
పూజ ప్రాముఖ్యత
వినాయకుడు విఘ్నాలను తొలగించే దేవుడు. అందుకే ఏ శుభకార్యం మొదలుపెట్టే ముందు ‘వక్రతుండ మహాకాయ‘ మంత్రంతో ఆయనను ప్రార్థించడం ఆచారం.మొదట గణపతి పూజ చేయడం ద్వారా అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. జ్ఞానం, బుద్ధి, ధైర్యం ప్రసాదిస్తాడు. భక్తుని మనసులో ఆత్మవిశ్వాసాన్ని నింపుతాడని విశ్వాసంవినాయకచవితి పండుగ వచ్చిందంటే ఉదయాన్నే మేల్కొని, అభ్యంగన స్నానమాచరించి, పూజా ఏర్పాట్లు మొదలుపెడతాం. ఇంటిని శుభ్రపరచుకొని, అరటిబోదెలతో, పుష్పాలతో మంటపాన్ని అలంకరించి, పైన పాలవెల్లి వ్రేలాడదీసి మండపంలో స్వస్తిక్ పద్మాన్ని లిఖించి, హరిద్రా గణపతిని, మట్టి వినాయకుని స్థాపించి, దీపారాధన గావించి స్వామిని ఆహ్వానిస్తాం. సేకరించిన పత్రి, గరిక (దుర్వాయుగ్మాలు)లతో, అర్కపూలతో, షోడశోపచారాలతో పూజించి, యథాశక్తితో ఉండ్రాళ్లు, చలిమిడి, వడపప్పు తదితర ప్రసాదాలు నివేదించి వినాయక కథ, శమంతకోపాఖ్యానము చదువుకొని లేదా విని అక్షింతలు కొన్ని స్వామి పాదాలవద్ద వుంచి, తమ శిరస్సుపై ధరించాలి.

శ్రీ విఘ్నేశ్వరుని పూజకు ముందుగా సమకూర్చుకోవలసినవి
పూజాద్రవ్యాలు : వినాయక ప్రతిమ, పత్రి, పసుపు, కుంకుమ, అగరువత్తులు, హారతి కర్పూరం, గంధం, సాంబ్రాణి, అక్షతలు, బియ్యం, ఆవునెయ్యి లేదా నువ్వులనూనె, పంచామృతాలు (ఆవుపాలు, పెరుగు, నేయి, తేనె, పంచదార), తమలపాకులు, పోకచెక్కలు, పువ్వులు, పూమాల, పళ్ళు, కొబ్బరి కాయలు, కలశం, నైవేద్య పదార్థములు, సుగంధ ద్రవ్యములు.
పూజావస్తువులు : దీపం కుందులు, వత్తులు, అగ్గిపెట్టె, వస్త్రం, యజ్ఞోపవీతం, పంచపాత్ర, ఉద్ధరిణి, కలశంమీద నూతన వస్త్రం, పూజాస్థలంలో పీఠంపై వేయడానికి తగిన పరిమాణంలో తెల్లని వస్త్రం/ తువ్వాలు, పళ్ళెం, పాలవెల్లి, నూలు వస్త్రాలు, మామిడి తోరణాలు, దేవునికి తగిన పీఠం.

నైవేద్యం : ఉండ్రాళ్లు–21, కుడుములు, వడపప్పు, పానకం, అటుకులు, కొబ్బరి ముక్కలు, బెల్లం, అరటిపళ్ళు, దోసపండు, పిండివంటలు మొదలగునవి.
పూజాపత్రి : గరిక, మాచిపత్రి, బలురక్కసి లేక ములక, మారేడు, ఉమ్మెత్త, రేగు, ఉత్తరేణి, తులసి, మామిడి, గన్నేరు, విష్ణుక్రాంతం, దానిమ్మ, దేవదారు, మరువం, వావిలాకు, జాజి, దేవకాంచనం, జమ్మి, రావి, తెల్లమద్ది, జిల్లేడు మొదలగునవి తమకు లభ్యమగు పత్రిని
సంపాదించి ఆయా మంత్రాలతో స్వామి వారిని భక్తి శ్రద్ధలతో పూజించాలి. ఒకవేళ పత్రిలో లోపం కలిగినా భక్తిలో మాత్రం లోపం ఉండరాదు. పత్రి సకాలంలో లభ్యంకానిచో పువ్వులు, అక్షింతలతో పూజించి నమస్కరించాలి.

పాలవెల్లి పూజ : శ్రీ విఘ్నేశ్వరస్వామి వారి పీఠానికి పైభాగాన పాలవెల్లిని కట్టాలి, పాలవెల్లిని పసుపు కుంకుమలతోను, పూజాపత్రితో తోచినవిధంగా శోభాయమానంగా అలంకరించు కోవచ్చు. దీనినే మనం సాధారణంగా పాలవెల్లి పూజ అంటాము.
పూజా మందిరంలో : విఘ్నేశ్వరస్వామి పూజకు ఉపక్రమించే ముందు ఇంటిలో చదువుకునే పిల్లలు ఉన్నట్లయితే స్వామి ప్రతిమతోపాటు సరస్వతీదేవి పటం, వారి పాఠ్యపుస్తకాలు, పెన్ను, పెన్సిల్. అలాగే గృహస్థు(యజమాని) వ్యాపారి అయితే శ్రీలక్ష్మీ అమ్మవారి పటం, వ్యాపార లెక్కల పుస్తకాలు, సంబంధిత వస్తువులు ఇలా ఇతర వృత్తులలో వున్నవారు వారి ప్రధానమైన వస్తువులతోపాటుగా వారి ఇష్టదైవం పటాన్ని పెట్టి పూజించడం శుభఫలదాయకం.
గణేశుని పూజ పూజకు ఏర్పాట్లు
ముందుగా పీట మీద ముగ్గువేసి, బియ్యంపోసి, దానిమీద శ్రీ విఘ్నేశ్వరస్వామి వారి ప్రతిమను ఉంచి పైభాగాన పసుపుకుంకుమలతో అలంకరించిన పాలవెల్లిని కట్టాలి. పసుపు వినాయకుణ్ణి చేయాలి. పూజ చేసేవాళ్ళు బొట్టు పెట్టుకుని దీపారాధనచేసి వినాయకునికి నమస్కరించి పూజ ప్రారంభించాలి. ముందుగా పసుపుతో చేసిన గణపతిని పూజించాలి.
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః
దీపారాధన : (ఈ క్రింది శ్లోకాన్ని చదువుతూ దీపాన్ని వెలిగించి, దీపం
కుందివద్ద అక్షతలు ఉంచి నమస్కరించాలి.)
శ్లో‘‘ భోదీపదేవి రూపస్త్యం, కర్మసాక్షి హ్యామిఘ్నకృత్‘
యావత్పూజాం కరిష్యామి తావత్వం సిద్ధిదో భవ ‘‘
దీపారాధన ముహూర్తస్తు సుముహూర్తోస్తు‘‘
పరిశుద్ధి : (పంచపాత్రలోని నీటిని ఉద్ధరిణతో తీసుకుని కుడిచేతి బొటనవేలు, మధ్య ఉంగరపు వేళ్ళతో నీటిని ఈ క్రింది మంత్రం చెబుతూ తలపై చల్లుకోవాలి)
అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా!
యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతరశ్శుచిః
పుండరీకాక్ష, పుండరీకాక్ష, పుండరీకాక్షాయ నమః
శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు శ్రీ గణేశాయ నమః
శ్లో‘‘ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వ విఘø్నపశాన్తయే ‘‘
అగజానన పద్మార్కం గజానన మహర్నిశం
అనేక దన్తం భక్తానాం యేకదన్త ముపాస్మహే ‘‘
శ్రీ గణేశ షోడశ నామ ప్రతిపాదక శ్లోకాః
శ్లో‘‘ సుముఖశ్చైకదన్తశ్చ కపిలో గజకర్ణకః
లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః
ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః
వక్రతుండః శూర్పకర్ణో హేరమ్బస్కన్దపూర్వజః
షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపిః
విద్యారమ్భే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా,
సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తన్య నజాయతే ‘‘
ఆచమనం
ఓం కేశవాయ స్వాహా
నారాయణాయ స్వాహా
మాధవాయ స్వాహా
(అని 3 సార్లు తీర్థం పుచ్చుకోవాలి) తరువాత చేయి కడుక్కోవాలి.
గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః
త్రివిక్రమాయ నమః వామనాయ నమః
శ్రీధరాయ నమః హృషీకేశాయ నమః
పద్మనాభాయ నమః దామోదరాయ నమః
సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః
ప్రద్యుమ్నాయ నమః అనిరుద్ధాయ నమః
పురుషోత్తమాయ నమః అధోక్షజాయ నమః
నారసింహాయ నమః అచ్యుతాయ నమః
జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః
హరయే నమః శ్రీ కృష్ణాయ నమః
(రెండు అక్షింతలు వాసన చూసి వెనుకకు వేయవలెను)
శ్లో‘‘ ఉత్తిష్ఠంతు భూత పిశాచాః! యేతే భూమి భారకాః
ఏతేషామవిరోధేన! బ్రహ్మకర్మ సమారభే!
(ముక్కుపట్టుకుని ఎడమవైపు నుండి గాలిపీల్చి క్రింది మంత్రం చదివిన తరువాత ముక్కు కుడివైపు నుండి గాలి వదలవలెను.)
ప్రాణాయామము
ఓం భూః ఓం భువః ఓగ్‌ం సువః ఓం మహః ఓం జనః
ఓం తపః ఓగ్‌ం సత్యం ఓం తత్సవితుర్వ రేణ్యం భర్గోదేవస్య
ధీమహి ధియోయోనః ప్రచోదయాత్‘‘ ఓమాపో జ్యోతీ
రసోమృతం బ్రహ్మభూర్భువస్సువరోమ్‘‘
సంకల్పం : మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభన ముహూర్తే
శ్రీ మహావిష్ణోరాజ్ఞేయా ప్రవర్తమానస్య ఆద్యబ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే
జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే, ్జకృష్ణా – గోదావరి నదీ మధ్య ప్రదేశే స్వగృహే (సొంత ఇల్లుకానివారు మమ వసతిగృహే అని చెప్పుకోవాలి) సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక స్వస్తిశ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వావసు నామ సంవత్సరే, దక్షిణాయనే, వర్ష బుుతౌ, భాద్రపద మాసే, శుక్లపక్షే, చతుర్థి తిథౌ, ఋధవాసరే, శుభనక్షత్రే, శుభయోగే, శుభకరణ, ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ, శ్రీమాన్ శ్రీమతః గోత్రః................. (మీ గోత్రం చెప్పవలెను) నామధేయః ................................ (ఇంటిపెద్ద / యజమాని తన పేరు చెప్పుకోవలెను) ధర్మపత్నీ సమేతస్య మమ సపుత్రకస్య, సపుత్రికస్య సహ కుటుంబానాం క్షేమ, స్థైర్య, ధైర్య, వీర్య, విజయ, అభయ, ఆయురారోగ్య, ఉద్యోగ, వ్యాపార, ఐశ్వర్యాభివృద్ధ్యర్థం, ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం, సకల ధనకనక, విద్యా ప్రాప్త్యర్థం, వస్తువాహన సమృద్ధ్యర్థం, పుత్రపౌత్రాభివృద్ధ్యర్థం, సర్వాభీష్ట ఫల సిద్ధ్యర్థం శ్రీ వరసిద్ధివినాయక దేవతా ముద్దిశ్య శ్రీ వరసిద్ధివినాయక దేవతా ప్రీత్యర్థం కల్పోక్త ప్రకారేణ యావచ్ఛక్తి ధ్యాన ఆవాహనాది
షోడశోపచార పూజాం కరిష్యే‘‘
(కుడిచేతి ఉంగరపు వేలిని నీటిలో తాకవలెను)
తదంగ కలశపూజాం కరిష్యేః
(మరలా కుడిచేతి ఉంగరపు వేలిని నీటిలో తాకవలెను)
కలశపూజ : (కలశాన్ని గంధం, పుష్పాలు, అక్షతలతో పూజించి కలశంపై కుడిచేతిని ఉంచి, కింది శ్లోకం చెప్పుకొనవలెను)
శ్లో‘‘ కలశస్య ముఖే విష్ణుః కంఠేరుద్ర సమాశ్రితః
మూలేతత్రస్థితో బ్రహ్మా మధ్యే మాతృగణా స్మృతాః
కుక్షౌతు సాగరాః సర్వేసప్తద్వీపా వసుంధరా!
ఋగ్వేదోధయజుర్వేదస్సామవేదో హ్యధర్వణః
అంగైశ్చసహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః
గంగేచ యమునేచైవ కృష్ణా గోదావరి సరస్వతి!
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు ‘‘
అయాంతు శ్రీ గణపతి పూజార్థం దురితక్షయ కారకాః
కలశోదకేన పూజా ద్రవ్యాణిచ సంప్రోక్ష్యః దేవమాత్మానాంచ సంప్రోక్ష్యః
(పసుపుతో చేసిన గణపతిని తమలపాకుపై ఉంచి కుంకుమతో బొట్టు పెట్టవలెను. పసుపు విఘ్నేశ్వరుని కింది విధంగా పూజించాలి)
శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి (నమస్కరించవలెను)
గణానాంత్వా గణపతిగ్‌ం హవామహే కవిం కవీనాం
ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణాస్పత
ఆనఃశృణ్వన్నూతిభిస్సీదసాధనం
ఆవాహయామి ఆవాహనం సమర్పయామి (నీటిని చల్లవలెను)
పాదయోః పాద్యం సమర్పయామి (మరల నీటిని చల్లవలెను)
హస్తయోః అర్ఘ్యం సమర్పయామి (మరల నీటిని చల్లవలెను)
ముఖే ఆచమనీయం సమర్పయామి (మరల నీటిని చల్లవలెను)
ఔపచారిక స్నానం సమర్పయామి (నీటిని చల్లవలెను)
స్నానానంతర ఆచమనీయం సమర్పయామి (నీటిని చల్లవలెను)
వస్త్రం సమర్పయామి (పత్తితో చేసిన వస్త్రం లేదా పుష్పం ఉంచాలి)
గంధాన్ ధారయామి (గంధమును చల్లవలెను)
కుంకుమం సమర్పయామి
గంధస్యోపరి అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి
(అక్షతలు చల్లవలెను)
పుష్పాని సమర్పయామి (పూలతో స్వామివారిని అలంకరించవలెను)
స్వామికి పుష్పాలతో పూజ
(ఈ క్రింది నామాలు చదువుతూ పుష్పాలతో పూజ చేయవలెను)
ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః
ఓం కపిలాయ నమః ఓం గజకర్ణికాయ నమః
ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః
ఓం విఘ్నరాజాయ నమః ఓం గణాధిపాయనమః
ఓం ధూమకేతవే నమః ఓం గణాధ్యక్షాయ నమః
ఓం ఫాలచంద్రాయ నమః ఓం గజాననాయ నమః
ఓం వక్రతుండాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః
ఓం హేరంబాయ నమః ఓం స్కంద పూర్వజాయ నమః
ఓం మహాగణాధిపతయే నమః
నానావిధ పరిమళ పత్రపుష్పాణి సమర్పయామి
(పుష్పాలతోను, పత్రితోనూ పూజించవలెను)
ధూపం ఆఘ్రాపయామి (అగరువత్తిని వెలిగించవలెను)
దీపం దర్శయామి (దీపమును చూపవలెను)
నైవేద్యం సమర్పయామి (బెల్లం ముక్కను నైవేద్యం పెట్టాలి)
ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహిః ధియోయోనః ప్రచోదయాత్‘‘ సత్యం త్వర్తేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి (అని చెప్పి నైవేద్యముపై చుట్టూ నీటిని తిప్పి నైవేద్యంపై నీటిని అభికరించి ఎడమచేతితో కుడిచేతిని పట్టుకొని, కుడిచేతితో నైవేద్యాన్ని గణాధిపతికి చూపిస్తూ ఈ కింది మంత్రాలు చెప్పుకోవలెను).
ఓం ప్రాణాయ స్వాహా, ఓం అపానాయ స్వాహా,
ఓం వ్యానాయ స్వాహా, ఓం ఉదానాయ స్వాహా,
ఓం సమానాయ స్వాహా
శ్రీ మహాగణాధిపతయే నమః యథాభాగం
గుడం నివేదయామి (బెల్లం ముక్కను నివేదించాలి)
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి (నీటిని చల్లవలెను)
హస్తప్రోక్షయామి, పాదౌ ప్రోక్షయామి, ముఖే ఆచమనీయ సమర్పయామి (4సార్లు నీళ్ళు చూపించి వదలాలి)
తాంబూలం సమర్పయామి (తాంబూలం ఉంచవలెను)
ఆచమనీయం సమర్పయామి (నీటిని చల్లవలెను)
ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి (కర్పూరమును వెలిగించాలి)
శ్లో‘‘ వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభ ‘
అవిఘ్నంకురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా ‘‘
శ్రీ మహాగణాధిపతయే నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి.
గణాధిపతిః సుప్రీతః సుప్రసన్నో వరదో భవతు. మమ ఇష్టకామ్యార్థ çఫలసిద్ధ్యర్థం గణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి
(గణపతికి పూజచేసిన అక్షతలు కొన్ని తీసుకొని శిరస్సున ఉంచుకొనవలెను.)
శ్రీ మహాగణాధిపతిం యథాస్థానం ప్రవేశయామి
(పసుపు గణపతిని తూర్పునకు కొద్దిగా జరిపి మరల యథాస్థానంలో పెట్టాలి)
స్వామిన్, సర్వజగన్నాథ యావత్పూజావసానగా ః
తావత్త్వం ప్రీతిభావేన బింబేస్మిన్ సన్నిధింకురు
ధ్యానం : స్వామి వారి రూపాన్ని ఊహించుట (పువ్వులు, అక్షతలు చేతితో పట్టుకుని గణపతికి నమస్కరిస్తూ ఈ క్రింది ప్రార్థన చేసిన తరువాత ఆయన పాదాల వద్ద ఉంచాలి)
ఓం భవసంచిత పాపౌçఘ విధ్వంసన విచక్షణం‘‘
విఘ్నాంధ కారభాస్వంతం విఘ్నరాజ మహం భజే‘‘
ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం‘‘
పాశాంకుశధరం దేవం ధ్యాయేత్సిద్ధి వినాయకమ్‘‘
ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం ‘‘
భక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్తం విఘ్న నాయకమ్ ‘‘
ద్యాయేద్గజాననం దేవం తప్తకాంచన సన్నిభం‘‘
చతుర్భుజం మహాకాయం సర్వాభరణ భూషితం ‘‘
శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధివినాయక స్వామినే నమః ధ్యాయామి. (వినాయకుని ధ్యానించండి...)
ప్రాణ ప్రతిష్ఠః (స్వామి వారికి ప్రాణం పోయుట)
ఓమ్ అసునీతే పునరస్మాను చక్షుః పునః ప్రాణ మిహనో దేహి భోగమ్‘ జ్యోక్పశ్యేమ సూర్యముచ్ఛరంత మనుమతే మృడయాన స్వస్తి
అమృతం నై ప్రాణాః అమృత మాపః‘ ప్రాణానేవ యథాస్థాన మువహ్వయతే ‘‘ స్వామిన్ సర్వజగన్నాథ యావత్పూజావసానకమ్‘ తావత్త్వం ప్రతిభావేన ప్రతి మేస్మిన్ సన్నిధిం కురు‘‘ సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీ పుత్రం పరివార సమేతం శ్రీ వరసిద్ధివినాయక స్వామిన్ ఆవాహితో భవ, స్థాపితో భవ, సుముఖోభవ, సుప్రసన్నోభవ, వరదో భవ, స్థిరాసనంకురు, ప్రసీదః ప్రసీదః ప్రసీద‘‘
ఆవాహనమ్ : స్వామివారిని పిలవటం స్వామివారు వచ్చినట్లుగా భావించటం. (పువ్వులు, అక్షతలు చేతితో పట్టుకుని గణపతికి ఆసనం చూపుతూ నమస్కరించి
ఈ క్రింది శ్లోకాన్ని చదివిన తరువాత ఆయన పాదాల వద్ద ఉంచాలి) అత్రాగచ్ఛ జగద్వంద్య సురరాజార్చితేశ్వర‘ అనాథనాథ సర్వజ్ఞ గౌరీగర్భ సముద్భవ‘‘
శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధివినాయక స్వామినే నమః ఆవాహయామి‘‘
ఆసనమ్ : స్వామివారు మనముందు ఆసనముపై కూర్చుండినట్లు ఊహించటం (పువ్వులు, అక్షతలు చేతితో పట్టుకొని గణపతికి నమస్కరిస్తూ ఈ క్రింది శ్లోకాన్ని చదివిన తరువాత ఆయన పాదాల వద్ద ఉంచాలి).
