విజయాలను ఒసగే విజయదశమి అంతరార్థం ఇదే..! | Dussehra 2025: Festival Meaning And Why We Celebrate Vijaya Dashami | Sakshi
Sakshi News home page

విజయాలను ఒసగే విజయదశమి అంతరార్థం ఇదే..!

Oct 1 2025 11:34 AM | Updated on Oct 1 2025 11:47 AM

Dussehra 2025: Festival Meaning And Why We Celebrate Vijaya Dashami

ఈ విజయదశమికి ఆత్మజ్ఞానాన్ని మన జీవితాలలో ఉదయించన్నవ్విండి అని పిలుపునిచ్చారు గురుదేవ్ శ్రీశ్రీ రవిశింకర్. విజయదశమిని మనం చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకింటున్నాం, నిజానికి ఈ యుద్ధం మంచికి, చెడుకి మధ్య కాదు. వేదాంత పరంగా చూసినప్పుడు, బయట ప్రపంచంలో కనిపించే ద్వైతభావనపై అనంత వ్యాప్తమై ఒకటిగా మాత్రమే ఉన్న సత్యం సాధించే విజయిం అది. శుద్ధచైతన్య స్వరూపమైన జగన్మాతే అన్ని రూపాలు, నామాలలో న్నిండి ఉంది. ఈ విధంగా అంతట నిండి ఉన్న ఒకే ఒక్క దైవత్వాన్ని అన్ని రూపాలలోనూ దర్శించగలగటమే ఈ పండుగ పరమార్థం. 

దైవీభావనకు, ఆసురీభావనకు జరిగే ఈ యుద్ధం బయట ప్రపంచంలో మాత్రమే కాదు, అది మన మనసులో ఎపుుడూ జరుగుతూనే ఉంది. విజయదశమినాడు రావణుడి బొమ్మను దహనం చేయటం మనం చాలాచోట్ల చూస్తున్నాం. రావణుడు అహంకారానికి చిహ్నం. అహం అంటే 'నేను వేరు' అనే తప్పుడు భావన. దాంతో వాళ్ల చుట్టూ వాళ్లే గోడలు కట్టుకుంటాం. ఆ అహంకారన్ని అణిచేందుకు వాళ్లకంటే వేరుగా మరొకరు (నేను వేరు, అతడు/ఆమె వేరు అనే భావన) కావాలి. ఆత్మవిశ్వాసానికి ఆ అవసరం లేదు. తాము ఇతరుల కంటే గొప్పవాళ్లమని అహంకారులు అనుకుంటారు. 

ఇక రాముడు ఆత్మజ్ఞానాన్నకి ప్రతీక. శ్రీరాముడు ఆత్మను, ఆత్మజ్ఞానాన్ని కూడా సూచిస్తాడు. వ్యక్తిలో ఆత్మజ్ఞానం (రాముడు) ఉదయించినపుడు, లోపల ఉన్న అహంకారం, చెడు భావన రూపంలో ఉన్న రావణుడు సంపూర్ణంగా నశించిపోతాడు. దీనికి సూచనగా ఈరోజు మనం మనలో ఉన్న చెడు భావనలను జ్ఞానం అనే అగ్నికి ఆహుతి ఇస్తాం (సమర్పిస్తాము). ఆ విధంగా సమర్పించటం వల్ల మన అంతరంగ వికాసం ఆరంభం అవుతుంది. 

మనలో అద్భుతమైన ఆనందం పెలులబుకతుంది, అది మనకే కాక సమాజమంతటికి మంచి చేస్తుంది. ఈ సంత్సర కాలమంతా సేకరించుకుపి మన మనసులో పేరుకున్న ఇష్టాఇష్టాలు, రాగద్వేషాలపై మనం విజయిం సాధించటాన్ని ఈ విజయదశమి రోజు సూచిస్తుంది. దైవీభావనల ఎఱుక మనలో కలిగినపుడు అది నిజమైన విజయం. అపుడు మన జీవితంలో శాంతి, ఆనందం, సౌభాగ్యం కలుగుతాయ. చెడు భావనలు మనలను ఆక్రమించుకున్నప్పుడు మనం దుుఃఖాన్ని, కష్టాలనును అనుభవిస్తాము. అందుకే వేదకాలంలో ప్రజలు ఒకర్నొకరు పలకరించుకనేటపుుడు “ఆరోగ్యమస్తు, తుష్టిరస్తు, పుష్టిరస్తు” (మీరు ఆరోగ్యంగా, తృప్తిగా ఉండాలి, మీ కార్యాలు శుభకరంగా జరగాలి) అన్న చెప్పేవారు. రావణ వినాశనం అనేది తిరుగులేని రామబాణంతో మాత్రమే జరుగగలదు. అదే విధంగా అన్నిరకాలైన చెడుభావనలు, మానసిక చాంచల్యాలపై ఆత్మజ్ఞానంతోనే విజయిం సాధించగలం. 

సరే, మరి ఈ ఆత్మజ్ఞానాన్ని పిందటిం ఎలా? (హిందీలో) విశ్రామ్ మే రామ్ హై (విశ్రాంతి లో రాముడు ఉన్నాడు) అన్న చెపునటులగా, ప్రగాఢమైన విశ్రాంతి ద్వారా మనం ఆత్మజ్ఞానాన్ని పొందగలుగుతాము. ఈనాటి సమాజంలో మనం చూస్తున్న అలజడులన్నిటికీ ఆత్మజ్ఞానం, ఆధ్యాత్మికత లేకపోవటమే కారణం. “నే నెవరు?” అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. అంతే కాదు, మీరు ఎవరు కాదు అని కూడా అడగిండి. “నేను ఈ శరీరాన్ని కాదు, మనసును కాదు, బుద్ధిని కాదు...” ఇలా విచారించి చూసినపుడు చివరికి ఏం మిగులుతిందో గమన్నించిండి! 

ఈ విధంగా మన స్వస్వభావాన్ని గమనించుకోవటం అనేది మన ఆత్మను ఉత్తేజపరచి మనలో సింతృప్తిని పెంపొందిస్తుంది. ఒక మనిషి మనసులో ఈ ప్రశ్నలు రేకెత్తిన మరుక్షణమే అతని జీవితంలో కష్టాలు, చెడు భావనలు అంతరించిపోవట ఆరంభమవుతుంది. అయితే, ఎంత విచారించినా సరే మళ్ళీమళ్ళీ మన మనసు వేసే చిక్కుముళ్లలో మనం పడుతూనే ఉంటాం. ఇవి మనకు మనమే వేసుకుంటున్న బంధాలు. 

ఈవిధమైన గందరగోళ స్థితినే యోగులు మాయ అపి పిలిచారు. ఈ మాయ నుంచి బయటపడేందుకే మనక ధ్యానం అవసరం. అందుకే, ఈ ముసుగును తొలగించుకునేందుక అనేక మార్గాలు సూచించారు: మనం పండుగలు, ఉత్సావాల జరుపుకుంటాము, జగన్మాతను ఆరాదిస్తాం, దైవం మనలోపలే ఉన్నదని, అంతే కాక విశ్వమంతా స్వచ్ఛమైన చైతన్యంగా నిండి ఉన్నదని మనకు మనమే గుర్తుచేసుకుంటాం. ఈ సమస్త విశ్వం ఆ ఏకైక చైతన్యపు లీల. దీన్నే మనం పదేపదే తప్పక గుర్తు చేసుకోవాలి అని అన్నారు గురుదేవ్‌ రవిశంకర్‌.

(చదవండి: నవరాత్రుల సమయంలో అరుదైన దృశ్యం..! దుర్గమ్మ ఆలయానికి కాపాలాగా..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement