరువాత ఆయన పాదాల వద్ద ఉంచాలి) అత్రాగచ్ఛ జగద్వంద్య సురరాజార్చితేశ్వర‘ అనాథనాథ సర్వజ్ఞ గౌరీగర్భ సముద్భవ‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధివినాయక స్వామినే నమః ఆవాహయామి‘‘ఆసనమ్ : స్వామివారు మనముందు ఆసనముపై కూర్చుండినట్లు ఊహించటం (పువ్వులు, అక్షతలు చేతితో పట్టుకొని గణపతికి నమస్కరిస్తూ ఈ క్రింది శ్లోకాన్ని చదివిన తరువాత ఆయన పాదాల వద్ద ఉంచాలి).మౌక్తికైః పుష్పరాగైశ్చ నానారత్నైర్విరాజితం! రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతామ్‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః నవరత్నఖచిత సింహాసనార్థ పుష్పాక్షతాన్ సమర్పయామి‘‘పాద్యమ్ : స్వామి వారి పాదాలకు నీళ్ళు సమర్పించి పాదాలు కడుగుతున్నట్లు భావించడం (పుష్పంతో కలశంలోని నీటిని గణపతి పాదాలపై కొద్దికొద్దిగా చల్లాలి) శ్లో‘‘ సర్వతీర్థ సముద్భూతం ‘‘ పాద్యం గంగాది సంయుతం‘‘ విఘ్నరాజ! గృహాణేదం‘‘ భగవన్భక్త వత్సల‘‘ శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః తమ పాదయోః పాద్యం సమర్పయామి‘‘అర్ఘ్యమ్ : స్వామి వారి చేతులకు నీళ్ళు ఇచ్చుట (పుష్పంతో కలశంలోని నీటిని గణపతి పాదాలపై కొద్దికొద్దిగా చల్లాలి) గౌరీపుత్ర! నమస్తేస్తు శంకర ప్రియనందన! గృహాణార్ఘ్యం మయాదత్తం గంధపుష్పాక్షతైర్యుతం‘‘ శ్రీ సిద్ధిబుద్ధిసమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి‘‘ఆచమనీయమ్ : స్వామి వారి నోటికి నీళ్ళు అందించడం తాగుతున్నట్లు భావించుట (పుష్పంతో కలశంలోని నీటిని గణపతి పాదాలపై కొద్దిగా చల్లాలి) అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ వరపూజితః గృహాణాచమనం దేవః తుభ్యం దత్తం మయా ప్రభో‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామినే నమః ముఖే ఆచమనీయం సమర్పయామి‘‘మధుపర్కం : పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార వీటిని కలిపి స్వామి వారికి అందించుట (గణపతికి మధుపర్కం సమర్పించాలి) దధిక్షీర సమాయుక్తం మధ్వాజ్యేన సమన్వితం ‘‘ మధుపర్కం గృహాణేదం గణనాథం నమోస్తుతే‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః మధుపర్కం సమర్పయామి.పంచామృత స్నానమ్ : పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, వీటితో అభిషేకించేటట్లు భావించుట (పంచామృతాలతో ఈ కింద చెప్పిన వరుసలో గణపతికి అభిషేకం చేయాలి)పాలు : ఓం ఆప్యాయస్వ సమేతుతే విశ్వత స్సోమ వృష్ణి యం‘ భవా వాజన్య సంగథే‘‘ శ్రీ సిద్ధిబుద్ధిసమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః క్షీరేణ స్నపయామి‘‘పెరుగు : ఓం దధిక్రాపుణ్ణో ఆకారిషం‘ జిష్ణోరశ్వస్య వాజినః సురభినో ముఖాకరత్‘ ప్రణ ఆయూగ్‌ంషి తారిషత్‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః దధ్నా స్నపయామి‘‘నేయి : ఓం శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవోవస్సవితోత్పునా త్వచ్చిద్రేణ పవిత్రేణ వసో స్సూర్యన్యరశ్మిభిః‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః ఆజ్యేన స్నపయామి‘‘తేనె: ఓం మధువాతా బుుతాయతే‘ మధుక్షరంతి సింధవః మాధ్వీర్నస్సంత్వోషధీ!‘ మధునక్తముతోషసి మధుమత్వార్థినగ్‌ం రజః‘ మధుద్యైరస్తునః పితా‘ మధుమాన్నో వనస్పతిర్మధుమాగ్ం అస్తుసూర్యః మాధ్వీర్గావో భవంతునః‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః మధునా స్నపయామి‘‘పంచదార : ఓం స్వాదుఃపవన్వ దివ్యాజన్మనే‘ స్వాదురింద్రాయ సుహవీతు నామ్నే‘ స్వాదుర్మి త్రాయ వరుణాయ వాయమే‘ బృహస్పతయే మధుమాగ్‌ం ఆదాభ్యః‘‘ శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః శర్కరేణ స్నపయామి‘‘ (మిగిలిన పంచామృతాలన్నింటినీ ఈ క్రింది శ్లోకం చెబుతూ అభిషేకం చేయాలి) స్నానం పంచామృతైర్దేవ గృహాణ గణనాయక‘ అనాథనాథ‘ సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత‘‘ శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః పంచామృత స్నానం సమర్పయామి. ఫలోదకమ్ : (కొబ్బరినీటితో అభిషేకం చేయాలి) యాః ఫలినీర్యా అఫలా అపుష్పాయాశ్చ పుష్పిణీః‘ బృహస్పతి ప్రసూతాస్తానో ముంచస్త్యగ్‌ంహనః‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః ఫలోదకేన స్నపయామి‘‘శుద్ధోదకమ్ : మంచి నీటితో స్వామిని అభిషేకించునట్లుగా భావించడం (ఈ క్రింది శ్లోకంతో కలశంలోని నీటితో అభిషేకం చేయాలి. ఇక్కడ గణపతి ఉపనిషత్తు, పురుషసూక్త, నమకచమకాదులతో యథాశక్తి అభిషేకం చేయవచ్చు) గంగాది సర్వతీర్థేభ్యః అహృతైరమలైర్జలైః స్నానం కురుష్వ భగవాన్ ఉమాపుత్ర నమోస్తుతే‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః శుద్ధోదకస్నానం సమర్పయామి‘‘ స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి‘‘ (అంటూ కలశంలోని పుష్పంతో నీటిని పళ్ళెంలో విడవాలి. తరువాత ప్రతిమను వస్త్రంతో తుడిచి గంధం కుంకుమలతో అలంకరించి యథాస్థానంలో ఉంచాలి.)వస్త్రమ్ : (నూతన వస్త్రములనుగాని, పత్తితో చేసిన వస్త్రద్వయాన్నిగాని ఈ క్రింది శ్లోకం చదివాక గణపతి పాదాలవద్ద ఉంచాలి) రక్తవస్త్రద్వయం చారు దేవయోగ్యంచ మంగళం‘ శుభప్రదం గృహాణత్వం లంబోదర హరాత్మజ‘‘ శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః వస్త్రయుగ్మం సమర్పయామి‘‘యజ్ఞోపవీతమ్ : (పత్తితో చేసిన యజ్ఞోపవీతాన్నిగాని, పుష్పాక్షతలను గాని దేవునివద్ద ఉంచాలి) రాజితం బ్రహ్మసూత్రం చ కాంచనం చోత్తరీయకం‘ గృహాణ దేవ సర్వజ్ఞ భక్తానామిష్టదాయక‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః యజ్ఞోపవీతం సమర్పయామి‘‘గంధమ్ : (ఒక పుష్పాన్ని చందనంలో ముంచి గణపతి పాదాల వద్ద ఉంచాలి) చందనాగరుకర్పూర కస్తూరీ కుంకుమాన్వితం‘ విలేపనం సురశ్రేష్ఠ! ప్రీత్యర్థం ప్రతిగృహ్యతామ్‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత సిద్ధి వినాయక స్వామినే నమః గంధాన్ ధారయామి.అక్షతలు : (అక్షతలు దేవుని పాదాల వద్ద ఉంచాలి) అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాం తండులాన్ శుభాన్‘ గృహాణ పరమానంద శంభుపుత్ర నమోస్తుతే‘‘ శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామినే నమః అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి‘‘సింధూరం : శ్లో‘‘ ఉద్యద్భాస్కర సంకాశం‘‘ సంధ్యా వదరుణంప్రభో‘‘ వీరాలంకరణం దివ్యం‘‘ సింధూరం ప్రతిగృహ్యతాం‘‘ శ్రీ సిద్ధి బుద్ధి నమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః సింధూరం సమర్పయామి‘‘మాల్యం : శ్లో‘‘ మాల్యాదీవి సుగంధాని‘‘ మాలత్యా దీనివై ప్రభో‘‘ మయాహృతాని పుష్పాణి‘‘ ప్రతిగృహ్ణీష్య శాంకర‘‘ శ్రీ సిద్ధి బుద్ధి నమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః మాల్యం సమర్పయామి‘‘పుష్పమ్ : (సుగంధ పుష్పాలను దేవుని పాదాల వద్ద ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పుష్పం చొప్పున అ«థాంగపూజ, అష్టోత్తరాలను చెబుతూ అలంకరణ చేయాలి. పుష్పాలు సరిపోని పక్షంలో అక్షతలతో పూజించవచ్చు).సుగన్ధానిచ పుష్పాణి జాజీకుందముఖానిచ ఏకవింశతి పత్రాణి సంగృహాణ నమోస్తుతే‘ శ్రీ సిద్ధి బుద్ధి నమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః పుష్పైః పూజయామి‘‘అథాంగ పూజా : (స్వామి వారి అంగాన్ని ఒక్కొక్కటిగా అర్చించుట)గణేశాయ నమః పాదౌ పూజయామి‘ఏకదంతాయ నమః గుల్ఫౌ పూజయామి‘విఘ్నరాజాయ నమః జానునీ పూజయామి‘కామారిసూనవే నమః జంఘే పూజయామి‘అఖువాహనాయ నమః ఊరూ పూజయామి‘హేరంబాయ నమః కటిం పూజయామి‘లంబోదరాయ నమః ఉదరం పూజయామి‘గణనాథాయ నమః హృదయం పూజయామి‘స్థూలకంఠాయ నమః కంఠం పూజయామి‘పాశహస్తాయ నమః హస్తౌ పూజయామి‘గజవక్త్రాయ నమః వక్త్రం పూజయామి‘విఘ్నహంత్రే నమః నేత్రౌ పూజయామి‘శూర్పకర్ణాయ నమః కర్ణౌ పూజయామి‘ఫాలచంద్రాయ నమః లలాటం పూజయామి‘సర్వేశ్వరాయ నమః శిరః పూజయామి‘శ్రీ గణాధిపాయ నమః సర్వాణ్యంగాని పూజయామి‘‘ఏకవింశతి పత్ర పూజఏకవింశతి పత్రిపూజ సమయంలో పత్రితోనే పూజించాలి.దూర్వాయుగ్మ పూజ గరికతో లేని పక్షంలో అక్షతలతో పూజించాలిఓం సుముఖాయ నమః మాచీపత్రం పూజయామి‘ (మాచి ఆకు)ఓం గణాధిపాయ నమః బృహతీ పత్రం పూజయామి‘ (బలురక్కసి లేక ములక) ఓం ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి‘ (మారేడు) ఓం గజాననాయ నమః దూర్వాయుగ్మం పూజయామి‘ (గరికె రెమ్మలు) ఓం çహరసూనవే నమః దత్తూర పత్రం పూజయామి‘ (ఉమ్మెత్త ఆకు) ఓం లంబోదరాయ నమః బదరీ పత్రం పూజయామి‘ (రేగు ఆకు)ఓం గుహాగ్రజాయ నమః అపామార్గ పత్రం పూజయామి‘ (ఉత్తరేణి) ఓం గజకర్ణాయ నమః తులసీ పత్రం పూజయామి‘ (తులసి) ఓం ఏకదంతాయ నమః చూత పత్రం పూజయామి‘ (మామిడి ఆకు)ఓం వికటాయనమః కరవీర పత్రం పూజయామి‘ (గన్నేరు ఆకు) ఓం భిన్న దంతాయ నమః విష్ణుక్రాంత పత్రం పూజయామి‘ (విష్ణు క్రాంతం)ఓం వటవే నమః దాడిమీ పత్రం పూజయామి‘ (దానిమ్మ) ఓం సర్వేశ్వరాయ నమః దేవదారు పత్రం పూజయామి‘ (దేవదారు) ఓం ఫాలచంద్రాయ నమః మరువక పత్రం పూజయామి‘ (మరువం) ఓం హేరంబాయ నమః సింధువార పత్రం పూజయామి‘ (వావిలాకు) ఓం శూర్పకర్ణాయ నమః జాజీపత్రం పూజయామి‘ (జాజి తీగ ఆకు)ఓం సురాగ్రజాయ నమః గండకీపత్రం పూజయామి‘ (దేవకాంచనం)ఓం ఇభవక్త్రాయ నమః శమీపత్రం పూజయామి‘ (జమ్మి ఆకు) ఓం వినాయకాయ నమః అశ్వత్థపత్రం పూజయామి‘ (రావి ఆకు)ఓం సుర సేవితాయ నమః అర్జునపత్రం పూజయామి‘ (తెల్లమద్దె) ఓం కపిలాయ నమః అర్కపత్రం పూజయామి‘ (జిల్లేడు ఆకు) ఓం శ్రీ గణేశ్వరాయ నమః ఏకవింశతి పత్రిణి పూజయామి‘‘(21 రకాల ఆకులను కలిపి వేసి నమస్కారం చేయవలెను)ఏకవింశతి దూర్వాయుగ్మ పూజ(రెండు, రెండు గరికలుగా స్వామిని అర్చించాలి)గణాధిపాయ నమః దుర్వాయుగ్మం పూజయామి!పాశాంకుశధరాయనమః దుర్వాయుగ్మం పూజయామి!ఆఖువాహనాయ నమః దుర్వాయుగ్మం పూజయామి!వినాయకాయనమః దుర్వాయుగ్మం పూజయామి!ఈశపుత్రాయ నమః దుర్వాయుగ్మం పూజయామి!సర్వసిద్ధిప్రదాయ నమః దుర్వాయుగ్మం పూజయామి!ఏకదంతాయనమః దుర్వాయుగ్మం పూజయామి!ఇభవక్త్రాయ నమః దుర్వాయుగ్మం పూజయామి!మూషికవాహనాయ నమః దుర్వాయుగ్మం పూజయామి!కుమారగురవే నమః దుర్వాయుగ్మం పూజయామి!కపిలవర్ణాయనమః దుర్వాయుగ్మం పూజయామి!బ్రహ్మచారిణేనమః దుర్వాయుగ్మం పూజయామి!మోదకహస్తాయనమః దుర్వాయుగ్మం పూజయామి!సురశ్రేష్ఠాయనమః దుర్వాయుగ్మం పూజయామి!గజనాసికాయ నమః దుర్వాయుగ్మం పూజయామి!కపిత్థఫలప్రియాయనమః దుర్వాయుగ్మం పూజయామి!గజముఖాయనమః దుర్వాయుగ్మం పూజయామి!సుప్రసన్నాయనమః దుర్వాయుగ్మం పూజయామి!సురాగ్రజాయనమః దుర్వాయుగ్మం పూజయామి!ఉమాపుత్రాయనమః దుర్వాయుగ్మం పూజయామి!స్కందప్రియాయనమః దుర్వాయుగ్మం పూజయామి!శ్రీ వరసిద్ధి వినాయకాయ స్వామినే నమః ఏకవింశతి – దుర్వాయుగ్మం సమర్పయామిఓం గజాననాయ నమః ఓం గణాధ్యక్షాయ నమఃఓం విఘ్నరాజాయ నమఃఓం వినాయకాయ నమఃఓం ద్వైమాతురాయ నమఃఓం ద్విముఖాయ నమఃఓం ప్రముఖాయ నమఃఓం సుముఖాయ నమఃఓం కృతినే నమఃఓం సుప్రదీపాయ నమఃఓం సుఖనిధయే నమఃఓం సురాధ్యక్షాయ నమఃఓం సురారిఘ్నాయ నమఃఓం మహాగణపతయే నమఃఓం మాన్యాయ నమఃఓం మహాకాలాయ నమఃఓం మహాబలాయ నమఃఓం హేరంబాయ నమః ఓం లంబకర్ణాయ నమఃఓం హ్రస్వగ్రీవాయ నమఃఓం మహోదరాయ నమఃఓం మహోత్కటాయ నమఃఓం మహావీరాయ నమఃఓం మంత్రిణే నమఃఓం మంగళస్వరూపాయ నమఃఓం ప్రమధాయ నమఃఓం ప్రథమాయ నమఃఓం ప్రాజ్ఞాయ నమఃఓం విఘ్నకర్త్రే నమఃఓం విఘ్నహంత్రే నమఃఓం విశ్వనేత్రే నమఃఓం విరాటత్పయే నమఃఓం శ్రీపతయే నమఃఓం శృంగారిణే నమః ఓం ఆశ్రితవత్సలాయ నమఃఓం శివప్రియాయ నమఃఓం శీఘ్రకారిణే నమఃఓం శాశ్వతాయ నమఃఓం బలాయ నమఃఓం బలోత్థితాయ నమఃఓం భవాత్మజాయ నమఃఓం పురాణ పురుషాయ నమఃఓం పూష్ణే నమః ఓం పుష్కరక్షిప్తవారిణే నమఃఓం అగ్రగణ్యాయ నమఃఓం అగ్రపూజ్యాయ నమఃఓం అగ్రగామినే నమఃఓం మంత్రకృతే నమఃఓం చామీకరప్రభాయ నమఃఓం సర్వాయ నమఃఓం సర్వోపన్యాసాయ నమఃఓం సర్వకర్త్రే నమఃఓం సర్వనేత్రే నమఃఓం సర్వసిద్ధిప్రదాయ నమఃఓం సర్వసిద్ధయే నమఃఓం పంచహస్తాయ నమఃఓం పార్వతీనందనాయ నమఃఓం ప్రభవే నమఃఓం కుమార గురవే నమఃఓం అక్షోభ్యాయ నమఃఓం కుంజరాసుర భంజనాయ నమఃఓం ప్రమోదాయ నమఃఓం మోదకప్రియాయ నమఃఓం కాంతిమతే నమఃఓం ధృతిమతే నమఃఓం కామినే నమఃఓం కపిత్థ పనసప్రియాయ నమఃఓం బ్రహ్మచారిణే నమఃఓం బ్రహ్మరూపిణే నమఃఓం బ్రహ్మవిద్యాధిపాయ నమఃఓం విష్ణవే నమఃఓం విష్ణుప్రియాయ నమఃఓం భక్తజీవితాయ నమఃఓం జితమన్మథాయ నమఃఓం ఐశ్వర్యకారణాయ నమఃఓం జ్యాయనే నమఃఓం యక్షకిన్నరసేవితాయ నమఃఓం గంగాసుతాయ నమఃఓం గణాధీశాయ నమః ఓం గంభీరనినదాయ నమఃఓం వటవే నమఃఓం అభీష్టవరదాయినే నమః ఓం జ్యోతిషే నమఃఓం భక్తనిధయే నమఃఓం భావగమ్యాయ నమః ఓం మంగళప్రదాయ నమఃఓం అవ్యక్తాయ నమః ఓం అప్రాకృతపరాక్రమాయ నమఃఓం సత్యధర్మిణే నమఃఓం సఖ్యే నమఃఓం సరసాంబునిధయే నమఃఓం మహేశాయ నమఃఓం దివ్యాంగాయ నమఃఓం మణికింకిణీ మేఖలాయ నమఃఓం సమస్త దేవతామూర్తయే నమఃఓం సహిష్ణవే నమఃఓం సతతోత్థితాయ నమఃఓం విఘాతకారిణే నమఃఓం విశ్వక్‌దృశే నమఃఓం విశ్వరక్షాకృతే నమఃఓం కళ్యాణ గురవే నమఃఓం ఉన్మత్తవేషాయ నమఃఓం అపరాజితే నమఃఓం సమస్త జగదాధారాయ నమఃఓం సర్వైశ్వర్యప్రదాయ నమఃఓం ఆక్రాన్తచిదచిత్ప్రభవే నమఃఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః శ్రీసిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః అష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి. బిల్వం : శ్లో‘‘ త్రిదళం త్రిగుణాకరం‘‘ త్రినేత్రంచ త్రియాయుధం‘‘ త్రిజన్మ పాప సంహారం‘‘ఏకబిల్వం శివార్పణం ‘‘ శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః బిల్వపత్రం సమర్పయామి. ధూపమ్ : (అగరువత్తులను వెలిగించి ఆ ధూపాన్ని గణపతికి కుడి చేతితో చూపించాలి. అంతేగాని అగరువత్తులను చుట్టూ తిప్పకూడదు) దశాంగం గుగ్గులోపేతం సుగంధం సుమనోహరం‘‘ ఉమా సుత నమస్తుభ్యం గృçహాణవరదో భవ‘‘ శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః ధూపమాఘ్రాపయామి. దీపమ్ : (కర్పూర దీపాన్ని గాని, నేతి దీపాన్ని గాని కుడిచేతితో భగవంతునికి చూపాలి) సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినాద్యోతితం మయా‘ గృహాణ మంగళం దీపం ఈశపుత్ర నమోస్తుతే‘‘ శ్రీసిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః దీపం దర్శయామి‘‘ నైవేద్యమ్ : (గణపతికి నివేదించాల్సిన అన్ని ఫలాలను, పిండి వంటలను పళ్లెంలో ఒక ఆకువేసి ఆ ఆకులో పెట్టి ఉంచాలి. వాటిపై ఈ క్రింది మంత్రంతో నీళ్ళు చల్లాలి) ఓమ్ భూర్భువస్సువః ‘ ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ‘ ధియోయనః ప్రచోదయాత్ ‘‘ (పుష్పంతో నీటిని పదార్థాల చుట్టూ తిప్పాలి) ఓమ్ సత్యంత్వర్తేన పరిషించామి‘‘ ఓమ్ బుుతంత్వా సత్యేన పరిషించామి‘‘ సుగంధాన్ సుకృతాంశ్చైవ మోదకాన్ ఘృతపాచితాన్ నైవేద్యం గృహ్యతాం దేవగణముదై్గః ప్రకల్పితాన్‘ భక్ష్యం భోజ్యం చ లేహ్యంచ చోష్యం పానీయమేవచ‘ ఇదం గృహాణ నైవేద్యం మయా దత్తం వినాయక‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః మహానైవేద్యం సమర్పయామి. (పుష్పంతో నీటిని రెండుసార్లు పళ్లెంలో విడిచిపెట్టాలి)ఓమ్ అమృతమస్తు! ఓమ్ అమృతోపస్తరణమసి‘‘(అయిదుసార్లు ఎడమచేతితో కుడిమోచేయిని పట్టుకుని కుడి చేతితో గణపతివైపు నైవేద్యాన్ని చూపాలి) ఓమ్ ప్రాణాయ స్వాహా‘ ఓమ్ అపానాయ స్వాహా‘ ఓమ్ వ్యానాయ స్వాహా‘ ఓమ్ ఉదానాయ స్వాహా ఓమ్ సమానాయ స్వాహా‘‘ (తరువాత సమర్పయామి అన్నప్పుడల్లా పుష్పంతో పళ్ళెంలో నీళ్ళు వదలాలి) మధ్యే మధ్యే పానీయం సమర్పయామి‘ అమృతాపి« దానమసి ఉత్తరాపోశనం సమర్పయామి‘ హస్తౌ ప్రక్షాళయామి‘ పాదౌప్రక్షాళయామి‘ శుద్ధాచమనీయం సమర్పయామి‘‘ తాంబూలమ్ : (మూడు తమలపాకులు, వక్కలు, అక్షతలు, పుష్పం, ఫలం సుగంధ ద్రవ్యాలు, దక్షిణలతో తాంబూలాన్ని గణపతి వద్ద ఉంచాలి) పూగీఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం‘ కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్‘‘ శ్రీసిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః తాంబూలం సమర్పయామి‘‘శ్రీ గణేష ప్రార్థనతుండమునేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్‌మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపులు మందహాసమున్కొండొక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జౖయె యుండెడి పార్వతీ తనయ ఓయి గణాధిపా నీకు మ్రొక్కెదన్‘తొలుత నవిఘ్నమస్తనుచు ధూర్జటినందన నీకు మ్రొక్కెదన్ఫలితము సేయుమయ్య నిను ప్రార్థన చేసెద నేకదంత నా వలపటి చేతి గంటమున వాక్కున నెప్పుడు బాయకుండు మీ తలపున నిన్ను వేడెద దైవగణాధిప‘ లోకనాయకా!తలచితినే గణనాథుని తలచితినే విఘ్నపతిని తలచిన పనిగా దలచితినే హేరంబుని దలచితి నా విఘ్నముల దొలగుట కొఱకున్ ∙∙ అటుకులు కొబ్బరిపలుకులు చిటిబెల్లము నానుబ్రాలు చెరకు రసంబున్నిటలాక్షు నగ్రసుతునకుపటుతరముగ విందుసేతు ప్రార్థింతు మదిన్శ్రీ వినాయకుని దండకము శ్రీ పార్వతీపుత్ర లోకత్రయీస్తోత్ర, సత్పుణ్యచారిత్ర, భద్రేభవక్త్రా మహాకాయ, కాత్యాయనీనాథ సంజాత స్వామీ శివాసిద్ధి విఘ్నేశ, నీ పాదపద్మంబులన్, నీదు కంఠంబు నీ బొజ్జ నీ మోము నీ మౌళి బాలేందు ఖండంబు నీ నాల్గు హస్తంబులన్నీ కరాళంబు నీ పెద్ద వక్త్రంబు దంతంబు నీ పాద యుగ్మంబు లంబోదరంబున్ సదా మూషికాశ్వంబు నీ మందహాసంబు నీ చిన్ని తొండంబు నీ గుజ్జు రూపంబు నీ శూర్పకర్ణంబు నీ నాగ యజో›్ఞపవీతంబు నీ భవ్యరూపంబు దర్శించి హర్షించి సంప్రీతి మ్రొక్కంగ శ్రీ గంధమున్ గుంకుమం బక్షతలాజులున్ చంపకంబున్ తగన్ మల్లెలన్మొల్లలన్మంచి చేమంతులున్ తెల్లగన్నేరులన్ మంకెనల్ పొన్నలన్ పువ్వులు న్మంచి దుర్వంబు లందెచ్చి శాస్త్రోక్తరీతిన్ సమర్పించి పూజించి సాష్టాంగంబు జేసి విఘ్నేశ్వరా నీకు టెంకాయలుం పొన్నంటిపండున్ మరిన్మంచివౌ ఇక్షుఖండంబులు, రేగుబండ్లప్పడాల్ వడల్ నేతిబూరెల్ మరీస్ గోధుమప్పంబులు న్వడల్ పున్గులున్ గారెలున్ చొక్కమౌ చల్మిడిన్ బెల్లమున్ తేనెయుం జున్ను బాలాజ్యమున్నాను బియ్యంబు చామ్రంబు బిల్వంబు మేల్ బంగరున్ బళ్లెమం దుంచి నైవేద్యముంబంచనీ రానంబున్ నమస్కారముల్జేసి విఘ్నేశ్వరా నిన్ను బూజింపకే యన్యదైవంబుల్ ప్రార్థనల్చే యుటల్ కాంచనం బొల్లకే యిన్ముదాగోరు చందంబుగారే మహాదేవ యో భక్తమందారయో సుందరాకార యో భాగ్య గంభీర యో దేవ చూడామణీ లోకరక్షామణీ బంధు చింతామణీ స్వామి నిన్నెంచ నేనెంత నీదాస దాసాదిదాసుండ శ్రీ దొంత రాజన్వయుండ రామాభిధానుండ నన్నిప్డు చేపట్టి సుశ్రేయునింజేసి శ్రీమంతుగన్జూచి హృత్పద్మసింహాస నారూఢతన్నిల్పి కాపాడుటే కాదు నిన్గొల్చి ప్రార్థించు భక్తాళికిన్ కొంగు బంగారమై కంటికిన్ రెప్పవై బుద్ధియున్విద్య యున్నాడియున్ బుత్ర పౌత్రాభివృద్ధిన్ దగన్‌గల్గగాజేసి పోషించుమంటిన్ గృపన్ గావుమంటిన్ మహాత్మా! -
ప్రపంచంలో కొలువైన ఈ గణపయ్యల గురించి తెలుసా?
విఘ్నాలను తొలగించే వినాయకుడిని అత్యంత భక్తి శ్రద్దలతో కొలిచేందుకు యావత్ భక్తజనం సంసిద్ధమవుతోంది. చిన్నా పెద్దా అంతా బొజ్జగణపయ్యను కొలిచేందుకు ఉవ్విళ్లూరుతారు. తొమ్మిది రోజుల పాటు దేశవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి.గణేష్ చతుర్థిని భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా అపారమైన భక్తితో జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా తప్పక సందర్శించాల్సిన అయిదు ప్రత్యేకమైన గణేష్ విగ్రహాల గురించి తెలుసుకుందాం.ప్రతి సంవత్సరం వినాయక చవితిని భాద్రపద శుక్ల చవితి తిథి నాడు జరుపుకుంటారు. కోరిన కోర్కెలు నేరవేర్చు స్వామీ అని ఆ గణనధుడుని వేడుకొని వినాయకవత్రకథను చదువుకొని అక్షితలు వేసుకొని చంద్రుడిని దర్శించుకుంటారు. అనేక మంటపాల్లో కొలువుదీరిన గణపతిని తనివితీరా దర్శిస్తారు. ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గోవా వంటి రాష్ట్రాలతోపాటు, మలేషియా, నేపాల్, సింగపూర్, మారిషస్ ,కెనడా లాంటి దేశాల్లో కూడా సంబరాలు జరుగుతాయి. ప్రపంచంలో కూడా గణేష్ విగ్రహాలకు ప్రత్యేకత ఉంది. థాయిలాండ్‌లోని ఎత్తైన విగ్రహంతోపాటు, జపాన్, మలేషియా,అమెరికా, బాలిలోని అద్భుతమైన గణపతి విగ్రహాలకు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. ఇదీ చదవండి: Yoga మైగ్రేన్‌తో భరించలేని బాధా? బెస్ట్ యోగాసనాలుమహా గణపతి ఆలయం, ఫ్లషింగ్, న్యూయార్క్ (USA)ఉత్తర అమెరికాలోని అతిపెద్ద హిందూ దేవాలయాలలో ఒకటి, ఇది అద్భుతమైన గణేష్ విగ్రహాన్ని కలిగి ఉంది. గణేష్ చతుర్థి సందర్భంగా భక్తులు ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తారు.గణేష్ విగ్రహం, చాచోఎంగ్సావో (థాయిలాండ్)థాయిలాండ్ ప్రపంచంలోనే ఎత్తైన గణేష్ విగ్రహాలలో ఒకటి. ఈ విగ్రహం 39 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ గులాబీ రంగు గణేష్ విగ్రహం, రిలాక్స్డ్ భంగిమలో కూర్చుని, జ్ఞానం , శ్రేయస్సును సూచిస్తుంది.గణేశ మందిరం, టోక్యో (జపాన్)టోక్యోలోని కన్నోన్-జి ఆలయంలోని గణేశ మందిరంలో జపాన్ బౌద్ధ మరియు హిందూ దేవతలతో సాంస్కృతిక సంబంధాలు ప్రతిబింబిస్తాయి. ఇక్కడి విగ్రహాన్ని సంపదకు, విజయానికి సంరక్షకుడిగా భావిస్తారు.బాటూ కేవ్స్, మురుగన్ కౌలాలంపూర్ (మలేషియా)మలేషియాలోని బాటు గుహల వద్ద కొలువుదీరని మురుగన్‌కు కూడా చాలా ప్రాధాన్యత ఉంది. ఈ గుహల ప్రవేశ ద్వారం వద్ద ఒక అద్భుతమైన గణేశ విగ్రహం కొలువుదీరి ఉంటుంది. గణేశ చతుర్థి సందర్భంగా పర్యాటకులు, భక్తులకు ఇది ప్రధాన ఆకర్షణ.గణేశ విగ్రహం, బాలి (ఇండోనేషియా)బాలిలో,ఉబుద్‌లోని ఒక ప్రత్యేకమైన రాతితో చెక్కిన విగ్రహం అత్యంత ప్రజాదరణ పొందిన వాటిలో ఒకటిగా వెలుగొందుతోంది. ఇది రక్షణ జ్ఞానానికి ప్రతీకగా భావిస్తారు. -
‘లాల్బాగ్చా రాజా’ కానుకల వెల్లువ : వేలంలో బంగారు ఇటుకకు రూ. 75.90 లక్షలు
ఇటీవల గణేశోత్సవాలను పురస్కరించుకుని ముంబైలోని ప్రముఖ ‘లాల్బాగ్చా రాజా’ గణేశుడికి భక్తులు భారీగా కానుకలు, మొక్కుబడులు సమర్పించుకున్నారు. ముఖ్యంగా ఈఏడాది లాల్బాగ్చా రాజా సార్వజనిక గణేశోత్సవ మండలి 91 వార్షికోవత్సవం కావడంతో భక్తులు భారీగా తరలి వచ్చారు. వీటిలో పెద్దమొత్తంలో నగదుతో పాటు బంగారు, వెండి ఆభరణాలు, ఇతర వస్తువులు కూడా ఉన్నాయి. ఈ సందర్భంగా బంగారు, వెండి కానుకలు వేలం వేశారు. భక్తుల మధ్య పోటాపోటీగా జరిగిన వేలం పాటలో మండలికి రికార్డు స్ధాయిలో ఆదాయం వచి్చంది. ఈ నిధుల్లో కొంత శాతం వివిధ సామాజిక సేవా కార్యక్రమాలకు, పేద పిల్లల చదువులకు, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న నిరుపేద రోగులకు మందులు, వైద్యఖర్చులకు సాయంగా అందజేయనున్నట్లు మండలి కార్యదర్శి సుదీర్ సాల్వీ తెలిపారు. ఒక్క బంగారు ఇటుకకు వేలంలో రూ. 75.90 లక్షల ధర ముంబైలోని లాల్బాగ్ ప్రాంతంలో కొలువైన లాల్బాగ్చా రాజా గణపతికి దేశ, విదేశాల్లోనూ ఎంతో పేరు. గణేశోత్సవాలు ప్రారంభమైన నాటి నుంచి నిమజ్జనోత్సవాలు ముగిసే వరకు లక్షలాది భక్తులు ఈ ఏడాది లాల్బాగ్చా రాజాను దర్శించుకున్నారు. నిమజ్జనోత్సవాలు పూర్తి కావడంతో గత రెండు రోజులుగా హుండీలో వేసిన నగదును లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. శనివారం లెక్కింపు ప్రక్రియ పూర్తికావడంతో మండలి పదాధికారులు వివరాలు వెల్లడించారు. మొత్తం 5.65 కోట్లు మేర నగదును భక్తులు లాల్బాగ్చా రాజాకు కానుకల రూపంలో సమర్పించుకున్నట్లు సాల్వీ తెలిపారు. అదేవిధంగా వివిధ బంగారు, వెండి ఆభరణాలు వేలం వేయగా ఒక కేజీ బంగారు ఇటుక, 10 తులాల బరువైన 13 బంగారు బిస్కెట్లు, బంగారు పూతపూసిన 909 గ్రాముల వెండి సుదర్శన చక్రం, అలాగే బంగారు కడియాలు, చైన్లు, హారాలు, ఉంగరాలు తదితర ఆభరణాలను వేలం వేయడంవల్ల రూ.2.35 కోట్లు లభించినట్లు సాల్వీ వెల్లడించారు. ఒక్క బంగారు ఇటుకకే వేలంలో రూ. 75.90 లక్షల ధర పలికిందని ఇది రికార్డును నమోదు చేసిందని ఆయన పేర్కొన్నారు. లాల్బాగ్చారాజాను ప్రత్యక్షంగా దర్శించుకునేందుకు ముంబై రావడానికి వీలుపడని కొందరు భక్తులు తమ మొక్కుబడులను ఆన్లైన్ ద్వారా చెల్లిస్తారు. ఈ మొత్తం లాల్బాగ్చా రాజా సార్వజనిక గణేశోత్సవ మండలి బ్యాంకు ఖాతాలో జమా అవుతుంది. ఇంకా ఈ డిపాజిట్ల లెక్కలు తేల్చాల్సి ఉందని సాల్వీ పేర్కొన్నారు. లెక్కించేందుకే రెండు మూడు రోజులు ఏటా నిమజ్జనోత్సవాలు పూర్తికాగానే హుండీలో వేసిన నగదును లెక్కించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందుకు కనీసం రెండు, మూడు రోజుల సమయం పడుతుంది. ఆ తరువాత మంచి ముహూర్తం చూసి లెక్కించిన కానుకలన్నిటినీ బహిరంగంగా వేలం వేస్తారు. ఈ వేలం పాటలో వేలాది మంది పాల్గొంటారు. ముఖ్యంగా వేలం పాటలో పాల్గొనే వారితోపాటు వేలం పాట ప్రక్రియను తిలకేంచేందుకు వచ్చేవారితో మండపం ఆవరణ కిక్కిరిసిపోతుంది. అనేక సందర్భాలలో ఓ వస్తువును దక్కించుకునేందుకు కొన్ని గంటల పాటు వేలం పాట కొనసాగుతుంది. దీంతో మిగిలిన వాటిని మరుసటి రోజున వేలం వేస్తారు. -
ముంబైలో ‘తెలుగు’గణపతి : ఆసక్తికర విశేషాలు
సాక్షి ముంబై: వర్లీలోని నెహ్రూనగర్ సార్వజనిక శ్రీ గణేశోత్సవ మండలి ఆధ్వర్యంలో గణేశోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మండలి ఆధ్వర్యంలో ఉత్సవాలను ప్రారంభించి ఈ ఏడాదికి 50 ఏళ్లు పూర్తికానుండంటతో మరింత అట్టహాసంగా, ఉత్సాహంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈసారి రాజ మహల్ నమూనాలో వివిధ రకాల అలంకరణలతో గణేశ్ మండలిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. తెలుగు మండళ్లలో ప్రత్యేక స్థానం ముంబై మహానగరంలో వినాయక చవితి సందర్భంగా పదిరోజులపాటు ఘనంగా ఉత్సవాలను నిర్వహిస్తారనే విషయం విదితమే. చవితి వేడుకల్లో భాగంగా ప్రతి గల్లీ, రోడ్డులో వినాయక మండళ్లను ఏర్పాటుచేసి భారీ విగ్రహాలను ప్రతిష్ఠించి ఘనంగా పూజలు నిర్వహిస్తుంటారు. కుల, మత, జాతి, ప్రాంత వ్యత్యాసాలు లేకుండా ముంబైకర్లందరూ ఈ వేడుకల్లో పాల్గొంటారు. మహారాష్టక్రు ప్రత్యేకమైన గణేశోత్సవాల నిర్వహణలో తరతరాలుగా ఇక్కడే జీవనం సాగిస్తున్న తెలుగువారు కూడా ముందంజలోనే ఉన్నారు. అలాంటి తెలుగు గణేశ్ మండళ్లలో ఒకటి వర్లీ, నెహ్రూనగర్ సార్వజనిక్ శ్రీ గణేశోత్సవ్ మండల్. ఐక్యత వల్లే, ఐక్యత కోసమే.... సొంతూళ్లను వదిలి పరాయిగడ్డలో స్థిరపడి ఇక్కడే జీవనం సాగిస్తున్న తెలుగు వారందరినీ ఒక్కతాటి మీద నిలిపేందుకు ఈ గణేశోత్సవాలు ఎంతగానో తోడ్పడుతున్నాయని మండలి అధ్యక్షుడు వాసాల గంగాధర్, ప్రధాన కార్యదర్శి తుమ్మనపల్లి శ్రీనివాస్, కోశాధికారి పొలాస తిరుపతి పేర్కొన్నారు. మండలిని స్థాపించి ఈ ఏడాదికి 50 సంవత్సరాలు పూర్తికావస్తుండటంతో గతంలో కంటే భారీ ఎత్తున్న ఉత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. గణపతిని దర్శించుకునేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. రెండుసార్లు ఉత్తమ మండలి అవార్డు....1975 నుంచి నిరాటంకంగా భారీ ఎత్తున నిర్వహిస్తున్న ఈ గణేశోత్సవ మండలి వర్లీ ప్రాంతంలో తెలుగువారి గణపతిగా ప్రసిద్ధి చెందింది. మారిన కాలంతో పాటే గణేశోత్సవాల రూపు రేఖలు మారిపోయాయి. పూజలతో పాటు సామాజిక సేవలు కూడా ఈ ఉత్సవాల్లో చోటు చేసుకున్నాయి. క్యాన్సర్ డిటెక్షన్ సెంటర్ల ఏర్పాటు, హెపటైటిస్ బి పరీక్షల నిర్వహణ , ఉచిత నేత్ర శిబిరాల నిర్వహణతో పాటు అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతోంది. అందుకే నెహ్రూనగర్ సార్వజనిక శ్రీ గణేశోత్సవ మండలిని లోధా ఫౌండేషన్ రెండు సార్లు ఉత్తమ మండలిగా గుర్తించి అవార్డులు ప్రదానం చేసింది. సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు యువకుల్లో క్రీడా స్ఫూర్తిని పెంచేందుకు ప్రతి సంవత్సరం క్రికెట్ టోర్నమెంట్లను నిర్వహిస్తున్నారు. కరోనా కాలంలో ఈ మండలి తరఫున ఉచితంగా శానిటైజర్లను, మాసు్కలను పంపిణీ చేశారు. వాక్సిన్లకు సంబంధించిన సందేహాలపై ఇంటింటికి తిరిగి ప్రజల్లో అవగాహన కలిగించారు. వీరి ఆధ్వర్యంలోనే ఘనంగా ఉత్సవాలు ప్రస్తుతం నెహ్రూనగర్ సార్వజనిక శ్రీ గణేశోత్సవ మండలికి అధ్యక్షుడిగా వాసాల గంగాధర్, ప్రధాన కార్యదర్శిగా తుమ్మనపల్లి శ్రీనివాస్, కోశాధికారిగా పొలాస తిరుపతి, ఉపాధ్యక్షుడుగా విక్కీ జిందం కొనసాగుతున్నారు. అదేవిధంగా కార్యవర్గ సభ్యులుగా రాజేష్ మహాదాస్, అజయ్ చక్కరకోట, అరవింద్ జిందం, గణేష్ వంగ, క్రాంతి మామిడాల, రవీ భోగ, వినయ వాసాల, వంశీ వాసాల, రాజేంద్ర భైరీ, విశాల్ వాసాల, సురేష్ గాజుల, నవీన్ వంగల, భాస్కర్ దాసరి, సలహదారులుగా వాసాల శ్రీహరి (వంశీ), జిందం భాస్కర్, సిరిపురం లక్షి్మనారాయణ, సిరిపురం వెంకటేశ్, జిందం గణేశ్ వ్యవహరిస్తున్నారు.1975 నుంచి ప్రారంభంనెహ్రూనగర్ గణేశోత్సవాలు 1975లో ప్రారంభమయ్యాయి. వాసాల రాజయ్య, జిందం బుచి్చబాబు, కోడం విశ్వనాథ్, సంకు అశోక్, సంకు శంకర్ తదితరులు జైకతి యువక మండలి తరపున ‘నెహ్రూనగర్చా రాజా’ను ప్రతిష్టించి పూజలు నిర్వహించేవారు. ఇలా స్థాపించిన సంవత్సరం నుంచి ఈ ఏడాది వరకూ నిరాటంకంగా ఉత్సవాలు జరుగుతున్నాయి. అనంతరం మారిన కాలంతో పాటు ఉత్సవాల నిర్వహణ తీరు కూడా మారింది. ఉత్సవాల సందర్భంగా పూజలు మాత్రమే కాదు సామాజిక సేవా కార్యక్రమాలను కూడా నిర్వహించడం ఆనవాయితీగా మారింది. -
విఘ్నేశ్వరుడి పూజలో బాలీవుడ్ స్టార్స్.. ఫోటోలు వైరల్
-
భిన్న రూపాల్లో బొజ్జ గణపయ్యలు (ఫోటోలు)
-
తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి
తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్)(TCSS) ఆధ్వర్యంలో జూమ్ ద్వారా ఉదయం శ్రీ వినాయక చవితి పూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈసందర్భంతగా బాల వినాయక పూజను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు కుటుంబ సమేతంగా ప్రత్యక్ష పూజలో పాల్గొని, ఆ వినాయకుని ఆశీస్సులు ఉండాలని ప్రార్థించారు. ఈ పూజను ఇండియా నుండి మహబూబ్ నగర్‌కు పురోహితులు ఇరువంటి శ్రావణ్ కుమార్ శర్మ గారు అంతర్జాలం ద్వారా నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రతిఒక్కరికి సొసైటీ అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి ,కోశాధికారి జూలూరి సంతోష్ కుమార్, సొసైటీ ఉపాధ్యక్షులు దుర్గ ప్రసాద్, భాస్కర్ గుప్త నల్ల, గోనె నరేందర్ రెడ్డి, ఉపాధ్యక్షురాలు మిర్యాల సునీత రెడ్డి, సంస్థాగత కార్యదర్శి, కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు బొందుగుల రాము, నంగునూరి వెంకట రమణ, నడికట్ల భాస్కర్, రవి కృష్ణ విజాపూర్ మరియు కార్యవర్గ సభ్యులు రోజా రమణి, శివ ప్రసాద్ ఆవుల, పెరుకు శివ రామ్ ప్రసాద్, రవి చైతన్య మైసా, భాస్కర్ రావు, సంతోష్ వర్మ మాదారపు, శశిధర్ రెడ్డి, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు , మణికంఠ రెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.అందరిపై వినాయకుని ఆశీస్సులుgడాలని ఆకాంక్షిస్తూ ఎల్లప్పుడు సొసైటీ వెన్నంటే ఉంటూ సహకారం అందిస్తున్న వారికి చవితి శుభాకాంక్షలతో పాటు కృతజ్ఞతలు తెలిపారు.ఈ వేడుకలకు సహకారం అందించిన సంపంగి రియాలిటీ & ఇన్ఫ్రాస్ట్రక్చర్ ,ఏపీజే అభిరామి, ఏపీజే జువెల్లర్స్ ప్రైవేట్ లిమిటెడ్, మై హోమ్ APAS బిల్డర్స్, ASBL కన్స్ట్రక్షన్ కంపెనీ, గారాంటో అకాడమీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, మకుట డెవలపర్స్ , జీ ఆర్ టి అర్ట్లాండ్స్ , లైవ్ స్పేస్ ఇంటీరియర్ & రేనోవేషన్స్ , SVS శ్రీవసుధ ట్రూ వెల్త్ ఇండియా మరియు ఎవోల్వ్ గార్లకు సొసైటీ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. -
గణపయ్య బొజ్జనిండేలా పాలతాలికలు, రెసిపీ ఇదిగో
వినాయక చవితి వేడుకలలకు రంగం సిద్ధమైంది. వివిధ ఆకారాల్లో గణనాయకులు ఇప్పటికే గణేష్ మంటపాలకు మేళ తాళాలతో తరలి వెళ్లాయి. అత్యంత భక్తి శ్రద్ధలతో విఘ్ననాయకుడిని కొలుచుకునేందుకు భక్తులు సన్నద్ధమై ఉన్నారు. ముఖ్యంగా వినాయక చవితి అనగానే రకరకాల పూలు, పళ్లుతో పాలవెల్లి అలంకరణ, పూజకోసం 21 రకాల పత్రి సేకరణ, పుస్తకాలకు, ( పలకలకు) పసుపు పూసిబొట్లు పెట్టి అలంకరించుకోవడం ఉంటుంది. ఇవన్నీ ఒక ఎత్తయితే వినాయకుడి ప్రసాదాలు మరింత ప్రత్యేకం. కుడుములు, పాల తాలికలు, బెల్లం తాలికల తెలుగువారి ప్రేత్యేకమైన పిండి వంటలలను బొజ్జ గణపయ్యకు నైవేద్యంగా పెడతారు. పాలతాలికల రుచి గొప్పదనం గురించి కవుల ప్రస్తావన, వర్ణన కూడా ఉంటుంది. అలాంటి పాల తాలికలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.పాలతాలికల రెసిపీ తడి బియ్యం పిండి వాడితేనే పాలను బాగా పీల్చుకుని,రుచిగా తాలికలు మృదువుగా వస్తాయి. వేరే మార్గం లేనివాళ్లు పొడి బియ్యం పిండిని కూడా వాడవచ్చు. బియ్యాన్ని కడిగి రాత్రంతా నానబెట్టి మరుసటి రోజు శుభ్రంగా కడిగి వడబోసుకుని వడకట్టి , నీడన ఆరబెట్టుకోవాలి. కొంచెం తడిపొడిగా ఉండగానే బియ్యాన్ని పిండి పట్టించి, జల్లించుకోవాలి. అరిసెల కోసం తయారుచేసుకునే పిండిలాగా మృదువుగా ఉంటే బావుంటుంది. పొడి పిండి అయితే కొద్దిగా నీళ్లు కలిపి పెట్టుకొని, పైన తడి గుడ్డ కప్పి ఉంచుకోవాలి. బెల్లంలో కొద్దిగా నీళ్లు పోసి బెల్లం కరగనివ్వండి, బెల్లం కరిగాక అప్పుడు తడి బియ్యం పిండి వేసి స్టవ్ ఆపేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. తరువాత వీటిని తాలికలుగా చపాతీ పీటపైగానీ, చెక్కపై గానీ వత్తు కోవాలి. పాలను మరింగించుకోవాలి. ఇపుడు ముందే నానబెట్టి ఉంచుకున్న సగ్గు బియ్యం వేసి మరికొంచెంసేపు ఉడకనివ్వాలి. ఇపుడు ముందే రెడీ చేసి పెట్టుకున్న తాలికలను జాగ్రత్తగా విరిగిపోకుండా వేసుకోవాలి. ఇలా కొద్ది సేపు ఉడకనివ్వాలి. ఇపుడు కొద్దిగా బియ్యం పిండిలో కాసిని నీళ్ళు పోసి ఉండలు లేకుండా కలిపి ఈ పాకంలో కలుపుకోవాలి. తాలికలు ఉడికినతరువాత బెల్లం పాకం వేసుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. ఇందులో యాలికల పొడి, నేతిలో వేయించిన ఎండు కొబ్బరి పలుకులు, జీడిపప్పు, కిస్మిస్ వేసుకుంటే చాలు. దీన్ని వేడిగా తిన్నా, చల్లారిన తిన్నా భలే రుచిగా ఉంటాయి.పాలు ఇష్టం లేనివారు, ఉత్తి బెల్లం పాకంలో తాలికలను వేసి, ఉడికించుకుని, , జీడిపప్పు, కిస్మిస్ వేసుకోవచ్చు. -
వినాయక పరిణయం.. ఆ ఆంతర్యం ఏమిటో తెలుసా?
వినాయకుని వివాహం గురించి చక్కటి పౌరాణిక గాథ. ప్రళయవేళ శ్రీ మహావిష్ణువు నాభినుండి వచ్చిన తామరపువ్వుపై బ్రహ్మ అవతరించాడు. ప్రళయానంతరం విష్ణువు మేల్కొని జీవనసృష్టి కార్యకలాపాన్ని ప్రారంభించమని తన కొడుకైన బ్రహ్మను ఆదేశించాడు. బ్రహ్మ సృష్టి ఆరంభిచాడు. కానీ అంతా వక్రంగా వుంది. అప్పటికి ఎన్నో కల్పాలలో సృష్టి చేస్తూ వస్తున్న బ్రహ్మకు ఈ పరిణామం ఆశ్చర్యం కలిగించింది. ఆలోచనలో పడ్డాడు. అప్పుడు నారదుడు కార్యారంభానికి ముందు వినాయక పూజ చేయనందువల్లే ఈ వైకల్పికము వచ్చిందని గణేశ అర్చనం చేయమని బ్రహ్మకు బోధించాడు. బ్రహ్మ వినాయకునికై కఠోర తపస్సు చేశాడు. ప్రత్యేక్షమైన వినాయకుడు బ్రహ్మ ఆంతర్యాన్ని గ్రహించి జ్ఞానం, క్రియలనే శక్తులను ఉపాసించమని బోధించాడు. బ్రహ్మ ఆ ఉపాసన చేశాడు. అప్పుడు ఆ రెండు శక్తులు సిద్ధి, బుద్ధి అనే రూపాలతో ప్రత్యక్షమయ్యాయి. బ్రహ్మ కోరిక మేరకు వారిరువురూ ఆయన కుమార్తెలుగా జన్మించారు. ఆ తరువాత బ్రహ్మ చేసిన సృష్టి సక్రమముగా కొనసాగింది. సిద్ధిబుద్ధులు యౌవనవతులయ్యారు. వారి వివాహం చేయాలని బ్రహ్మ సంకల్పించాడు. ఈలోగా నారదుడు కథ నడిపి సిద్ధిబుద్ధులు గణేశుని కోరుతున్నారని ఆయనకు చెప్పాడు. వినాయకుడు అంగీకరించాడు. తరువాత గణేశుడు మిమ్మల్ని కోరుతున్నాడని వారిద్దరికీ చెప్పాడు. బ్రహ్మ సమక్షంలో వినాయకుడికి పెళ్ళి జరిగింది. నూతన వధూవరులను ఆశీర్వదించి నారదుడు వినాయకునివైపు ఆశ్చర్యంగా చూశాడు. నారదుడి ఆంతర్యాన్ని గ్రహించిన వినాయకుడు.. ‘‘నారదా! మా మధ్య కలహం వస్తుదని నీవు భావించావు. ఈ సిద్ధిబుద్ధి ఎవరోకాదు, నా ఆంతరంగిక శక్తులైన జ్ఞానం, క్రియ. అందుకే మేము మళ్ళీ ఒకటయ్యాం. నీ కలహ చింతన లోకోపకారమైంది. భవిష్యత్ మానవుడు సిద్ధిబుద్ధి సమేతుడనైన నన్ను ఆరాధిస్తే వారికి సమస్త విఘ్నాలు తొలగి సుఖశాంతులు కలుగుతాయి’’ అని చెప్పాడు. ఇది వినాయకుడి పరిణయ గాథ ఆంతర్యం.శ్రీలక్ష్మీ గణపతి వైభవం..మన భారతీయ సంప్రదాయం ముఖ్యంగా మూడు నవరాత్రుల పండుగలను చెప్పింది. 1)వసంత నవరాత్రులు, 2) గణపతి నవరాత్రులు, 3) దేవీ నవరాత్రులు. వినాయక నవరాత్రులనకుండా గణపతి నవరాత్రులనటంలోనే గణపతి వైభవం మనకు స్పష్టంగా అర్థమౌతున్నది. వేదం కూడా వినాయకుణ్ణి గణపతిగానే కీర్తించింది. ఏ శుభకార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నా ‘‘ఓం గణానాం త్వా గణపతిగ్ం హవామహే‘‘ అనే వేదమంత్రంతోనే వినాయక పూజ ప్రారంభిస్తారు, గణపతులు మహాగణపతి, వాతాపిగణపతి, విద్యాగణపతి, విజయగణపతి, నృత్యగణపతి, సంగీత గణపతి, ఉచ్ఛిష్ట గణపతి ఇలా చాలా రకాలుగా ఉన్నారు. అందరికీ అవసరమైన వాటినందిస్తూ అందరిచేత పూజలందుకొనే వాడు లక్ష్మీగణపతి. ఈరోజుల్లో.. చదువులు, వ్యాపారాలు, ఆరోగ్యాలు, ఆరాధనలు, అన్నదానాలు అన్నీ ధనంతోనే ముడిపడి ఉన్నాయి. అందువల్ల లక్ష్మీగణపతిని ఆరాధిస్తే విద్యా, విజయం, ధనం అన్నీ కైవసం అవుతాయి. ఈ లక్ష్మీగణపతి వృత్తాంతం గణేశ జననం అనే పేరుతో బ్రహ్మవైవర్త పురాణంలో గణపతి ఖండంలో పూర్వాపరాలతో చాలా వివరంగా ఉంది.పార్వతీ పరమేశ్వరులు ఏర్పాటు చేసిన ఒక ఉత్సవంలో దేవతలందరితో పాటుగా హాజరైన లక్ష్మీదేవి ఆ సందర్భంలో గణేశుని ఉద్దేశించి మమ స్థితిశ్చ, దేహే తే గేహే భవతు శాశ్వతీ! (నీ శరీరంలో, నీవు ఉన్న ఇంటిలో శాశ్వతంగా నా స్థితి ఉంటుంది. అంటే నేను నివసిస్తాను) అని లక్ష్మీదేవి ప్రత్యేకంగా చెప్పినందువల్ల ఈ స్వామి లక్ష్మీగణపతి అయినాడు. వైభవం అంటే విశేషమైన పుట్టుక. ఆ పుట్టుక ఈ లక్ష్మీ గణపతిది."శ్రీకృష్ణాంశేన సంభూతం సర్వ విఘ్ననివారకమ్ ‘పార్వతీశ్వరయోః పుత్రం లక్ష్మీగణపతిం భజే ‘‘అనే ఈ శ్లోకాన్ని జపిస్తూ లక్ష్మీగణపతి స్వామిని ఆరాధిస్తే అఖండంగా ఆయుర్లక్ష్మి, ఆరోగ్యలక్ష్మి ఐశ్వర్యలక్ష్మి కలుగుతాయి. ప్రపంచమంతా సుఖశాంతులతో వర్ధిల్లుతుంది. -
వినాయక పూజాపత్రిలో ఆయుర్వేద విశేషాలు..
ప్రకృతిలో ఎన్నో రకాల వృక్ష జాతులు ఉండగా, వాటిలో కొన్నింటిని మాత్రమే వినాయక పూజలో పత్రిగా ఉపయోగించడంలోని ఆంతర్యమేమిటో,ఆయుర్వేద శాస్త్ర రీత్యా ఈ పండుగ ప్రాధాన్యమేమిటో తెలుసు కుందాం.వినాయక చవితి వర్షాకాలంలో వస్తుంది. ఎగువ ప్రాంతాలలో కురిసే వర్షాల వలన నిండిన నదులు, కాలువలలో నీరు దిగువ ప్రాతాలలోని చెరువులు, కుంటలు, దిగుడు బావులలోకి ప్రవహించే మార్గంలో అనేక మలినాలతో కూడిన చెత్తను కూడా మోసుకు వస్తుంది. ఆ నీటిని అలాగే తాగిన ప్రజలు వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. అందుకే ముందుచూపు కలిగిన మన మహర్షులు ప్రతి సంప్రదాయంలోనూ ప్రజలకు హితవు కలిగించే కొన్ని ప్రత్యేకమైన ఆచారాలను సూచించారు. వాటిలో భాగంగా వినాయక చవితి పర్వదినం రోజున పూజలో ఉపయోగించడానికి కొన్ని ప్రత్యేకమైన ఔషధ జాతులకు సంబంధించిన మొక్కలు, వృక్షాల ఆకులను పూజాపత్రిగా సూచించారు. ఈ పూజాపత్రిని నిమజ్జన సమయంలో ఆయా చెరువులు, కుంటలలో వెయ్యడం వల్ల వాటిలోని నీరు శుభ్రంగా మారుతుంది. తద్వారా క్రిమివ్యాధులు వ్యాపించకుండా ఉంటాయి. వర్షాకాలంలో సాధారణంగా వచ్చే జ్వరాలు, శ్వాసకోశ, జీర్ణకోశ వ్యాధులు, చర్మవ్యాధులు వంటి సమస్యలకు విరుగుడుగా పనిచేసే ఆకులను మన పూర్వీకులు పూజాపత్రిలో భాగంగా చేశారు. పూజాపత్రి ఔషధ గుణాలను చెప్పుకోవాలంటే, ఉదాహరణకు మాచీపత్రం (దవనం ఆకు) రసాన్ని తీసుకోవడం ద్వారా దగ్గు, ఉబ్బసం నుంచి ఉపశమనం కలుగుతుంది. బృహతీపత్రం (వాకుడు ఆకు) వాపులను తగ్గిస్తుంది. బిల్వపత్రం (మారేడు ఆకు) చర్మ సమస్యలను తగ్గిస్తుంది. దుర్వాయుగ్మం (గరిక) శరీరానికి బలం చేకూరుస్తుంది. ఇలాగే, వినాయక పూజలో ఉపయోగించే ప్రతి పత్రికి విశేష ఔషధ లక్షణాలు ఉన్నాయి. అందుకే, వీటిని మన మహర్షులు, ఆయుర్వేద పండితులు సంప్రదాయంలో భాగంగా చేశారు. – ఆచార్య రాఘవేంద్ర వాస్తు జ్యోతిష సంఖ్యా శాస్త్ర నిపుణులు, ఒంగోలు -
ఆచరించిన వారికి అండాదండా.. సంకటహర చతుర్థీ వ్రతం!
వినాయకుని అనుగ్రహం పొందేందుకు మనం ప్రతియేటా భాద్రపద శుద్ధ చవితినాడు వినాయక చవితి పర్వదినం జరుపు కుంటాం. అయితే తలపెట్టిన ఏ పనీ ముందుకు సాగక, జీవితంలో అన్నింటా విఘ్నాలు ఎదురవుతూ, అశాంతి, శారీరక, మానసిక రుగ్మతలు, రుణబాధలు వంటి కష్టాలు కలుగుతూ ఉన్నప్పుడు, దుష్టగ్రహాల పీడతో నానా బాధలు అనుభవించే వారు ప్రతి మాసంలోనూ సంకటహర చతుర్థినాడు యథాశక్తి విఘ్నేశునికి పూజలు జరిపితే ఈ కష్టాలన్నీ తొలగి సుఖ సంతోషాలతో పాటు కార్యజయం కలుగుతుందని శాస్త్రం చెబుతోంది.వేదకాలం నుంచి ఆధునిక కాలం వరకు గణపతి ఆరాధన విస్తృతంగా జరగటం తెలిసిందే. వినాయక శబ్దానికి విశిష్టమైన వాడని, నాయకులు లేనివాడని అర్థం. గణపతి గురించి గణేశ పురాణం, స్కాంద పురాణం, ముద్గల పురాణం, బ్రహ్మవైవర్త పురాణం, శివ పురాణంలో కనిపిస్తుంది. ఋగ్వేదంలో సైతం గణపతి ప్రస్తావన ఉంది. గణపతిని జ్ఞానానికి అధిదేవత అని ఋగ్వేదం కొనియాడింది. గణాల అధిపతిగా గణపతి పేరు సార్థకమయ్యింది. మానవులందరికీ మంచి చేసేవారిని గణపతి అని అంటారు. మానవునిలోని చెడును హరించే వాడికి గణపతి అని, వినాయకుడని పేరు. వినాయకునికి రోగహర శక్తి ఉందని గణేశ పురాణం చెబుతోంది.గణపతితో సమానమైన పేరుగల బ్రాహ్మణస్పతిలేదా బృహస్పతి గురించి ఋగ్వేదంలో ప్రస్తావన కనిపిస్తుంది. తనను ఆరాధించేవారిని గణపతి ఎల్లవేళలా కాపాడుతుంటాడని ఋగ్వేదం వివరించింది. బ్రహ్మచర్యం అవలంబించి, వేద వేదాంగ శాస్త్రాలను అధ్యయనం చెయ్యవలసిన విద్యార్థులకు గణేశుడు ఆశ్రయ దాత, పోషకుడు.సంకట విమోచక గణపతి స్తోత్రం..నారద ఉవాచప్రణమ్య శిరసాదేవం గౌరీపుత్రం వినాయకంభక్తావాస స్మరేన్నిత్యం ఆయుఃకామార్థ సిద్ధయేప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకంతృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకంలంబోదరం పంచమం చ షష్టం వికటమేవచసప్తమం విఘ్నరాజంచ ధూమ్రవర్ణం తథాష్టమం నవమం ఫాలచంద్రం చ దశమంతు వినాయకంఏకాదశం గణపతిం ద్వాదశాంతు గజాననంద్వాదశైతాని నామాని యః పఠేత్ శ్రుణుయాన్నిత్యంనచ విఘ్నభయం తస్యసర్వసిద్ధికరం ప్రభోఃవిద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ లభతే ధనం పుత్రార్థీ లభేత్ పుత్రం మోక్షార్థీ లభేత్ గతింజపేద్గణపతి స్తోత్రం షడ్భిర్మాసైః ఫలం లభేత్సంవత్సరేణ సిద్ధించ లభతే నాత్ర సంశయఃఅష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చః లిఖిత్వాయత్సమర్పయేత్తస్య విద్యా భవేత్సర్వా గణేశస్య ప్రసాదతఃసంకటహర చతుర్థి ఎప్పుడు వస్తుంది?ప్రతిమాసంలోనూ వచ్చే బహుళ చతుర్థి (బహుళ చవితి)ని సంకటహర చతుర్థి లేదా సంకట విమోచక చతుర్థిగా పిలుస్తారు. జాతకంలో కేతు మహర్దశ నడుస్తున్నవారు, కష్టాలను అనుభవించేవారు, తరచు కార్యహానితో చికాకులకు లోనవుతున్నవారు ఈ వ్రతం చేయడం మంచిది. ఆ రోజున పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం గుడికెళ్లి గరికపై ప్రమిదనుంచి దీపారాధన చేసి, గరికపోచలు, పుష్పాలు, పత్రితో గణపతిని పూజించి, లడ్డూలు లేదా ఉండ్రాళ్లు నివేదించి ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి. ప్రతి మాసంలోనూ వచ్చే సంకటహర చతుర్థినాడు ఇదేవిధంగా ఆచరించగలిగితే సకల దోషాలూ పోయి, కార్యజయం కలుగుతుంది. ప్రతి బహుళ చతుర్థినాడూ వినాయక చవితిరోజు చేసినట్లే పత్రితోనూ, పుష్పాలతోనూ గణపతికి పూజ చేస్తే అన్నివిధాలుగా అభివృద్ధి చెందుతారు. కష్టాలతోనూ, సమస్యలతోనూ బాధపడేవారు సంకటహర చతుర్థి వ్రతంతోపాటు సంకట విమోచక గణపతి స్తోత్రాన్ని విడవకుండా ఆరుమాసాలపాటు పఠించడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది. వ్రతాన్ని ఆచరించలేనివారు కనీసం సంకటహర గణపతి స్తోత్రాన్ని నాలుగుసార్లు పారాయణ చేసినా మంచిదే. ఈ వ్రతాచరణ వల్ల విఘ్నాలు తొలగి, పనులు సజావుగా సాగుతాయి. కేతుగ్రహ బాధలు తొలగుతాయి. -డి.వి.ఆర్. భాస్కర్ -
ఇండోనేషియా నగదు నోటుపై గణపతి చిత్రం
హిందువుల తొలిపూజలు అందుకునే గణపతి చిత్రం ఇతర దేశాల నగదు నోటుపై ముద్రించడం విశేషమే. ఇండోనేషియా దేశంలోని రూ. 20 వేల నోటుపై గణపతి చిత్రం ముద్రించి ఉండటం మనకు ఆసక్తి కలిగించే అంశమే. ఆ దేశం ఒక ఇస్లామిక్ దేశం. ఇప్పటి వివరాల ప్రకారం ఆ దేశంలో 88 శాతంపైగా ముస్లింలు ఉండగా మూడు శాతం మంది మాత్రమే హిందువులు ఉన్నారు. కానీ కొన్ని వేల సంవత్సరాల ముందు ఆ దేశం హిందూ మతానికి చాలా ప్రాముఖ్యమైన ప్రదేశంగా వెలుగొందింది. అక్కడవున్న ఎన్నో పురాతన దేవాలయాలు ఇప్పటికీ దేశ, విదేశీయులకు ప్రముఖ దర్శనీయ స్థలాలుగా వెలుగొందుతున్నాయి.ఒకటవ శతాబ్దం నుంచి ఆ దేశంలో ఎక్కువగా హిందూ మతం ఉన్నదని భావిస్తారు. ఆ దేశానికి చెందిన రూ. 20వేల (రూపియా) కరెన్సీ నోటు మీద జ్ఞానాన్ని ప్రసాదించే విజ్ఞాన గణపతి చిత్రాన్ని చిహ్నంగా ముద్రించబడి ఉంటుంది. అదే నోటు మీద ఆ దేశంలోని పిల్లలందరికీ విద్య అందించడానికి విశేష కృషి చేసిన ఇండోనేషియా జాతీయ విద్యా పితామహుడిగా పిలువబడిన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు హజర్ దేవంతర చిత్రం ప్రచురించబడి వుంటుంది. తదనంతర క్రమంలో (1950) ఆయన ఆ దేశ విద్యాశాఖ మంత్రిగాను పనిచేశారు. ఆయన విద్యాభివృద్ధికి చేసిన కృషికి ఫలితంగా ఆయన పుట్టినరోజును జాతీయ విద్యాదినోత్సవంగా జరుపుకుంటున్నారు.ఈ విధంగా ఆ నోటుపై జ్ఞానాన్ని అందించే విద్యాగణపతి, విద్యాభివృద్ధికి కృషి చేసిన ప్రముఖుని చిత్రాలతోపాటు, ఆ నోటు వెనుక తరగతి గదిలో వున్న పిల్లల చిత్రం ముద్రించబడి వుండటం విశేషం. -
రంగులు మార్చుకునే వినాయకుడు..మీరెప్పుడు చూసుండరు!
సకల విఘ్నాలనూ తొలగించే దైవంగా తొలి పూజలు అందుకొనే వేలుపు గణనాథుడు. ఆయనకు ఇద్దరు భార్యలు ఉన్నారని సూచించే పురాణగాథలు ఉన్నప్పటికీ, ఏ ఆలయంలోనైనా గణేశుడు ఒక్కడే దర్శనమిస్తాడు. ఇద్దరు భార్యలతోనూ కనిపించే ఆలయాలను వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు. అలాంటి అరుదైన కోవెళ్ళలోకెల్లా అరుదైన ఆలయం ఒకటుంది. ఇక్కడ భార్యలతో పాటు పుత్రులతో కూడా కలిసి కొలువుతీరాడు పార్వతీ తనయుడు. రాజ్య రక్షకుడు: రణథంబోర్ వినాయకుడిని పరమ శక్తిమంతునిగా, రాజ్య రక్షకునిగా స్థానిక చరిత్ర అభివర్ణిస్తోంది. అది క్రీస్తుశకం 1299వ సంవత్సరం. రణథంబోర్ రాజు హమీర్‌కూ, ఢిల్లీ పాలకుడు అల్లావుద్దీన్ ఖిల్జీకీ మధ్య యుద్ధం మొదలైంది. యుద్ధ సమయంలో సైనికుల కోసం ఆహారాన్నీ, అవసరమైన ఇతర సరుకులనూ కోటలోని గోదాముల్లో నిల్వ చేశారు. ఈ యుద్ధం చాలా సంవత్సరాలు సాగడంతో గోదాముల్లో నిల్వలు నిండుకున్నాయి. వినాయకునికి పరమ భక్తుడైన హమీర్‌కు ఏం చెయ్యాలో పాలుపోలేదు. భారమంతా గణపతి మీద వేశాడు. ఒక రోజు రాత్రి అతను నిద్రపోతూండగా ఏకదంతుడు కలలోకి వచ్చాడు. సమస్యలన్నీ మర్నాటి పొద్దుటికల్లా తీరిపోతాయని అభయం ఇచ్చాడు. మరునాడు కోటలోని ఒక గోడ మీద మూడు నేత్రాలున్న వినాయకుని ఆకృతి దర్శనం ఇచ్చింది. దరిమిలా యుద్ధం ముగిసిపోయింది. ఖిల్జీ సేనలు వెనుతిరిగాయి. మరో చిత్రం ఏమిటంటే కోటలోని గోదాములన్నీ సరుకులతో నిండి ఉన్నాయి. గణేశుడే తన రాజ్యాన్ని రక్షించాడనీ, ఎల్లప్పుడూ తమకు అండగా ఉంటాడనీ భావించిన హమీర్ క్రీ.శ. 1300 సంవత్సరంలో కోటలోనే వినాయక ఆలయాన్ని నిర్మించాడు. ఇదీ విశిష్టత: ఈ ఆలయంలో వినాయకుడు మూడు నేత్రాలతో దర్శనం ఇస్తాడు. భార్యలైన సిద్ధి, బుద్ధి తోపాటు కుమారులైన శుభ్, లాభ్ కూడా గణేశునితో పాటు కొలువు తీరి పూజలందుకోవడం ఈ ఆలయ విశిష్టత. ఇలాంటిది మరే వినాయక ఆలయంలోనూ కనిపించదు. స్వామికి ప్రతిరోజూ అయిదు సార్లు హారతులు ఇస్తారు. అర్చకులతోపాటు భక్తులు కూడా సామూహిక ప్రార్థనలూ, భజనగీతాలాపనలూ చేస్తారు. ఈ స్వామిని పూజిస్తే విద్య, విజ్ఞానాలతోపాటు సంపదనూ, సౌభాగ్యాన్నీ అనుగ్రహిస్తాడని భక్తుల విశ్వాసం. ఎక్కడ? రాజస్థాన్ రాష్ట్రంలోని సవాయ్ మధోపూర్ జిల్లా రణథంబోర్‌లో తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాల నుంచి సవాయ్ మాధోపూర్ జంక్షన్‌కు నేరుగా రైళ్ళు ఉన్నాయి. అక్కడి నుంచి సుమారు 17 కి.మీ. దూరంలో ఉన్న రణథంబోర్‌కు రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు. రణథంబోర్‌కు సమీప విమానాశ్రయం సుమారు 150 కి.మీ. దూరంలోని జైపూర్‌లో ఉంది. రంగులు మార్చే శ్రీ మహాదేవర్ అతిశయ వినాయగర్ తమిళనాడు రాష్ట్రంలోని నాగర్ కోయిల్ జిల్లాలోని కేరళపురం గ్రామంలో ఒక అద్భుతమైన వినాయక దేవాలయమే ‘శ్రీ మహాదేవర్ అతిశయ వినాయగర్ ఆలయం’. ఈ ఆలయం చూడడానికి చిన్నదే అయినా... ప్రాశస్త్యం మాత్రం చాలా పెద్దది. అందుకు కారణం ఈ ఆలయంలోని మూలవిరాట్టు అయిన ‘వినాయకుడు’ ఆరు నెలలకు ఒకసారి తన రంగు తానే మార్చుకోవడం. మార్చి నుంచి జూన్ వరకూ నల్లని రంగులో ఉండే ఈ వినాయకుడు జూలై నుంచి ఫిబ్రవరి వరకూ తెల్లని రంగులో ఉంటాడు. ఈ విధంగా రంగులు మార్చుకోవడం ఈ వినాయకుని మాహాత్మ్యం అని భక్తుల విశ్వాసం. అంతే కాదు, ఇక్కడ మరో విచిత్రం కూడా వుంది. ఈ ఆలయం ఆవరణలో ఓ మంచినీటి బావి వుంది. నీటికి రంగు లేదు అన్న నిజం మనందరికీ తెలిసిన విషయమే. కానీ అది మిగతా చోట్ల మాటేమోగానీ.. నా దగ్గర మాత్రం అది చెల్లదు అంటుంది ఇక్కడున్న ఈ బావి. ఇక్కడి వినాయకుడు తన రంగును మార్చుకు న్నట్లే.. ఈ బావిలో నీళ్లు కూడా తమ రంగును మార్చుకుంటాయి. అయితే ఈ మార్పులో చిన్న తేడా ఉంది. వినాయకుడు నల్లగా ఉన్న సమయంలో.. ఈ బావిలో నీళ్లు తెల్లగా ఉంటాయి.., వినాయకుడు తెల్లగా ఉన్న సమయంలో.., ఈ బావిలో నీళ్లు నల్లగా ఉంటాయి. అంతేకాదు, ఇంతకన్నా మరో విచిత్రం కూడా ఉంది. సాధారణంగా శిశిరఋతువులో చెట్ల ఆకులు రాలడం ప్రకృతి సహజం. కానీ, దట్టమైన అడవుల కారణంగా తమిళ, కేరళారణ్య ప్రాంతాలకు ఈ ఋతు భేదం వర్తించదు. అవి ఎప్పుడూ సతతహరితాలే. కానీ, ఈ ఆలయంలో ఉన్న మఱిచెట్టు మాత్రం దక్షిణాయనంలో ఆకులు రాల్చి, ఉత్తరాయణంలో చిగురించడం ప్రారంభిస్తుంది. అందుకే ఈ ఆలయాన్ని ‘మిరాకిల్ వినాయకర్ ఆలయం’ అని కూడా పిలుస్తారు. ఇక చారిత్రక విషయాల కొస్తే... ఈ ఆలయం 12వ శతాబ్ది కాలం నాటిదని, 1317 సంవత్సరంలో ఈ ఆలయం నిర్మించారనీ, ఈ ఆలయంకు 2300 సంవత్సరాల చరిత్ర ఉన్నదనీ, చరిత్రకారుల అంచనా మాత్రమే కాదు, స్ధానికులు కూడా అదే చెప్తారు. నిజానికిది ‘శివాలయం’. ఈ ఆలయ ప్రాకార ప్రాంగణంలో ముందు శివాలయం ఉంది. ఆ తర్వాతే ఈ ఆలయ నిర్మాణం జరిగింది. అందుకే ఈ ఆలయాన్ని ‘శ్రీ మహాదేవర్ అతిశయ వినాయగర్’ ఆలయం అని అంటారు. ఈ ఆలయానికో చరిత్ర కూడా ఉంది. ఆ రోజులలో ‘కేరళపురం’ రాజుగారు తీర్థయాత్రలకని ‘రామేశ్వరం’ వెళ్లాడట. అక్కడ తన పరివారంతో కలసి దక్షిణ సముద్రంలో స్నానం చేస్తున్న సమయంలో, ఆయనకు ఒక వినాయక విగ్రహం, సముద్ర కెరటాలలో తడుస్తూ కనిపించింది. రాజుగారు ఆ విగ్రహాన్ని రామేశ్వరం రాజుగారికి అప్పగించబోతే..‘దొరికిన వారికే ఆ విగ్రహం చెందడం ధర్మం’ అని భావించి, రామేశ్వరం రాజు ఆ విగ్రహాన్ని ‘కేరళపురం’ రాజుకే ఇస్తూ, మరొక ‘మరకత(పచ్చల) గణపతిని కూడా బహూకరించాడు. కేరళపురం రాజుగారు ఆ రెండు విగ్రహాలనూ తన రాజ్యం తీసుకుని వచ్చి ప్రతిష్ఠించాడు. అయితే తురుష్కుల దండయాత్రలో ఆ మరకత గణపతి కొల్లగొట్టబడి, ఈ గణపతి మాత్రం ఇక్కడ మిగిలిపోయాడు. ఈ ఆలయం ప్రతిష్ఠ కూడా ఆగమశాస్త్రానుసారం జరగలేదు. ఒక రాతిపీఠం మీద అతి సాధారణంగా ఈ వినాయక విగ్రహాన్ని స్థాపించారు. ఈ ఆలయ ప్రాకార గోడల మీద అతి పురాతనమైన వర్ణచిత్రాలు చూపరులను ఎంతగానో ఆకర్షిస్తాయి.ఈ వినాయకునికి ఉదయము, సాయంకాలము కూడా అభిషేకాలు జరుగుతూండడం విశేషం. ఏ కోరికతోనైనా భక్తులు ఈ స్వామికి కొబ్బరికాయ గానీ, బియ్యపుమూట గానీ, ముడుపుగా చెల్లిస్తే వారి కోరిక తప్పకుండా నెరవేరుతుందనేది ఎవరూ కాదనలేని నిజం. దొడ్డ గణపతి ఆలయం, బెంగళూరు బెంగళూరులోని బసవన గుడి బుల్ ఆలయం పక్కనే ఉంది ఈ ఆలయం. దేవాలయంలోని గణపతి విగ్రహం 18 అడుగుల పొడవు, 16 అడుగుల వెడల్పు ఉంటుంది. ఈయనను సత్య గణపతి అని, శక్తి గణపతి అని పిలుస్తుంటారు.విశేషం ఏమిటంటే ... ఆలయం కుడివైపు క్రమంగా పెరగటం. భక్తులు ఇది దేవుని మహిమగా చెబుతారు. బెంగళూరు నుంచే కాక రాష్ట్రం నలుమూల నుండి భక్తులు వచ్చి దేవుణ్ణి దర్శించి, తమ కోరికలు తీర్చమని కోరుకుంటారు. స్వామి వారి అలంకరణ: వారంలో అన్ని రోజులలో స్వామి వారికి పూజలు చేసి రకరకాల అలంకరణ చేయటం ఇక్కడి ప్రత్యేకత. ఈ అలంకరణ లో అతి ముఖ్యమైనది వెన్నతో స్వామిని అలంకరించటం. దీన్ని చూసేందుకు రెండు కళ్ళు చాలవు అని భక్తులు చెప్పుకొంటారు. ఇది చూస్తే జన్మ ధన్యం అయినట్లు భావిస్తారు ఈ భారీ గణేషుని శరీరానికి వెన్న పట్టించటానికి 100 కేజీలకు పైగా వెన్న అవసరం అవుతుంది. ఆలయ వెనక శ్రీ శివ శక్తి బేడర కన్నప్ప, శ్రీ కానేశ్వర, శివాలయాలు ఉన్నాయి. ఆలయ సందర్శన సమయం దొడ్డ గణేశ దేవాలయంలో స్వామి దర్శనం ఉదయం ఏడు నుంచి పన్నెండున్నర వరకు తిరిగి సాయంత్రం అయిదున్నర నుండి రాత్రి ఎనిమిదిన్నర వరకు ఉంటుంది. వినాయక చవితి నుంచి ఉత్సవాలు వైభవంగా జరుపుతారు. బెంగళూరు లో వాయు, రోడ్డు, విమాన సౌకర్యాలు చక్కగా అందుబాటులో ఉన్నాయి. బెంగళూరు లో అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ ఉంది. అలాగే రెండు రైల్వే స్టేషన్ లు – బెంగళూరు సిటీ, యశ్వంతపుర ఉన్నాయి ఇక్కడికి దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుండి రైళ్లు, విమానాలు వస్తుంటాయి. దక్షిణ భారతదేశంలోని అన్ని ప్రధాన పట్టణాల నుండి బెంగళూరు కు బస్సు సౌకర్యం ఉంది. తెలుగు రాష్ట్రాలలో సిద్ధివినాయక ఆలయం ఆంధ్రప్రదేశ్‌లో సుప్రసిద్ధ గణపతి ఆలయాల్లో అయినవిల్లి ఒకటి. ఇది స్వయంభూ గణపతి క్షేత్రం. కాణిపాకం తరువాత అంతటి ప్రాశస్త్యం దీనికి ఉంది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి సుమారు 60 కి.మీ, అమలాపురానికి 12 కి.మీ దూరంలో ఈ క్షేత్రం నెలకొంది. పవిత్ర గోదావరి నది ఒడ్డున, పచ్చని కోనసీమ అందాలు, సుందర ప్రశాంత వాతావరణం, ప్రకృతి రమణీయతలతో ఈ ఆలయం అలలారుతోంది. ఉమాసుతుడు ఇక్కడ సిద్ధి వినాయకునిగా కొలువై భక్త జనాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఈ ఆలయ ప్రాంగణంలో వివిధ దేవతల ఆలయాలూ ఉన్నాయి. స్థల పురాణం కృతయుగం నుంచే ఇక్కడ స్వామి కొలువై ఉన్నట్లు స్ధల పురాణం చెబుతోంది. దక్ష ప్రజాపతి ద్రాక్షరామం లో చేసిన దక్షయజ్ఞానికి ముందు ఇక్కడి వినాయకుని పూజించి పునీతుడయ్యాడని ప్రతీతి. వ్యాస మహర్షి దక్షణ యాత్ర ప్రారంభానికి ముందు ఇక్కడ గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించగా.. దేవతలు ఆలయాన్ని నిర్మించారు. అనంతర కాలంలో నాటి తూర్పు చాళుక్యుల నుంచి నేటి పెద్దాపురం సంస్థానాధీశుల వరకు ఎందరో ఆలయ పునరుద్ధరణ, అభివృద్ధిలో భాగస్వాములయ్యారు. క్షేత్ర ప్రత్యేకత అయినవిల్లి ఆలయ ప్రస్తావన క్రీ.శ 14వ శతాబ్ధంలో శంకరభట్టు రచించిన శ్రీపాదవల్లభ చరిత్రలో ఉంది. శ్రీపాదవల్లభుల మాతామహులు అయినవిల్లిలో స్వర్ణ గణపతి యజ్ఞం చేసినట్లు.. యజ్ఞం ముగింపులో గణనాథుడు సర్ణమయకాంతులతో దర్శనమిచ్చి హారతులను స్వయంగా అందుకున్నట్లు అందులో పేర్కొన్నారు. శ్రీపాద వల్లభుని జననాన్ని తెలియజేశారని చెబుతారు. దక్షిణాభిముఖంగా దర్శనం..సాధారణంగా దేవాలయాల్లోని మూలవిరాట్ తూర్పు ముఖంగా దర్శనమిస్తారు. దీనికి భిన్నంగా ఇక్కడి సిద్ధి వినాయకుడు దక్షిణాభిముఖుడై భక్తకోటికి అభయమిస్తున్నాడు. అలాగే దక్షిణ సింహద్వారం ఉన్న గృహాలకు ఎలాంటి విఘ్నాలు కలగవని అయినవిల్లివాసుల నమ్మకం. వివిధ ఉత్సవాలు.. ఇక్కడి సిద్ధి వినాయకుని మూలవిరాట్ అత్యంత ప్రాచీనమైంది. రోజూ స్వామికి వివిధ పూజలు, అర్చనలు, అభిషేకాలు జరుగుతాయి. అభిషేక సేవకు ఈ ఆలయంలో విశేష ప్రాముఖ్యం ఉంది. శివకేశవులకు ప్రీతికరమైన వైశాఖ శుద్ధ ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు పాంచాహ్నిక దీక్షతో అయిదు రోజులపాటు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. పూర్ణిమనాడు కల్యాణం.. గ్రామోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయి. భాద్రపద శుద్ధ చవితి నుంచి తొమ్మిది రోజుల పాటు వినాయక నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. మకర సంక్రాంతి, కనుమనాడు ప్రభల ఉత్సవం చేస్తారు. విజయదశమి, కార్తీకమాసం మొదటి, నాలుగు సోమవారాలు, కృష్ణాష్టమినాడు ప్రత్యేక పూజలు చేసి గ్రామోత్సవం నిర్వహిస్తారు. ఏటా మాఘ మాసంలో చదువుల పండుగ జరుగుతుంది. పండగలో భాగంగా గంగ, యమున, గోదావరి, సరస్వతి, నర్మద, సింధు, కావేరి నదీ జలాలతో స్వామిని అభిషేకిస్తారు. లక్ష కలములను సిద్ది వినాయకుని పాదాల వద్ద ఉంచి... లక్ష దూర్వములతో పూజిస్తారు. అనంతరం ఆ పెన్నులను విద్యార్థులకు పంచుతారు. వీటితో పరీక్షలు రాస్తే మంచి ఉత్తీర్ణత సాధించడంతో పాటు, చదువులో రాణిస్తారని భక్తుల విశ్వాసం. వివిధ ఆలయాలు... అయినవిల్లి క్షేత్రంలో గణపతి ఆలయంతో పాటు అన్నపూర్ణా సమేత విశ్వేశ్వరాలయం, శ్రీదేవీ, భూదేవీ సమేత కేశవస్వామి ఆలయం, కాలభైరవ ఆలయాలు ఉన్నాయి. ఇలా చేరుకోవాలి... రాజమహేంద్రవరం నుంచి అయినవిల్లికి బస్సు సౌకర్యం ఉంది. అమలాపురం నుంచి బస్సు, ఆటోలో దేవాలయాన్ని చేరుకోవచ్చు. కాకినాడ నుంచి యానాం, అమలాపురం, ముక్తేశ్వరం మీదుగా అయినవిల్లి చేరుకోవచ్చు. ఇతర సమాచారం.. దేవాలయం ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు తిరిగి మధ్యాహ్నం 3:30 గంటల నుంచి 8గంటల వరకు తెరిచి ఉంటుంది. అభిషేకం ఉదయం 7 గం.ల నుంచి 11 గం. వరకు జరుగుతుంది. (సాధారణ రోజుల్లో) – డి.వి.రామ్ భాస్కర్ -
వినాయకుడి పేరు మీద వచ్చిన సినిమాలివే!
గణపతిని కొందరు భక్తిశ్రద్ధలతో పూజిస్తే మరికొందరు భయభక్తులతో పూజిస్తారు. ఈయన ఆశీర్వాదం లేకుండా పని మొదలుపెడితే మొదటికే మోసం వస్తుందన్న భయంతో ఆయన్ను పూజించేవాళ్లు చాలామంది. ఏ విఘ్నాలు లేకుండా పని జరగాలని ప్రేమగా పూజించేవారు కోకొల్లలు. సినిమా రంగంలోనూ గణనాయకుడికి పెద్ద పీటే వేస్తారు. వినాయక పూజతోనే సినిమా చిత్రీకరణ మొదలవుతుంది. అంతేనా.. సినిమా ప్రారంభంలో కూడా మొదట గణపతిని చూపిస్తూ కొన్నిసార్లు ఆయన పాట కూడా వేస్తారు. అయితే ఈ ట్రెండ్ ఈ మధ్య పెద్దగా కనిపించడం లేదు. కానీ బొజ్జగణేశుడిని పూజించడం మాత్రం ఎవరూ విస్మరించడం లేదు. చిన్నాపెద్దా తేడా లేకుండా అందరికీ ఆయనంటే అంతిష్టం. సినిమాల్లోనూ గణపతి చాలా పవర్ఫుల్. కొన్ని కీలక సందర్భాలు ఈయనచుట్టే తిరగ్గా మరికొన్ని ఏకంగా గణపతి గురించే వచ్చాయి. సినిమాల్లో ఆయన గురించి వచ్చిన పాటలు ఇప్పటికీ మండపాల్లో మార్మోగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో అసలు గణేశుడి పేరు మీద ఏయే సినిమా టైటిల్స్ ఉన్నాయో ఓసారి చూసేద్దాం.. ఉమా చండీ గౌరీ శంకరుల కథ, భూకైలాస్.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చిత్రాలు గణేశ్ మహత్యాన్ని తెలిపేవి ఉన్నాయి. కానీ ఆయన పేరు మీద మాత్రం కొన్ని సినిమాలే ఉన్నాయి. అవే.. గణపతి, ఓం గణపతి, గణేశ్, వినాయక చవితి, విలేజ్‌లో వినాయకుడు, శ్రీ వినాయక విజయం. త్వరలో రాబోతున్న గం గం గణేశా కూడా ఈ లిస్టులో చేరింది. కానీ ఇందులో కొన్ని పేరుకు మాత్రమే ఏకదంతునివి కావడం గమనార్హం. చదవండి: ఎవర్రా మీరంతా? ఇలా తగులుకున్నారు.. ఆడేసుకుంటున్న నెటిజన్స్! -
ఆలయంలో అలా ప్రధాని మోదీ.. బీఆర్ఎస్ నేతపై ఫైర్
ఢిల్లీ: దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి సంబంధించిన ఓ ఫొటోను వైరల్ చేసిన బీఆర్ఎస్ నేతపై బీజేపీ శ్రేణులు మండిపడుతున్నాయి. మంగళవారం మహారాష్ట్ర పూణే పర్యటన సందర్భంగా ఓ ఆలయాన్ని సందర్శించారాయన. ఆ టైంలో ఆయన విఘ్నేషుడి విగ్రహానికి వెన్ను చూపించారంటూ బీఆర్ఎస్ నేత వై సతీష్‌రెడ్డి తన ట్విటర్లో పోస్ట్‌చేసి మండిపడ్డారు. మోదీ జీ, మన దేవతలకు వెన్ను చూపడం అగౌరవంగా పరిగణించబడుతుంది. మీరు ఎవరిని ఎదుర్కొంటున్నారు? అంటూ ట్వీట్ చేశారాయన. దీనిపై పలువురు రాజకీయనేతలు కూడా స్పందించారు. మోదీపై విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో.. బీజేపీ శ్రేణులు కౌంటర్‌కు దిగాయి. ఫ్యాక్ట్ చెక్ పేరిట అసలు విషయాన్ని బయటపెట్టాయి. Modi ji, it is considered disrespectful to show our backs to our deities. Whom are you facing? Irony! pic.twitter.com/qcv8qIThkf — YSR (@ysathishreddy) August 1, 2023 इस तस्वीर के बारे में आपकी क्या राय है? pic.twitter.com/ENDNfigB19 — Srinivas BV (@srinivasiyc) August 1, 2023 మోదీ వినాయకుడి ముందర పరికర్మ చేస్తున్న టైంలో స్క్రీన్‌షాట్ తీసి.. దానిని ఇలా వైరల్ చేశారు. ఆ విషయాన్నే బీజేపీ నేతలు ప్రస్తావించారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సైతం ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ.. లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. పుణే శివాజీ రోడ్లో ఉన్న దగ్దుషేత్ హల్వాయి గణేష్ దేవాలయం.. మహారాష్ట్రలో అత్యధిక హుండీ ఆదాయం వచ్చే ఆలయాల్లో ఒకటి. నవరాత్రుల సమయంలో లక్షల మంది దర్శిస్తుంటారు. రాష్ట్రపతులు, ప్రధానులు, మాజీలు తరచూ ఈ ఆలయాన్ని దర్శిస్తుంటారు కూడా. सुखकर्ता दुखहर्ता वार्ता विघ्नाची। 🙏🏻 pic.twitter.com/yGLViOOJdg — Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) August 1, 2023 𝐓𝐑𝐔𝐓𝐇.. Just taken a snapshot from the Pooja and spreading it as if he was posing for pics. Shameful. https://t.co/aB0pZFEe7B pic.twitter.com/1zScdoNb1p — 𝐒𝐚𝐠𝐚𝐫 𝐆𝐨𝐮𝐝 (@Sagar4BJP) August 2, 2023 -
కేజ్రీవాల్ కరెన్సీ డిమాండ్‌కు బీజేపీ కౌంటర్
-
గుజరాత్ ఎన్నికల వేళ కేజ్రీవాల్ వింత డిమాండ్
-
ఇండియన్ కరెన్సీ నోట్లపై కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి, వినాయకుడి ఫోటోలు ముద్రించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ప్రతినెలా కొత్తగా ప్రింట్ చేసే నోట్లపై మహాత్మా గాంధీ ఫోటోతో పాటు ఈ దేవుళ్ల ఫోటోలు కూడా ఉండేలా చూడాలని సూచించారు. అయితే ఇలా ఎందుకు చేయాలో కూడా కేజ్రీవాల్ వివరించారు. లక్ష్మీదేవి ఫోటో కరెన్సీ నోటుపై ఉంటే దేశప్రజలకు ఆమె ఆశీర్వాదాలు లభిస్తాయని పేర్కొన్నారు. ఇది ఆర్థికవ్యవస్థ వృద్ధి చెందటానికి దోహదపడుతుందని చెప్పారు. కష్టాలను దూరం చేసే దేవుడిగా పేరున్న వినాయకుడి ఫోటోతో ప్రజల సమస్యలు తీరుతాయన్నారు. ఇండోనేసియా లాంటి దేశంలోనూ కరెన్సీపై వినాయకుడి ఫోటోను ముద్రిస్తున్నట్లు కేజ్రీవాల్ గుర్తు చేశారు. అక్కడ 20వేల నోటుపై గణేషుడి ఫోటో ఉంటుంది. ఢిల్లీలో వర్చువల్‌గా మీడియా సమావేశం నిర్వహించిన కేజ్రీవాల్.. రోజురోజుకు పతనమవుతున్న రూపాయి విలువ గురించి మొదట ప్రస్తావించారు. ఆర్థికవ్యవస్థ బలంగా ఉండాలంటే స్కూళ్లు, హాస్పిటళ్లు నిర్మించాలని, మౌలికవసతులు మెరుగుపరచాలని సూచించారు. ఒక్కోసారి ప్రభుత్వం ఎన్నిచర్యలు తీసుకున్నా సత్ఫలితాలు రావని కేజ్రీవాల్ అన్నారు. దేశంలోని వ్యాపారస్తులంతా రోజూ తమ పని మొదలు పెట్టేముందు లక్ష్మీదేవికి, వినాయకుడికి పూజలు చేస్తారని పేర్కొన్నారు. అందుకే ఆ దేవుళ్ల ఫోటోలు కరెన్సీ నోట్లపై ముద్రిస్తే సత్ఫలితాలు వస్తాయని, ఆర్థికవ్యవస్థ మెరుగుపడేందుకు దోహదపడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ విషయంపై కేంద్రానికి గురువారం లేదా శుక్రవారం లేఖ రాస్తానని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. చదవండి: కాంగ్రెస్ నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన ఖర్గే.. -
Ganesh Laddu: రాత్రికి రాత్రే గణేష్ లడ్డూను మాయం చేసిన పిల్లలు
బంజారాహిల్స్: గణేశ్ మండపంలో లడ్డూ చోరీకి గురైన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్ రోడ్ నెం.70 జర్నలిస్టు కాలనీ సమీపంలోని అశ్విని లే అవుట్ పావనీ హోమ్స్‌లో ప్రతిష్టించిన వినాయకుడి విగ్రహం చేతిలో నిర్వాహకులు పది కిలోల లడ్డూ ఉంచారు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి ఫిలింనగర్‌లోని ఎమ్మార్సీ కాలనీకి చెందిన పిల్లలు లడ్డూను దొంగిలించి పరారయ్యారు. ఆదివారం ఉదయం లడ్డూ కనిపించకపోవడంతో మండపం నిర్వాహకులు సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించారు. అందులో అదే అపార్ట్మెంట్లో పని చేస్తున్న ఎమ్మార్సీ కాలనీకి చెందిన ఓ మహిళ కుమారుడు మరో ఇద్దరు పిల్లలతో కలిసి లడ్డూ తీసుకుని పరారైన దృశ్యాలు కనిపించాయి. ఎనిమిదేళ్ల వయసున్న ఆ బాలుడిని విచారించగా తన తల్లి చెప్పడంతోనే ఈ దొంగతనం చేసినట్లు తెలిపాడు. లడ్డూను స్వాధీనం చేసుకున్న నిర్వాహకులు చోరీకి పాల్పడిన ముగ్గురు పిల్లలను జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు. గణేశుడి చేతిలో ఉన్న లడ్డూని పది మందికి పంచితే దోషాలు తొలగిపోతాయని, డబ్బు కలిసి వస్తుందనే నమ్మకంతోనే మహిళ ఈ పని చేయించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై విచారణ చేస్తుండగానే అదే ప్రాంతంలో మరో గణనాథుడి మండపంలో లడ్డూ చోరీకి గురైందని పోలీసులకు ఫిర్యాదు అందింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత మూడు రోజులుగా లడ్డూ దొంగతనాలపై ఫిర్యాదులు అందుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. చదవండి: నిమజ్జనంలో అపశ్రుతి -
విదేశాల్లో వినాయకుడు.. గణేషునికి దేశదేశాల్లో ప్రత్యేక స్థానం
కరోనా మహమ్మారితో విలవిల్లాడిపోయి గత రెండేళ్లుగా గణేశుడి ఉత్సవాలకు దూరంగా ఉన్న ప్రజలు ఈ ఏడాది రెట్టించిన ఉత్సాహంతో పండుగ జరుపుకోవడానికి సిద్ధమవుతున్నారు. కోవిడ్–19 భయాలు అంతగా లేకపోవడం, కరోనా నిబంధనలు పాటించడంలో ప్రజలకి పూర్తిగా అవగాహన రావడంతో హరిద్వార్ నుంచి భువనేశ్వర్ వరకు పెద్ద ఎత్తున విఘ్నాధిపతిని కొలవడానికి ఏర్పాట్లు చేశారు. ఏనుగు తలతో పిల్లల్ని ఆకర్షించే రూపురేఖలతో గణపతి బప్పా కొలువై ఉండడం ఈ పండుగకి విదేశాల్లో కూడా ఎనలేని ప్రాముఖ్యత ఉంది. గణేశుడిపై అధ్యయనం చేసిన కాలిఫోర్నియా ప్రొఫెసర్ రాబర్ట్ ఎల్ బ్రౌన్ ఆగ్నేయాసియాలో 5, 6 శతాబ్దాల్లోనే గణేశుడి ప్రతిమలు శాసనాల్లో కనిపించాయని వెల్లడించారు. పలు ఆసియన్ దేశాల్లో బొజ్జ గణపయ్య ఆరాధన ఎప్పట్నుంచి ఉందో ఆ ప్రొఫెసర్ ఒక ఆరి్టకల్‌లో వివరించారు. భారత్‌లో 16వ శతాబ్దంలో ఛత్రపతి శివాజీ పాలనలో గణేశుడి ఉత్సవాలు ఘనంగా జరిగేవి. పుణెలో 18వ శతాబ్దంలో పెషావర్లు గణపతి ఆరాధనోత్సవాలు నిర్వహించారు. ఇక స్వాతంత్య్ర పోరాటం సమయంలో హిందువులందరినీ ఏకం చెయ్యడానికి లోకమాన్య బాలగంగాధర్ తిలక్ వినాయక చవితి ఊరేగింపుల్ని దేశవ్యాప్తం చేశారు. కాంబోడియా: 7వ శతాబ్దం నుంచే కాంబోడియా ప్రజలు గణేశుడ్ని ప్రథమ దేవుడిగా తొలి పూజలు అందిస్తున్నారు. ఆ దేశంలో ఉన్న ఆలయాలన్నీ వినాయకుడికే అంకితమిచ్చారు. భారత్‌లో గణేశ్ చతుర్థి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ముందే కాంబోడియాలో గణపతిని కొలడం విశేషం. ఈ దేశంలో గణేశ్ ప్రతిమలు ఎక్కువగా నిల్చొనే భంగిమలో మాత్రమే ప్రతిíÙ్ఠస్తారు. కొన్ని కూడళ్లలో కూడా భారీ సైజులో గణేశుడి విగ్రహాలు కనిపిస్తాయి. థాయ్‌లాండ్: థాయ్‌లాండ్‌లో 10వ శతాబ్దం నుంచే గణపతిని కొలుస్తారనడానికి ఆధారాలు కూడా ఉన్నాయి. తమిళం, థాయ్ భాషల్లో రాసిన శాసనాలపై కంచుతో తయారు చేసిన గణేశుడి ప్రతిమ ఫాంగ్ నా ప్రాంతంలో లభించింది. ఈ దేశంలో వ్యాపారస్తులు గణేశుడిని ఎక్కువగా పూజించి బంగారం, మిఠాయిలు సమర్పిస్తూ ఉంటారు. విజయ గణపతిగా కీర్తిస్తారు. సాంస్కృతిక నగరంగా పేరుగాంచిన చాకోఎంగ్సావో నగరం గణేశుడి నగరంగా ఖ్యాతి పొందింది. ఇక్కడ గణేశుడికి 3 ఆలయాలు ఉన్నాయి. బ్యాంకాక్‌లోని సెంట్రల్ వరల్డ్ ఎదురుగా గణేశుడి మండపం ప్రపంచ ప్రసిద్ధి చెందింది. థాయ్ ప్రభుత్వంలోని ఫైన్ ఆర్ట్స్ శాఖ చిహ్నంగా గణేశుడే ఉండడం విశేషం. చైనా: చైనాలో గణేశుడి పురాతన విగ్రహం తన్ హువాంగ్ ప్రాంతంలోని తవ్వకాలలో బయటపడింది. కుంగ్ హుస్సేన్ ప్రాంతంలోని గణేశుడి ఆలయం ఉన్నాయనడానికి 531 కాలం నాటి శాసనాల ద్వారా తెలుస్తోంది. అయితే ఇప్పుడు మాత్రం చైనాలో గణేశుడి ఒక నెగిటివ్ ఫోర్స్‌గా చూస్తారు. ఏదైనా పనికి అవరోధంగా నిలిచేవాడిగానే చిత్రీకరిస్తూ ఉంటారు. జపాన్: జపాన్‌లో 8వ శతాబ్దంలోనే గణేశుడిని పూజించినట్టు ఆధారాలున్నాయి. అత్యంత శక్తిమంతుడైన దేవుడిగా చూసేవారు. వ్యాపారులు, జూదగాళ్లు, కళాకారులు ఎక్కువగా గణేశుడిని ఆరాధించేవారు. బౌద్ధ ఆరామాలలో గణేశుడి విగ్రహాలు కూడా కొలువై ఉన్నాయి. అఫ్గానిస్తాన్: అఫ్గానిస్తాన్‌లోని కాబూల్‌కి సమీపంలో గార్జెడ్లో 7–8 శతాబ్దాల్లోనే గణేశుడి విగ్రహం లభ్యమైంది. ఇండో ఆఫ్గాన్ మధ్య సంబంధాలకు ప్రతీకగా ఈ గణేశుడు ఉండేవాడని పురావస్తు శాస్త్రవేత్తలు, చరిత్రకారులు చెప్పారు. టిబెట్: టిబెటన్ బుద్ధిజంలో కూడా గణేశుడి ఆరాధన ఉంది. 11వ శతాబ్దంలో తొలిసారిగా వినాయకుడిపై భారతీయ రచనలు ఎన్నింటినో టిబెటిక్ భాషలోకి అనువదించారు. టిబెట్ పురాణాల్లో కూడా గణేశుడి ప్రస్తావన ఉంది. లామాయిజం వ్యాప్తిలో గణేశుడ్ని కూడా వినియోగించుకున్నట్టు చరిత్రకారులు చెబుతున్నారు. చదవండి: గణేష్.. జోష్ -
వేలాది కాయిన్స్ తో వినాయక ప్రతిమ తయారీ
-
మనీ హేయిస్ట్ నటి ఇంట్లో లార్డ్ గణేశ్ ఫొటో.. సోషల్ మీడియాలో వైరల్
Money Heist Esthar Acebo Have Lord Ganesh Painting At Her House: కరోనా కారణంగా థియేటర్లు మూతపడటంతో సినీ ప్రేక్షకులు ఓటీటీల బాట పట్టారు. ఓటీటీల్లో వచ్చిన అనేక వెబ్ సిరీస్‌లు ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నాయి. అందులో ముందు వరుసలో ఉండే వెబ్ సిరీస్ మనీ హేయిస్ట్ (Money Heist). ఒరిజినల్‌గా ఇది స్పానిష్ లాంగ్వేజ్‌లో తెరకెక్కింది. నాన్-స్పానిష్ ఆడియెన్స్ కోసం ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో సిరీస్‌ను అందించారు. ప్రస్తుతం తెలుగులో కుడా అందుబాటులో ఉంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై ఈ థ్రిల్లర్ సిరీస్‌కు ప్రపంచం మొత్తం అడిక్ట్ అయిదంటే అతిశయోక్తి కాదు. అయితే ఇప్పుడు ఈ సిరీస్ గురించి ఎందుకంటా అంటే.. ఈ వెబ్ సిరీస్‌లోని ఒక నటి ఇంట్లో లార్డ్ గణేశుడి ఫొటో ఉండటం. అందుకే మనీ హేయిస్ట్ గురించి మరోసారి చెప్పుకోవాల్సి వచ్చింది. ఇదీ చదవండి: తనకు తానే పోటీ.. ఆస్కార్ బరిలో ఏకంగా 4 మార్వెల్ చిత్రాలు హిందూ దేవుళ్లను, సాంప్రదాయలను వివిధ దేశాల్లో నమ్మి పాటించేవారి సంఖ్య ఎక్కువే. హిందూ దేవుళ్లను పూజించే విదేశీ వారి గురించి ఎప్పుడో ఒకసారి వింటూనే ఉంటాం. ఇప్పుడు తాజాగా ఈ మనీ హేయిస్ట్ వెబ్ సిరీస్‌లో స్టాక్ హోమ్‌గా నటించిన ఎస్తర్ ఎసిబో (Esthar Acebo) ఇంట్లో వినాయకుడి పేయింటింగ్ ఉండటం చర్చనీయాంశమైంది. ఇటీవల ఎస్తర్ షేర్ చేసిన ఒక వీడియోలో గణేశుడి పేయింటింగ్ కనిపించింది. దీనిని స్క్రీన్ షాట్ తీసి పలువురు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌లు ఇంటర్నెట్ను హల్చల్ చేస్తున్నాయి. స్పానిష్ నటి ఎస్తర్ ఎసిబో ఇంట్లో హిందూ దేవుడి చిత్ర పటం ఉండటం గర్వకారణం అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. Proud moment for India ❤️ Spanish actress @EstherAcebo to international fame for her role as Mónica Gaztambide aka #Stockholm in the hit @netflix series #MoneyHeist. who is proudly displaying vedic pictures of lord #Ganesha at her home in one of her video pic.twitter.com/i3HAq92iri — 𝐓𝐇𝐄 𝐔𝐍𝐒𝐓𝐎𝐏𝐏𝐀𝐁𝐋𝐄 𝐖𝐈𝐍𝐆𝐒 (@the_wings_2002) January 5, 2022 ఇదీ చదవండి: అది ఇది కాదు.. ఎమ్మా వాట్సన్‌కు బదులు మరో హీరోయిన్ -
వైరల్: ఈ గణేశుడు డిఫరెంట్ గురూ!
ముంబై: కరోనా వల్ల పండగల రూపు రేఖలే మారిపోతున్నాయి. అసలే వినాయక చవితి పండగ దగ్గర్లో ఉంది. కానీ ఈ సారి గణేశుని పండగ ప్రతి ఏడాదిలా కాకుండా పూర్తి భిన్నంగా జరగనుంది. పెద్ద హడావుడి లేకుండా, జన సమూహాలను ఎక్కువ సేపు గుమిగూడనీయకుండా నిశ్శబ్ధంగా పూజా ప్రసాద కార్యక్రమాలు జరగనున్నాయి. అయితే విఘ్న నాయకుడు ప్రజల రక్షణ కోసం శానిటైజర్ ప్రసాదిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చిందో కళాకారునికి. అనుకున్నదే తడవుగా శానిటైజర్ వినాయకుడిని తయారు చేశాడు. ఈ విగ్రహం ముందుకు వెళ్లిన భక్తులు చేయి చాచగానే వారిపై శానిటైజర్ పడేలా రూపొందించాడు. ముంబైకి చెందిన కళాకారుడు నితిన్ రామ్‌దాస్ చౌదరి రూపొందించిన ఈ విగ్రహం అందరినీ ఆకట్టుకుంటోంది. (తుది మెరుగుల్లో ధన్వంతరి గణపతి) ప్రతి ఏడాది ఆయన భిన్న గణేశుని ప్రతిమలను రూపొందిస్తాడు. ఈ సారి కరోనా కాలం నడుస్తుండటంతో అందరి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని శానిటైజర్ డిస్పెన్సర్ ప్రతిమను తయారు చేశాడు. ఈ విగ్రహాలు తయారు చేయడానికి దేశం నలుమూలల నుంచి ముడిసరుకును తీసుకొస్తానంటున్నాడు. అలాగే ఈ శానిటైజర్ వినాయకుడి ప్రతిమలో లైట్లు కూడా పొందుపరిచానని తెలిపాడు. వీటిని రిమోట్ ద్వారా ఆపరేట్ చేయవచ్చని పేర్కొన్నాడు. "గణేశుడు మన సమస్యలను పటాపంచలు చేస్తాడని బలంగా విశ్వసిస్తాం. అందుకే ఆ దేవుని ఆయుధంగా శానిటైజర్‌ను ప్రతిమలో పొందుపరిచా. ఇది మన నుంచి వైరస్‌ను పారద్రోలుతుందనడానికి సూచిక" అని తెలిపాడు. (‘ముఖానికి మాస్కు లేదా.. అయితే ఈ యంత్రం పెట్టేస్తుంది’) -
హరిద్ర గణపతి
శ్వేతార్కమూల గణపతి మాదిరిగానే హరిద్ర గణపతి ఆరాధన కూడా చక్కని ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా జాతకంలో గురుగ్రహం బలహీనంగా ఉన్నవారు హరిద్ర గణపతిని ఆరాధించడం మంచిది. వ్రతాలు, పూజల్లో పసుపు ముద్దతో వినాయకుడిని రూపొందించి పూజించడం ఆనవాయితీ. పసుపుముద్దతో కాకుండా పసుపు కొమ్ముపైనే వినాయకుని ఆకారాన్ని పూజమందిరంలో ప్రతిష్ఠించి నిత్యం పూజించుకోవచ్చు. పసుపుకొమ్ముపై రూపొందించిన గణపతినే హరిద్ర గణపతి అంటారు. పసుపు కొమ్ముపై చెక్కించిన హరిద్ర గణపతిని పసుపు రంగు వస్త్రంపై ఉంచి పూజించాలి. ఏదైనా గురువారం రోజున హరిద్ర గణపతి పూజను ప్రారంభించవచ్చు. జీర్ణకోశ సంబంధమైన సమస్యలు సమసిపోవడానికి, వివాహ దోషాలు తొలగిపోవడానికి, పరీక్షలలో ఉత్తీర్ణతకు హరిద్ర గణపతి ఆరాధన ప్రశస్తమైనది. వ్యాపార సంస్థలు నడిపేవారు హరిద్రగణపతి మూర్తిని గల్లాపెట్టెలో ఉంచినట్లయితే, ఆటంకాలు తొలగి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. హరిద్ర గణపతికి నిత్యం ధూప దీప నైవేద్యాలు సమర్పించి, గణపతి మూల మంత్రాన్ని, గణేశ గాయత్రీ మంతాన్ని పదకొండు సార్లు చొప్పున పఠించాలి. పురోహితులకు శనగలు, పసుపు రంగు వస్త్రాలను ఇతోధిక దక్షిణతో కలిపి దానం చేయాలి. గురువులను తగిన కానుకలతో సత్కరించి, వారి ఆశీస్సులు పొందాలి. – పన్యాల జగన్నాథ దాసు -
మొదలైన ఖైరతాబాద్ గణేశుడి విగ్రహ ఏర్పాట్ల పనులు
-
వినాయకుడి విగ్రహం ధ్వంసం
కావలిరూరల్: వినాయకుడి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన మంగళవారం రాత్రి లక్ష్మీపురం గ్రామంలో జరిగింది. రూరల్ పోలీసులు, లక్షీపురం గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని లక్ష్మీపురం గ్రామం చివరన చెరువు కట్ట సమీపంలో వినాయకుడి విగ్రహం ఉంది. కొన్ని తరాలుగా అక్కడ ఉన్న విగ్రహానికి స్థానికులు పూజలు చేస్తున్నారు. బుధవారం ఉదయం అటుగా వెళ్లిన గ్రామస్తులకు విగ్రహం కనిపించలేదు. దీంతో పరిసరాల్లో వెతకగా చెరువులోని నీటిలో సగం విరిగిన విగ్రహం కనిపించింది. దీంతో ఊర్లో ఒక్కసారిగా అలజడి చెలరేగింది. పూజలు చేసి.. ఏకశిల విగ్రహమైన వినాయకుడి ప్రతిమను అపహరించి ధ్వంసం చేశారు. చాతి భాగం నుంచి కింది భాగం వరకు తీసుకెళ్లారు. మిగిలిన పైభాగం అక్కడ చెరువులోని నీటిలో పడవేశారు. వినాయక నిమర్జనం సమయంలో చేసే పూజలు ఇక్కడ చేశారు. పూలు, పండ్లు, నవధాన్యాలు నీటిలో వేసి ఉన్నారు. సమీపంలో పూజలకు ఉపయోగించిన నూనె, కర్పూరం అగ్గిపెట్టె ఉన్నాయి. దుండగులు చెరువు వద్ద మద్యం సేవించిన ఆనవాళ్లున్నాయి. ఈ ఘటనతో గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. ఊరికి అరిష్టం జరుగుతుందేమోనని ఆందోళన చెందుతున్నారు. గుప్తనిధి కోసమేనా? వినాయకుడి విగ్రహం బొజ్జలో బంగారం, వజ్రాలు ఉంటాయని ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని భావిస్తున్నారు. పొరుగునే ఉన్న పేపాలవారిపాలెంలో సుమారు 6 ఏళ్ల క్రితం ఇలాంటి ఘటనే జరిగింది. రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కాణిపాకం దేవస్థానంలో అపశ్రుతి
-
స్వచ్ఛ గణేష్ సాక్షిగా..
-
1.3 కోట్ల నోట్లతో గణనాథుడికి అలంకరణ
మంగళగిరి(గుంటూరు): కోటి ముప్పై లక్షల నోట్లతో గణనాథుడికి అలంకరణ చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం ఈ అలంకరణ చేశారు. రూ. 10 నుంచి రూ.1000, 500 నోట్ల వరకు అన్ని రకాల నోట్లు ఉపయోగించి గణేశుడిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. దీంతో నోట్లతో అలంకరించిన స్వామివారిని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. -
ఈ వారం మేటి చిత్రాలు (14.12.14)
-
కొలువు తీరిన గణనాథులు
-
బహురూపాయా.. గణేషా..!!
-
ఇది వినాయకుడి లీలేనా ?!
-
వినాయకచవితి స్పెషల్ సిల్లీబ్రాండ్
-
గణాధిప నమస్తేస్తు...
గణేశుని ప్రతిమ నుంచి పత్రిని సేకరించి పూజించడం వరకూ... వినాయకచవితి ప్రతి అంశంలోనూ భక్తి మాత్రమే కాదు, విజ్ఞానమూ ఉంది. ప్రకృతి స్పృహ ఉంది. అందుకే ఇది పిల్లలకు పాఠాలు చెప్పే పండుగ. కంప్యూటర్ ఓపెన్ చేసి, మౌస్తో క్లిక్ చేస్తే చాలు మనం కావాలనుకున్న చోటికి వెళ్లిపోతాం. ప్రపంచమంతా మౌస్ మీద నడుస్తోంది. నేడే కాదు పురాణకాలంలో కూడా మౌస్ (ఎలుక) దే ఆధిపత్యం. వినాయకుని వాహనం అయిన మౌస్ (ఎలుక) ఎక్కడికి కావాలంటే అక్కడకు అయనను తీసుకువెళ్లేది. కంప్యూటర్ మౌస్ పిల్లలకు ఎంత అవసరమో, మౌస్ వాహనంగా ఉన్న వినాయకుడి ముందు భక్తి శ్రద్ధలతోఉండడం అంతే అవసరం. సర్వవిఘ్నాలను విఘ్నేశ్వరుడు తొలగిస్తాడు. అందుకే వినాయకచవితి పెద్దలకే కాక పిల్లల పండుగ కూడా అయింది. తుండమునేకదంతము దోరపు బొజ్జయు వామహస్తమున్ మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపులు మందహాసమున్ కొండొక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయై యుండెడిపార్వతీ తనయ యోయి గణాధిపా నీకు మ్రొక్కెదన్... అంటూ పిల్లల చేత గణనాయకునికి ప్రార్థనలు చేయిస్తారు. ఆరంభించిన కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగాలని ముందుగా గణనాయకుడిని ప్రార్థించండం మన సంప్రదాయం. పిల్లలు అత్యుత్సాహంతో జరుపుకునే పండుగ వినాయకచవితి. పండుగనాడు ఉదయాన్నే నిద్రలేచి కాలకృత్యాదులు తీర్చుకుని, వినాయకుడిని ఎంతో అందంగా అలంకరిస్తారు. విగ్రహాన్ని రకరకాలుగా తయారుచేసుకుంటారు. కంప్యూటర్ ముందు కూర్చున్న వినాయకుడు, రకరకాల కూరగాయలతో వినాయకుడు, ఆకులతో, పండ్లతో, డ్రైఫ్రూట్స్‌తో... ఎవరికి తోచిన ఆకృతిలో వారు ఆ గణనాయకుని పూజిస్తారు.ప్రతిమను ఉంచే గదిని సైతం తీర్చిదిద్దుతారు. గణేశ్ బర్త్‌డే అంటే పిల్లలకి అంత క్రేజ్ మరి. నేపాల్, చైనా, జపాన్, జావా దేశాలలో, ఇంకా జైన బౌద్ధులు సైతం వినాయకుడిని కొలుస్తారు. పుస్తక పూజ... విద్యార్థులు తమ పుస్తకాలన్నిటినీ వినాయకుడి దగ్గర ఉంచుతారు. వాటి మీద పసుపుతో స్వస్తిక్ గుర్తును రాసి పూజ చేస్తారు. ఇలా చేయడం వల్ల చదువు బాగా వస్తుందని పెద్దల నమ్మకం. అయితే ఏదో మొక్కుబడిగా కాకుండా, పండుగలోని సామాజికస్పృహను, అంతరార్థాన్ని పెద్దలు పిల్లలకు వివరించి చెప్పాలి. పూజలోని ఆంతర్యం... విద్యార్థులకు చదువులో ఎన్నో ఆటంకాలు కలుగుతుంటాయి. వాటిని అధిగమించడానకి వినాయకుని తలను పూజించాలి. మెదడు ఎంత చురుకుగా పనిచేస్తే విద్య అంత చక్కగా ఒంటపడుతుంది. అందుకే తలను పూజించాలని చెబుతారు. చిన్న చిన్న విషయాలను జాగ్రత్తగా వింటూ అర్థం చేసుకునే శక్తి కోసం ఆయనకున్న చిన్న కళ్లను పూజించాలి. దేనినైనా సూక్ష్మంగా చూడవలసి వచ్చినప్పుడు క ళ్లను చిన్నవిగా చేస్తాం. అందుకే గణనాథుని కళ్లు చింతాకులంత చిన్నవిగా ఉంటాయి. అన్ని విషయాలను ఏకాగ్రతతో వినడానికి వినాయకునికున్న చేటంత చెవులను పూజించాలి. అందుకే ఎవరైనా ఏదైనా విషయం చెప్పేటప్పుడు, ‘చెవుల్ని చేటల్లా చేసుకుని విను’ అనే మాట వాడుకలోకి వచ్చింది. పిల్లలు ఎప్పుడూ తమను తాము కించపరచుకోకుండా ఉండే లక్షణం కోసం ఆత్మగౌరవ చిహ్నమైన తుండాన్ని పూజించాలి. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది కనుక ఆ లక్షణాన్ని వినాయకుని ద్వారా తెలుసుకోవడానికి నోటిని పూజించాలి. వినాయకుడి నోరు తొండం కింద దాగి ఉంటుంది. అంటే నోటిని అదుపులో ఉంచుకోమని చెప్పడమేనని అర్థం చేసుకోవాలి. చదువుకునేటప్పుడు, ‘నేర్చుకున్నది చాలులే’ అని తృప్తి చెందక మరింత జ్ఞానాన్ని సంపాదించడానికి ఆయన బొజ్జను అర్చించాలి. ధర్మార్థ కామ మోక్షాలను సాధించడానికి ఆయనకున్న నాలుగు చేతులను పూజించాలి. ఆటంకాలు కలిగినప్పుడు కుంగిపోకుండా, మనోబలం చేకూరాలంటే విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుని ధ్యానించాలి. వాహనం... అన్నిటి కంటె విచిత్రమైన విషయం వినాయకుడి వాహనం అయిన ఎలుక. మిగతా దేవ తల వాహనాలతో పోలిస్తే అతి సామాన్యమైన వాహనం. అనవసరమైన కోర్కెలను అదుపులో ఉంచుకోవడం అలవర్చుకోవడం కోసం ఆ ఎలుకను తప్పనిసరిగా ప్రార్థించాలి. తలచితి నే గణనాథుని తలచితి నే విఘ్నపతిని దలచిన పనిగా దలచితినే హేరంబుని తలచిన నా విఘ్నములను తొలగుట కొరుకన్. సామాన్య జీవనానికి అధిపతి విఘ్నేశ్వరుడు విఘ్నాధిపత్యం కోసం ముల్లోకాలలోని నదులలో స్నానం చేసి ముందుగా ఎవరు వస్తారో వారిని గణాధ్యక్షుని చేస్తానని పరమేశ్వరుడు కుమారస్వామి, వినాయకుల మధ్య పోటీ పెట్టాడు. కుమారస్వామి నెమలి వాహనం మీద వేగంగా వెళ్లిపోయాడు. వినాయకుడిది ఎలుక వాహనం. దానికి తోడు కదలలేని శరీరం. ఏం చేయాలో తోచలేదు. తల్లిదండ్రులను మించిన దైవం లేదని తెలుసుకుని, రెండు చేతులూ జోడించి తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేయడం ప్రారంభించాడు. కుమారస్వామి ఏ నదిలో స్నానం చేసినా తన కంటె ముందుగా స్నానం చేసి వస్తున్న వినాయకుడిని చూసి, విషయం తెలుసుకుని సిగ్గుపడ్డాడు. వినాయకుడు తల్లి ఆజ్ఞను శిరసావహించాడు. గణాధ్యక్షుడయ్యాడు. కుమారస్వామికి శక్తి ఉన్నప్పటికీ అహంకారం కారణంగా గణాధ్యక్ష పదవి కోల్పోయాడు. తల్లిదండ్రులను మించిన దైవం లేదని తెలుసుకున్నాడు. పెద్దల సన్నిధిలో ఉండటం వల్ల ప్రపంచంలో సాధించలేనిదంటూ లేదని ఈ కథ చెబుతోంది. అందుకే పిల్లలు తల్లిదండ్రులను దేవుడిగా భావించాలని ఈ కథ వివరిస్తోంది. సామాన్య గణపతితో జాగ్రఫీ, ఆరోగ్యం... వినాయకుడు భూతత్వాన్ని బోధిస్తాడు. పండగ దగ్గర పడుతోందంటే పిల్లలు చెరువుగట్లకు, కాలవ గట్లకు వెళ్లి మట్టి సేకరించి వాటితో వినాయకప్రతిమ తయారుచేస్తారు. దీని ద్వారా మట్టిని గురించి తెలుసుకుంటారు. అంతేకాక ఈ పండుగనాడు ప్రసాదాలు ఘాటుగా, వికారాన్ని కలిగించేవిగా కాక ఆరోగ్యకరమైనవి తయారుచేస్తారు. కేవలం ఆవిరి మీద ఉడకబెట్టిన వాటినే ప్రసాదంగా స్వీకరిస్తాడు వినాయకుడు. అదే సాత్విక మైన ఆహారం. జీర్ణక్రియను పాడుచేయదు. అలా పిల్లలకు ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తాడు లంబోదరుడు. అటుకులు కొబ్బరి పలుకులు చిటిబెల్లము నానుబ్రాలు చెఱకురసంబున్ నిటలాక్షునగ్రసుతునకు పటుతరముగ విందు చేతు ప్రార్థింతు మదిన్. పెద్దలను గౌరవించాలి సందర్భం లేకుండా ఇతరులను చూసి నవ్వితే అపనిందలపాలవుతారని చంద్రుడి కథ, పరుల సంపదలకు ఆశపడకూడదని శ్యమంతకమణి కథ, తెల్లని వస్త్రాలు, పరిశుభ్రత, ప్రశాంతత వంటి అంశాలు వినాయకుని వేషధారణ తెలియచేస్తాయి. చిరునవ్వులు చిందించే ప్రశాంత వదనంతో ప్రారంభించిన పని నిర్విఘ్నంగా కొనసాగుతుందని గణేశుని ద్వారా తెలుస్తుంది. వినాయకుడే ఒక చదువు. ఆయన పూజకు చేసే ప్రతిపనిలో విద్య ఉంది. చదువుకునే పిల్లలు వినాయకుని పూజించి, ఆయనను ఆదర్శంగా తీసుకుని ఆయనంత గొప్పవారు కావాలి. అవిఘ్నమస్తు... గణాధిప నమస్తేస్తు ఉమాపుత్ర అఘనాశక వినాయక ఈశ తనయ సర్వసిద్ధి ప్రదాయక ॥ జ్ఞానాకృతి వినాయకుడి ఆకారం... ఏనుగుతల, పెద్ద బొజ్జ, పొట్టి రూపం. ఆ శరీరం పిల్లలకి సందేశం ఇస్తుంది. ఒక్కో భాగం ఒక్కో అంశానికి ప్రతీక. ఆటంకాలను తొలగించే తల, చిన్న విషయాలను కూడా గ్రహించగల శక్తి కలిగిన చిన్న కళ్లు, అన్ని విషయాలనూ శ్రద్ధగా వినే పెద్ద చెవులు, ఆత్మగౌరవం కలగడానికి చిహ్నంగా తుండం, తక్కువగా మాట్లాడమని సూచించే నోరు, అమితమైన జ్ఞానాన్ని సంపాదించుకోమని చెప్పే పెద్ద బొజ్జ, ధర్మం, అర్థం, కామం, మోక్షం సాధించడానికి నాలుగు చేతులు, కోరికలను అదుపులో పెట్టుకోవడానికి ప్రతీకగా ఎలుక వాహనం శుభసూచకం స్వస్తిక్ అంటే శుభాన్ని కలిగించేది. అందుకే పిల్లలు చదువుబాగా రావాలనే ఉద్దేశ్యంతో వారి పుస్తకాల మీద మొదటి పేజీలో పసుపుతో ఈ చిహ్నం రాసి దేవుని ముందుంచి పూజ చేస్తారు. యంత్రశాస్త్రంలో స్వస్తిక్ గణపతి ఆధిపత్యాన్ని చూపిస్తుంది. పని నిర్విఘ్నంగా పరిసమాప్తం కావడానికి ఈ చిహ్నం వేస్తారు. విశేష సమయాల్లో స్వస్తిక్ చిహ్నం గీయటం వల్ల ఆయా కార్యాలు శుభప్రదంగా విజయవంతం అవుతాయనే విశ్వాసం ఉంది. గణేశునికి ప్రతీక అయిన చిహ్నం కనుక దీనిని శుభప్రదంగా భావిస్తారు. పత్రిలో బోటనీ పాఠం ఓషధీ గుణాలు కలిగిన ఆకులతో వినాయకుడిని పూజిస్తారు. శాస్త్రం చెప్పిన 21 రకాల పత్రులను పూర్వం పిల్లలే స్వయంగా గుర్తించి, తుంపి తెచ్చేవారు. వీటి ద్వారా జీవశాస్త్రం (బోటనీ) నేర్చుకోవడమే కాక పిల్లలకి ప్రకృతితో సంబంధం ఏర్పడుతుంది. ముఖ్యంగా భాద్రపదమాసంలో ఓషధులు అప్పుడే భూమిలోంచి బయటకు వచ్చి సజీవంగా ఉంటాయి. 21 రకాల పత్రులతోనూ వ్యాధిని నిర్మూలించే లక్షణం ఉంది. వానల వల్ల ఏర్పడిన తడి కారణంగా వచ్చే వ్యాధులన్నీ ఈ పత్రిలోని గరికతో నిర్మూలనమవుతాయి. లంబోదరుడు - నిరాడంబరుడు గణనాయకుడయినప్పటికీ సామాన్య జీవితాన్నే ఇష్టపడ్డాడు గణనాథుడు. సామాన్య జీవన విధానాన్ని అలవరచుకోవడానికి ఆయనను పూజించాలి. చిన్నతనంలో పిల్లలకి ఏది అవసరమో, ఏది అనవసరమో తెలియదు. చూసిన ప్రతిదీ కావాలనిపిస్తుంది. వినాయకుడిని ఆదర్శమూర్తిగా పిల్లలకు చూపించాలి. ఆయన జీవితాన్ని అర్థం చేసుకుని పిల్లలు చిన్నప్పటి నుంచే నిరాడంబర జీవితాన్ని గడపడానికి అలవాటు పడతారు. వినాయకతత్త్వం దేశభక్తి, సంస్కృతి పట్ల ప్రేమ, భక్తి, మన చుట్టూ ఇన్ని విలువైన వస్తువులున్నాయని తెలియచేస్తుంది. తద్వారా మన నేల గొప్పదనం, ఆత్మీయత, నిరాడంబర జీవితం గడపడం పిల్లలు తెలుసుకోగలుగుతారు. -డా.పురాణపండ వైజయంతి -
కార్టూన్
నాయనా వినాయకా.. నవరాత్రులు పూర్తయ్యేవరకూ నీ చేతిలో ఆ ఆయుధం మాత్రం వదలకు!!