మౌక్తికైః పుష్పరాగైశ్చ నానారత్నైర్విరాజితం! రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతామ్‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః నవరత్నఖచిత సింహాసనార్థ పుష్పాక్షతాన్ సమర్పయామి‘‘
పాద్యమ్ : స్వామి వారి పాదాలకు నీళ్ళు సమర్పించి పాదాలు కడుగుతున్నట్లు భావించడం (పుష్పంతో కలశంలోని నీటిని గణపతి పాదాలపై కొద్దికొద్దిగా చల్లాలి)
శ్లో‘‘ సర్వతీర్థ సముద్భూతం ‘‘ పాద్యం గంగాది సంయుతం‘‘ విఘ్నరాజ! గృహాణేదం‘‘ భగవన్భక్త వత్సల‘‘ శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః తమ పాదయోః పాద్యం సమర్పయామి‘‘
అర్ఘ్యమ్ : స్వామి వారి చేతులకు నీళ్ళు ఇచ్చుట (పుష్పంతో కలశంలోని నీటిని గణపతి పాదాలపై కొద్దికొద్దిగా చల్లాలి) గౌరీపుత్ర! నమస్తేస్తు
శంకర ప్రియనందన! గృహాణార్ఘ్యం మయాదత్తం గంధపుష్పాక్షతైర్యుతం‘‘
శ్రీ సిద్ధిబుద్ధిసమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి‘‘
ఆచమనీయమ్ : స్వామి వారి నోటికి నీళ్ళు అందించడం తాగుతున్నట్లు భావించుట (పుష్పంతో కలశంలోని నీటిని గణపతి పాదాలపై కొద్దిగా చల్లాలి) అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ వరపూజితః గృహాణాచమనం దేవః తుభ్యం దత్తం మయా ప్రభో‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామినే నమః ముఖే ఆచమనీయం సమర్పయామి‘‘
మధుపర్కం : పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార వీటిని కలిపి స్వామి వారికి అందించుట (గణపతికి మధుపర్కం సమర్పించాలి) దధిక్షీర సమాయుక్తం మధ్వాజ్యేన సమన్వితం ‘‘ మధుపర్కం గృహాణేదం గణనాథం నమోస్తుతే‘‘
శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః మధుపర్కం సమర్పయామి.
పంచామృత స్నానమ్ : పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, వీటితో అభిషేకించేటట్లు భావించుట (పంచామృతాలతో ఈ కింద చెప్పిన వరుసలో గణపతికి అభిషేకం చేయాలి)
పాలు : ఓం ఆప్యాయస్వ సమేతుతే విశ్వత స్సోమ వృష్ణి యం‘ భవా వాజన్య
సంగథే‘‘ శ్రీ సిద్ధిబుద్ధిసమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః క్షీరేణ స్నపయామి‘‘
పెరుగు : ఓం దధిక్రాపుణ్ణో ఆకారిషం‘ జిష్ణోరశ్వస్య వాజినః సురభినో ముఖాకరత్‘ ప్రణ ఆయూగ్‌ంషి తారిషత్‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః దధ్నా స్నపయామి‘‘
నేయి : ఓం శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవోవస్సవితోత్పునా త్వచ్చిద్రేణ పవిత్రేణ వసో స్సూర్యన్యరశ్మిభిః‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః ఆజ్యేన స్నపయామి‘‘
తేనె: ఓం మధువాతా బుుతాయతే‘ మధుక్షరంతి సింధవః మాధ్వీర్నస్సంత్వోషధీ!‘ మధునక్తముతోషసి మధుమత్వార్థినగ్‌ం రజః‘ మధుద్యైరస్తునః పితా‘ మధుమాన్నో వనస్పతిర్మధుమాగ్‌ం అస్తుసూర్యః మాధ్వీర్గావో భవంతునః‘‘
శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః మధునా స్నపయామి‘‘
పంచదార : ఓం స్వాదుఃపవన్వ దివ్యాజన్మనే‘ స్వాదురింద్రాయ సుహవీతు నామ్నే‘ స్వాదుర్మి త్రాయ వరుణాయ వాయమే‘ బృహస్పతయే మధుమాగ్‌ం ఆదాభ్యః‘‘
శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః శర్కరేణ స్నపయామి‘‘
(మిగిలిన పంచామృతాలన్నింటినీ ఈ క్రింది శ్లోకం చెబుతూ అభిషేకం చేయాలి) స్నానం పంచామృతైర్దేవ గృహాణ గణనాయక‘ అనాథనాథ‘
సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత‘‘
శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః పంచామృత స్నానం సమర్పయామి.
ఫలోదకమ్ : (కొబ్బరినీటితో అభిషేకం చేయాలి)
యాః ఫలినీర్యా అఫలా అపుష్పాయాశ్చ పుష్పిణీః‘ బృహస్పతి ప్రసూతాస్తానో ముంచస్త్యగ్‌ంహనః‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః ఫలోదకేన స్నపయామి‘‘
శుద్ధోదకమ్ : మంచి నీటితో స్వామిని అభిషేకించునట్లుగా భావించడం (ఈ క్రింది శ్లోకంతో కలశంలోని నీటితో అభిషేకం చేయాలి. ఇక్కడ గణపతి ఉపనిషత్తు, పురుషసూక్త, నమకచమకాదులతో యథాశక్తి అభిషేకం చేయవచ్చు) గంగాది సర్వతీర్థేభ్యః అహృతైరమలైర్జలైః స్నానం కురుష్వ భగవాన్ ఉమాపుత్ర నమోస్తుతే‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః శుద్ధోదకస్నానం సమర్పయామి‘‘ స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి‘‘ (అంటూ కలశంలోని పుష్పంతో నీటిని పళ్ళెంలో విడవాలి. తరువాత ప్రతిమను వస్త్రంతో తుడిచి గంధం కుంకుమలతో అలంకరించి యథాస్థానంలో ఉంచాలి.)
వస్త్రమ్ : (నూతన వస్త్రములనుగాని, పత్తితో చేసిన వస్త్రద్వయాన్నిగాని ఈ క్రింది శ్లోకం చదివాక గణపతి పాదాలవద్ద ఉంచాలి) రక్తవస్త్రద్వయం చారు దేవయోగ్యంచ మంగళం‘ శుభప్రదం గృహాణత్వం లంబోదర హరాత్మజ‘‘ శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః వస్త్రయుగ్మం సమర్పయామి‘‘
యజ్ఞోపవీతమ్ : (పత్తితో చేసిన యజ్ఞోపవీతాన్నిగాని, పుష్పాక్షతలను గాని దేవునివద్ద ఉంచాలి) రాజితం బ్రహ్మసూత్రం చ కాంచనం చోత్తరీయకం‘ గృహాణ దేవ సర్వజ్ఞ భక్తానామిష్టదాయక‘‘
శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః యజ్ఞోపవీతం సమర్పయామి‘‘
గంధమ్ : (ఒక పుష్పాన్ని చందనంలో ముంచి గణపతి పాదాల వద్ద
ఉంచాలి) చందనాగరుకర్పూర కస్తూరీ కుంకుమాన్వితం‘ విలేపనం సురశ్రేష్ఠ! ప్రీత్యర్థం ప్రతిగృహ్యతామ్‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత సిద్ధి వినాయక స్వామినే నమః గంధాన్ ధారయామి.
అక్షతలు : (అక్షతలు దేవుని పాదాల వద్ద ఉంచాలి) అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాం తండులాన్ శుభాన్‘ గృహాణ పరమానంద
శంభుపుత్ర నమోస్తుతే‘‘ శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామినే నమః అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి‘‘
సింధూరం : శ్లో‘‘ ఉద్యద్భాస్కర సంకాశం‘‘ సంధ్యా వదరుణంప్రభో‘‘ వీరాలంకరణం దివ్యం‘‘ సింధూరం ప్రతిగృహ్యతాం‘‘ శ్రీ సిద్ధి బుద్ధి నమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః సింధూరం సమర్పయామి‘‘
మాల్యం : శ్లో‘‘ మాల్యాదీవి సుగంధాని‘‘ మాలత్యా దీనివై ప్రభో‘‘ మయాహృతాని పుష్పాణి‘‘ ప్రతిగృహ్ణీష్య శాంకర‘‘ శ్రీ సిద్ధి బుద్ధి నమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః మాల్యం సమర్పయామి‘‘
పుష్పమ్ : (సుగంధ పుష్పాలను దేవుని పాదాల వద్ద ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పుష్పం చొప్పున అ«థాంగపూజ, అష్టోత్తరాలను చెబుతూ అలంకరణ చేయాలి. పుష్పాలు సరిపోని పక్షంలో అక్షతలతో పూజించవచ్చు).
సుగన్ధానిచ పుష్పాణి జాజీకుందముఖానిచ ఏకవింశతి పత్రాణి
సంగృహాణ నమోస్తుతే‘ శ్రీ సిద్ధి బుద్ధి నమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః పుష్పైః పూజయామి‘‘
అథాంగ పూజా :
(స్వామి వారి అంగాన్ని ఒక్కొక్కటిగా అర్చించుట)
గణేశాయ నమః పాదౌ పూజయామి‘
ఏకదంతాయ నమః గుల్ఫౌ పూజయామి‘
విఘ్నరాజాయ నమః జానునీ పూజయామి‘
కామారిసూనవే నమః జంఘే పూజయామి‘
అఖువాహనాయ నమః ఊరూ పూజయామి‘
హేరంబాయ నమః కటిం పూజయామి‘
లంబోదరాయ నమః ఉదరం పూజయామి‘
గణనాథాయ నమః హృదయం పూజయామి‘
స్థూలకంఠాయ నమః కంఠం పూజయామి‘
పాశహస్తాయ నమః హస్తౌ పూజయామి‘
గజవక్త్రాయ నమః వక్త్రం పూజయామి‘
విఘ్నహంత్రే నమః నేత్రౌ పూజయామి‘
శూర్పకర్ణాయ నమః కర్ణౌ పూజయామి‘
ఫాలచంద్రాయ నమః లలాటం పూజయామి‘
సర్వేశ్వరాయ నమః శిరః పూజయామి‘
శ్రీ గణాధిపాయ నమః సర్వాణ్యంగాని పూజయామి‘‘
ఏకవింశతి పత్ర పూజ
ఏకవింశతి పత్రిపూజ సమయంలో పత్రితోనే పూజించాలి.
దూర్వాయుగ్మ పూజ గరికతో లేని పక్షంలో అక్షతలతో పూజించాలి
ఓం సుముఖాయ నమః మాచీపత్రం పూజయామి‘ (మాచి ఆకు)
ఓం గణాధిపాయ నమః బృహతీ పత్రం పూజయామి‘ (బలురక్కసి లేక ములక)
ఓం ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి‘ (మారేడు)
ఓం గజాననాయ నమః దూర్వాయుగ్మం పూజయామి‘ (గరికె రెమ్మలు)
ఓం çహరసూనవే నమః దత్తూర పత్రం పూజయామి‘ (ఉమ్మెత్త ఆకు)
ఓం లంబోదరాయ నమః బదరీ పత్రం పూజయామి‘ (రేగు ఆకు)
ఓం గుహాగ్రజాయ నమః అపామార్గ పత్రం పూజయామి‘ (ఉత్తరేణి)
ఓం గజకర్ణాయ నమః తులసీ పత్రం పూజయామి‘ (తులసి)
ఓం ఏకదంతాయ నమః చూత పత్రం పూజయామి‘ (మామిడి ఆకు)
ఓం వికటాయనమః కరవీర పత్రం పూజయామి‘ (గన్నేరు ఆకు)
ఓం భిన్న దంతాయ నమః విష్ణుక్రాంత పత్రం పూజయామి‘ (విష్ణు క్రాంతం)
ఓం వటవే నమః దాడిమీ పత్రం పూజయామి‘ (దానిమ్మ)
ఓం సర్వేశ్వరాయ నమః దేవదారు పత్రం పూజయామి‘ (దేవదారు)
ఓం ఫాలచంద్రాయ నమః మరువక పత్రం పూజయామి‘ (మరువం)
ఓం హేరంబాయ నమః సింధువార పత్రం పూజయామి‘ (వావిలాకు)
ఓం శూర్పకర్ణాయ నమః జాజీపత్రం పూజయామి‘ (జాజి తీగ ఆకు)
ఓం సురాగ్రజాయ నమః గండకీపత్రం పూజయామి‘ (దేవకాంచనం)
ఓం ఇభవక్త్రాయ నమః శమీపత్రం పూజయామి‘ (జమ్మి ఆకు)
ఓం వినాయకాయ నమః అశ్వత్థపత్రం పూజయామి‘ (రావి ఆకు)
ఓం సుర సేవితాయ నమః అర్జునపత్రం పూజయామి‘ (తెల్లమద్దె)
ఓం కపిలాయ నమః అర్కపత్రం పూజయామి‘ (జిల్లేడు ఆకు)
ఓం శ్రీ గణేశ్వరాయ నమః ఏకవింశతి పత్రిణి పూజయామి‘‘
(21 రకాల ఆకులను కలిపి వేసి నమస్కారం చేయవలెను)
ఏకవింశతి దూర్వాయుగ్మ పూజ
(రెండు, రెండు గరికలుగా స్వామిని అర్చించాలి)
గణాధిపాయ నమః దుర్వాయుగ్మం పూజయామి!
పాశాంకుశధరాయనమః దుర్వాయుగ్మం పూజయామి!
ఆఖువాహనాయ నమః దుర్వాయుగ్మం పూజయామి!
వినాయకాయనమః దుర్వాయుగ్మం పూజయామి!
ఈశపుత్రాయ నమః దుర్వాయుగ్మం పూజయామి!
సర్వసిద్ధిప్రదాయ నమః దుర్వాయుగ్మం పూజయామి!
ఏకదంతాయనమః దుర్వాయుగ్మం పూజయామి!
ఇభవక్త్రాయ నమః దుర్వాయుగ్మం పూజయామి!
మూషికవాహనాయ నమః దుర్వాయుగ్మం పూజయామి!
కుమారగురవే నమః దుర్వాయుగ్మం పూజయామి!
కపిలవర్ణాయనమః దుర్వాయుగ్మం పూజయామి!
బ్రహ్మచారిణేనమః దుర్వాయుగ్మం పూజయామి!
మోదకహస్తాయనమః దుర్వాయుగ్మం పూజయామి!
సురశ్రేష్ఠాయనమః దుర్వాయుగ్మం పూజయామి!
గజనాసికాయ నమః దుర్వాయుగ్మం పూజయామి!
కపిత్థఫలప్రియాయనమః దుర్వాయుగ్మం పూజయామి!
గజముఖాయనమః దుర్వాయుగ్మం పూజయామి!
సుప్రసన్నాయనమః దుర్వాయుగ్మం పూజయామి!
సురాగ్రజాయనమః దుర్వాయుగ్మం పూజయామి!
ఉమాపుత్రాయనమః దుర్వాయుగ్మం పూజయామి!
స్కందప్రియాయనమః దుర్వాయుగ్మం పూజయామి!
శ్రీ వరసిద్ధి వినాయకాయ స్వామినే నమః
ఏకవింశతి – దుర్వాయుగ్మం సమర్పయామి
ఓం గజాననాయ నమః
ఓం గణాధ్యక్షాయ నమః
ఓం విఘ్నరాజాయ నమః
ఓం వినాయకాయ నమః
ఓం ద్వైమాతురాయ నమః
ఓం ద్విముఖాయ నమః
ఓం ప్రముఖాయ నమః
ఓం సుముఖాయ నమః
ఓం కృతినే నమః
ఓం సుప్రదీపాయ నమః
ఓం సుఖనిధయే నమః
ఓం సురాధ్యక్షాయ నమః
ఓం సురారిఘ్నాయ నమః
ఓం మహాగణపతయే నమః
ఓం మాన్యాయ నమః
ఓం మహాకాలాయ నమః
ఓం మహాబలాయ నమః
ఓం హేరంబాయ నమః
ఓం లంబకర్ణాయ నమః
ఓం హ్రస్వగ్రీవాయ నమః
ఓం మహోదరాయ నమః
ఓం మహోత్కటాయ నమః
ఓం మహావీరాయ నమః
ఓం మంత్రిణే నమః
ఓం మంగళస్వరూపాయ నమః
ఓం ప్రమధాయ నమః
ఓం ప్రథమాయ నమః
ఓం ప్రాజ్ఞాయ నమః
ఓం విఘ్నకర్త్రే నమః
ఓం విఘ్నహంత్రే నమః
ఓం విశ్వనేత్రే నమః
ఓం విరాటత్పయే నమః
ఓం శ్రీపతయే నమః
ఓం శృంగారిణే నమః
ఓం ఆశ్రితవత్సలాయ నమః
ఓం శివప్రియాయ నమః
ఓం శీఘ్రకారిణే నమః
ఓం శాశ్వతాయ నమః
ఓం బలాయ నమః
ఓం బలోత్థితాయ నమః
ఓం భవాత్మజాయ నమః
ఓం పురాణ పురుషాయ నమః
ఓం పూష్ణే నమః
ఓం పుష్కరక్షిప్తవారిణే నమః
ఓం అగ్రగణ్యాయ నమః
ఓం అగ్రపూజ్యాయ నమః
ఓం అగ్రగామినే నమః
ఓం మంత్రకృతే నమః
ఓం చామీకరప్రభాయ నమః
ఓం సర్వాయ నమః
ఓం సర్వోపన్యాసాయ నమః
ఓం సర్వకర్త్రే నమః
ఓం సర్వనేత్రే నమః
ఓం సర్వసిద్ధిప్రదాయ నమః
ఓం సర్వసిద్ధయే నమః
ఓం పంచహస్తాయ నమః
ఓం పార్వతీనందనాయ నమః
ఓం ప్రభవే నమః
ఓం కుమార గురవే నమః
ఓం అక్షోభ్యాయ నమః
ఓం కుంజరాసుర భంజనాయ నమః
ఓం ప్రమోదాయ నమః
ఓం మోదకప్రియాయ నమః
ఓం కాంతిమతే నమః
ఓం ధృతిమతే నమః
ఓం కామినే నమః
ఓం కపిత్థ పనసప్రియాయ నమః
ఓం బ్రహ్మచారిణే నమః
ఓం బ్రహ్మరూపిణే నమః
ఓం బ్రహ్మవిద్యాధిపాయ నమః
ఓం విష్ణవే నమః
ఓం విష్ణుప్రియాయ నమః
ఓం భక్తజీవితాయ నమః
ఓం జితమన్మథాయ నమః
ఓం ఐశ్వర్యకారణాయ నమః
ఓం జ్యాయనే నమః
ఓం యక్షకిన్నరసేవితాయ నమః
ఓం గంగాసుతాయ నమః
ఓం గణాధీశాయ నమః
ఓం గంభీరనినదాయ నమః
ఓం వటవే నమః
ఓం అభీష్టవరదాయినే నమః
ఓం జ్యోతిషే నమః
ఓం భక్తనిధయే నమః
ఓం భావగమ్యాయ నమః
ఓం మంగళప్రదాయ నమః
ఓం అవ్యక్తాయ నమః
ఓం అప్రాకృతపరాక్రమాయ నమః
ఓం సత్యధర్మిణే నమః
ఓం సఖ్యే నమః
ఓం సరసాంబునిధయే నమః
ఓం మహేశాయ నమః
ఓం దివ్యాంగాయ నమః
ఓం మణికింకిణీ మేఖలాయ నమః
ఓం సమస్త దేవతామూర్తయే నమః
ఓం సహిష్ణవే నమః
ఓం సతతోత్థితాయ నమః
ఓం విఘాతకారిణే నమః
ఓం విశ్వక్‌దృశే నమః
ఓం విశ్వరక్షాకృతే నమః
ఓం కళ్యాణ గురవే నమః
ఓం ఉన్మత్తవేషాయ నమః
ఓం అపరాజితే నమః
ఓం సమస్త జగదాధారాయ నమః
ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః
ఓం ఆక్రాన్తచిదచిత్ప్రభవే నమః
ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః
శ్రీసిద్ధి బుద్ధి సమేత
వరసిద్ధి వినాయక స్వామినే నమః
అష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి.