
తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో శ్రీ నాట్య శిల్పి ఆర్ట్స్ అకాడమీ 35వ ఉచిత నాట్య శిక్షణ శిబిరం ముగింపు వేడుకలు రవీంద్రభారతిలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉచిత శిక్షణ పొందిన వంద మంది చిన్నారులు మహా నృత్యోత్సవం పేరిట కూచిపూడి, జానపద, దాండియా నృత్యాలతో అలరించారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ ఛైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్‌రావు మాట్లాడుతూ.. చిన్నారులకు ఉచితంగా శాస్త్రీయ సంగీత కళలపై శిక్షణ ఇవ్వడం అభినందనీయమన్నారు.
అంతకు ముందు అకాడమీ వ్యవస్థాపకులు వాసుకి శ్రీనివాస్ దర్శకత్వంలో ప్రదర్శించిన లైట్ ఆఫ్ బుద్ద నాటకం హైలెట్‌గా నిలిచింది. ఈ కార్యక్రమంలో సంఘ సేవకులు లయన్ సర్దార్ హర్‌బీందర్ సింగ్, సనత్‌నగర్ కార్పొరేటర్ కొలను లక్ష్మీ బాల్‌రెడ్డి, అకాడమీ డైరెక్టర్ పుష్పలత పాల్గొన్నారు.
(చదవండి: విశ్వ వేదికపై.. నాటు పాట..! వైరల్‌గా తెలుగు పాటలు..)