Vijaya Dashami: సర్వం శక్తిమయం! | Vijaya Dashami Festival Story On Funday | Sakshi
Sakshi News home page

Vijaya Dashami: సర్వం శక్తిమయం!

Sep 28 2025 7:12 AM | Updated on Sep 28 2025 7:23 AM

Vijaya Dashami Festival Story On Funday

ఆదిశక్తి అయిన అమ్మవారిని ఆరాధించడం తరతరాల సంప్రదాయం. శక్తిస్వరూపిణి అయిన అమ్మవారిని శరన్నవరాత్రులలో ప్రత్యేకంగా ఆరాధిస్తారు. వీటినే దసరా నవరాత్రులని అంటారు. ‘దేవీభాగవతం’ వంటి పురాణగాథల ప్రకారం ఆదిశక్తి దుర్గాదేవిగా ఆవిర్భవించి, రక్తబీజ, చండ ముండ, శుంభ నిశుంభ, మహిషాసురాది రాక్షసులను సంహరించింది. దుష్టసంహారానికి ప్రతీకగా నవరాత్రులలో చివరి రోజున విజయ దశమినాడు దసరా పండుగను జనాలు వేడుకగా జరుపుకొంటారు.

దసరా నవరాత్రులలో పూజాదికాలు శాక్తేయ సంప్రదాయం ప్రకారం జరుగుతాయి. సింధులోయ నాగరికత కాలం నుంచి శాక్తేయ సంప్రదాయం ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి. సింధులోయ నాగరికతలో మొదలైన శాక్తేయ సంప్రదాయం దేశం నలువైపులకు విస్తరించింది. ఇందులో భాగంగానే శక్తిపీఠాలు ఏర్పడ్డాయి. ప్రధానంగా అష్టాదశ శక్తిపీఠాలు ఉన్నాయి. వీటితో పాటు యాభైఒక్క శక్తిపీఠాలు ఉన్నాయి. దేవీ భాగవతం నూట ఎనిమిది శక్తిపీఠాలను పేర్కొంది. వీటిలో కొన్ని భారతదేశంతో పాటు పాకిస్తాన్, టిబెట్, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంకలలో ఉన్నాయి. ఈ శక్తిపీఠాలు ఏర్పడటానికి మూలంగా దక్షయజ్ఞం గాథను చెబుతారు. 

శక్తిపీఠాల మూలగాథ
ఒకప్పుడు దక్షుడు బృహస్పతియాగం తలపెట్టాడు. ఈ యజ్ఞానికి సమస్త దేవతలను, యక్ష గంధర్వ కిన్నెర కింపురుషాదులను, మునిగణాలను ఆహ్వానించాడు. కూతురైన సతీదేవిని, అల్లుడైన శివుడిని మాత్రం పిలవలేదు. తండ్రి మాటను కాదని సతీదేవి శివుడిని పెళ్లాడింది. అందువల్లనే దక్షుడు కూతురిని, అల్లుడిని తాను నిర్వహించే యాగానికి ఆహ్వానించకుండా విస్మరించాడు. పుట్టింటి వేడుకకు పిలుపుతో పనేముంది అనుకుని సతీదేవి భర్త వారిస్తున్నా పట్టించుకోకుండా ప్రమధగణాలను వెంటబెట్టుకుని దక్షయజ్ఞానికి వెళ్లింది. ఆమెను చూసిన దక్షుడు ఆమెను, శివుడిని దారుణంగా నిందించాడు. శివనింద భరించలేని సతీదేవి యోగాగ్నిగుండంలోకి దూకి ఆత్మాహుతి చేసుకుంది. 

సతీ వియోగంతో శివుడు జగద్రక్షణ బాధ్యతను మానేశాడు. ఆమె మృతకళేబరాన్ని భుజం మీద మోసుకుంటూ దిక్కుతోచక తిరగసాగాడు. శివుడిని తిరిగి కార్యోన్ముఖుడిని చేయాల్సిందిగా దేవతలందరూ విష్ణువుకు మొరపెట్టుకున్నారు. సతీ కళేబరం చెంత ఉన్నంత వరకు శివుడు యథాస్థతికి రావడం అసాధ్యమని తలచిన విష్ణువు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించి, ఆమె శరీరాన్ని ఖండించాడు. సతీదేవి ఖండితావయవాలు భూమ్మీద ఒక్కోచోట చెల్లాచెదురుగా పడ్డాయి. అవి పడిన చోట శక్తిపీఠాలు ఏర్పడ్డాయి. వీటిలోని ప్రధానమైన పద్దెనిమిది శక్తిపీఠాలు అష్టాదశ శక్తిపీఠాలుగా గుర్తింపు పొందాయి. స్కాంద పురాణం వంటి పురాణాల ప్రకారం యాభైఒక్క శక్తి పీఠాలు ఉన్నాయి. దేవీభాగవతం ప్రకారం నూట ఎనిమిది శక్తిపీఠాలు ఉన్నాయి. అష్టాదశ శక్తి పీఠాల గురించి చాలామందికి తెలుసు. మిగిలిన శక్తిపీఠాలలో కొన్ని విశేషమైనవి, విలక్షణమైనవి ఉన్నాయి. వీటిలో కొన్ని అరుదైన శక్తిపీఠాల గురించి తెలుసుకుందాం.

మహామాయ పీఠం – జమ్ము కశ్మీర్‌
మహామాయ శక్తిపీఠం జమ్ము కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ జిల్లా అమర్‌నాథ్‌లో ఉంది. ఇది గుహాలయం. బయటి నుంచి చూడటానికి సాధారణమైన కొండగుహలా కనిపిస్తుంది గాని, లోపల పురాతనమైన మహామాయ విగ్రహం ఉంటుంది. అమర్‌నాథ్‌లో శివాలయం పొందినంతగా ఇది ప్రసిద్ధి పొందలేదు. అమర్‌నాథ్‌ యాత్రికుల్లో చాలామంది ఈ మహామాయ ఆలయాన్ని కూడా దర్శించుకుంటూ ఉంటారు. ఇది సతీదేవి గొంతు భాగం పడిన ప్రదేశమని పురాణాలు చెబుతున్నాయి. ఇది పార్వతీపీఠంగా ప్రసిద్ధి పొందింది.

దాక్షాయనీ పీఠం – టిబెట్‌
దాక్షాయని శక్తిపీఠం టిబెట్‌లో ఉంది. కైలాస పర్వతానికి సమీపాన మానస సరోవరానికి చేరువలో ఉన్న ఒక మంచుకొండ మీద ఈ శక్తిపీఠం ఉంది. మానస సరోవరం వద్ద వెలసినందున దీనిని మానసా శక్తిపీఠం అని కూడా అంటారు. సతీదేవి కుడిచేయి ఈ ప్రదేశంలో పడినట్లు పురాణాల కథనం. గోపురంలా కనిపించే శిఖరం కింద సహజంగా ఏర్పడిన గుహలోని పురాతన దాక్షాయని విగ్రహాన్ని భక్తులు దర్శించుకుంటుంటారు. 

గండకీ చండీ పీఠం – నేపాల్‌
గండకీ చండీ శక్తిపీఠం నేపాల్‌లో ఉంది. హిమాలయ సానువుల్లో గండకీ నదీ తీరానికి చేరువలో ముస్తాంగ్‌ పట్టణానికి సమీపంలో ఈ శక్తిపీఠం ఉంది. హిందువులకు, బౌద్ధులకు పవిత్ర క్షేత్రమైన ముక్తినాథ్‌ ఆలయానికి అతి చేరువలోనే గండకీ చండీ ఆలయం కూడా ఉంది. సతీదేవి ముఖ భాగం ఈ ప్రదేశంలో పడినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆలయంలో పురాతన శాక్తేయ సంప్రదాయంలో పూజాదికాలు నిర్వహిస్తుంటారు. దసరా నవరాత్రి ఉత్సవాల్లో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొంటుంటారు.

సావిత్రీ పీఠం – హరియాణా
సావిత్రీ శక్తిపీఠం హరియాణాలోని కురుక్షేత్ర జిల్లా థానేసర్‌లో ద్వైపాయన సరోవరం ఒడ్డున ఉంది. ఈ క్షేత్రంలోనే కురుపాండవ సంగ్రామం జరిగిందనే మహాభారత కథనం అందరికీ తెలిసినదే! కురుక్షేత్రలో వెలసిన సావిత్రీ శక్తిపీఠం స్థానికంగా భద్రకాళి ఆలయంగా ప్రసిద్ధి పొందింది. కురుక్షేత్ర యుద్ధానికి ముందు పాండవుల విజయం కోసం శ్రీకృష్ణుడు ఇదే శక్తిపీఠంలో అమ్మవారిని అర్చించాడట! యుద్ధానంతరం పాండవులు ఇక్కడ అమ్మవారికి పూజలు జరిపి, కానుకగా గుర్రాలను సమర్పించారట! ఈ ప్రదేశంలో సతీదేవి కుడిచేతి చీలమండ పడినట్లు పురాణాల కథనం. దసరా నవరాత్రి వేడుకలు ఈ ఆలయంలో ఘనంగా జరుగుతాయి.

గాయత్రీ పీఠం – రాజస్థాన్‌
గాయత్రీ శక్తిపీఠం రాజస్థాన్‌లోని అజ్మేర్‌ నగరానికి చేరువలో ఉన్న పుష్కరక్షేత్రంలో ఉంది. ఈ ప్రదేశంలో సతీదేవి మణికట్లు పడ్డాయని పురాణాల కథనం. అందువల్ల ఈ శక్తిపీఠాన్ని మణిబంధ పీఠం, మణివేదిక ఆలయం అని కూడా ఉంటారు. గాయత్రీ మంత్రసాధనకు ఈ శక్తిపీఠం అత్యుత్తమ క్షేత్రమని, ఇక్కడ చేసే గాయత్రీ మంత్రసాధన శీఘ్రంగా ఫలిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. పుష్కర క్షేత్రంలోని బ్రహ్మదేవుడి ఆలయానికి అతి చేరువలో ఉన్న ఈ ఆలయ నిర్మాణంలోని శిల్పకళా నైపుణ్యం అద్భుతంగా ఉంటుంది.

దేవగర్భ పీఠం – హిమాచల్‌ప్రదేశ్‌
దేవగర్భ శక్తిపీఠం హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రా పట్టణంలో ఉంది. ఇక్కడ వెలసిన దేవగర్భదేవినే వజ్రేశ్వరి అని, స్థానికులు కాంగ్రాదేవి అని అంటారు. ఈ ప్రదేశంలో సతీదేవి ఎడమ స్తనభాగం పడినట్లు పురాణాల కథనం. వజ్రేశ్వరిని దుర్గాదేవి ఉగ్రరూపంగా భావిస్తారు. అతి పురాతనమైన ఈ ఆలయంలోని విలువైన సంపదను మహమ్మద్‌ ఘజనీ దోచుకున్నాడు. ఆ తర్వాత 1905లో సంభవించిన భూకంపంలో ఆలయ నిర్మాణం బాగా దెబ్బతినడంతో తర్వాత ప్రస్తుతం కనిపిస్తున్న రీతిలో ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు. దసరా నవరాత్రులు ఈ ఆలయంలో వైభవోపేతంగా జరుగుతాయి.

త్రిపురసుందరీ పీఠం – త్రిపుర
త్రిపురసుందరీ శక్తిపీఠం ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలోని ఉదయపూర్‌ పట్టణంలో ఉంది. చిన్న కొండపై ఉన్న ఈ ఆలయ నిర్మాణం కూర్మాకృతిలో కనిపిస్తుంది. అందువల్ల దీనిని కూర్మపీఠం అని కూడా అంటారు. ఈ ఆలయంలో అమ్మవారు లలితా త్రిపురసుందరి రూపంలో కొలువై కనిపిస్తుంది. సతీదేవి కుడిపాదం ఈ ప్రదేశంలో పడినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈశాన్య ప్రాంతంలో అసోంలోని కామాఖ్య పీఠం తర్వాత అత్యధిక సంఖ్యలో భక్తులు దర్శించుకునే ఆలయంగా త్రిపురసుందరీ పీఠం ప్రసిద్ధి పొందింది.

భవానీ పీఠం – బంగ్లాదేశ్‌
భవానీ పీఠం బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌ జిల్లా సీతాకుండ్‌ వద్ద చంద్రనాథ్‌ కొండపై ఉంది. స్థానికంగా ఈ ఆలయాన్ని ఛత్తల్‌ భవానీ ఆలయంగా పిలుస్తారు. ఇక్కడే పరమశివుడు చంద్రశేఖరుడిగా కొలువై ఉండటంతో ఈ ప్రదేశం చంద్రకాంత్‌ ధామ్‌గా కూడా ప్రసిద్ధి పొందింది. సతీదేవి కుడి భుజం ఈ ప్రదేశంలో పడినట్లు పురాణాలు చెబుతున్నాయి. దసరా నవరాత్రి వేడుకలు ఈ శక్తిపీఠంలో ఘనంగా జరుగుతాయి.

శివానీ పీఠం – ఉత్తరప్రదేశ్‌
శివానీ శక్తిపీఠం ఉత్తరప్రదేశ్‌లోని చిత్రకూట్‌ జిల్లా రామ్‌గిరిలో ఉంది. ఇక్కడ కామదగిరి ప్రదక్షిణ మార్గంలో కొండ మీద ఉన్న అనేక ఆలయాల్లో పురాతనమైన శివానీ పీఠం కూడా ఉంది. సతీదేవి కుడి స్తనభాగం ఇక్కడ పడినట్లు పురాణాల కథనం. రామాయణ కథనం ప్రకారం సీతా రామ లక్ష్మణులు వనవాస కాలంలో ఈ చిత్రకూట పర్వతంపైనే కొన్నాళ్లు గడిపారట! కామదనాథుడి పేరిట శివుడు వెలసిన కొండ కావడంతో ఈ కొండకు కామదగిరి అనే పేరు వచ్చింది. దీని చుట్టూ ప్రదక్షిణలు చేస్తే కోరికలు ఈడేరుతాయని భక్తుల నమ్మకం.

హింగ్లాజ్‌ పీఠం – పాకిస్తాన్‌
హింగ్లాజ్‌ శక్తిపీఠం పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌ మర్కన్‌ తీరంలో ఉన్న హింగ్లాజ్‌ పట్టణంలో ఉంది. హింగ్లాజ్‌ నేషనల్‌ పార్కలో ఉన్న కొండ పైభాగంలో ఉన్న గుహలో హింగ్లాజ్‌ ఆలయం ఉంది. ఇక్కడి దేవతను హింగ్లాజ్‌ దేవి అని, హింగులా దేవి అని అంటారు. సతీదేవి లలాట భాగం ఇక్కడ పడినట్లు పురాణాల కథనం. పాకిస్తాన్‌లోని హిందువులతో పాటు మన దేశంలోని రాజస్థాన్, గుజరాత్‌ రాష్ట్రాలకు చెందిన భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటూ ఉంటారు. ఇక్కడ దసరా నవరాత్రులతో పాటు వసంత నవరాత్రి వేడుకలు కూడా సంప్రదాయబద్ధంగా జరుగుతాయి. 

తెలుగు రాష్ట్రాల్లో దసరా వేడుకలు
దేశ విదేశాల్లో పలుచోట్ల అమ్మవారి ఆలయాల్లో దసరా నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతాయి. దసరా వేడుకల సందర్భంగా పలుచోట్ల వీథుల్లో అమ్మవారి మండపాలను ఏర్పాటు చేస్తారు. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో కూడా ఈ వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడలోని కనకదుర్గ ఆలయంలోను, తెలంగాణలో ఆలంపురంలోని శక్తిపీఠమైన జోగులాంబ ఆలయంలోను ఈ వేడుకలు అత్యంత వైభవోపేతంగా జరుగుతాయి. ఈసారి దసరా వేడుకలు ఆశ్వయుజ శుక్ల పాడ్యమి రోజైన సెప్టెంబర్‌ 22 నుంచి ప్రారంభం అవుతున్నాయి. అక్టోబర్‌ 2న విజయదశమి నాటితో దసరా నవరాత్రులు పూర్తవుతాయి. నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని రోజుకో అవతారంలో రోజుకో తీరులో అలంకరిస్తారు. రోజుకో ప్రత్యేక నైవేద్యాన్ని సమర్పిస్తారు. విజయవాడలోని కనకదుర్గ ఆలయంలో అమ్మవారిని నవరాత్రులలో చేసే అలంకరణలు, నైవేద్యాల వివరాలు: 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement