breaking news
Classical dance perfomance
-
తొమ్మిదేళ్లకే గజ్జె కట్టి... ఏకంగా మిస్ వరల్డ్ 2025లో..
కూచిపూడి కళాకారిణి శ్రవ్యమానస. అత్యంత సామాన్య కుటుంబంలో పుట్టిన శ్రవ్య తనకు తానుగా ఎక్కిన నిచ్చెన మెట్లే అన్నీ. తొమ్మిదేళ్ల వయసులో గజ్జె కట్టి... నేడు ‘మిస్ వరల్డ్ 2025’ కార్యక్రమాల్లో నాట్య ప్రదర్శనలిచ్చిన ఘనతను తన ఖాతాలో జమ చేసుకున్నారు. కళాకారుల బిడ్డ! శ్రవ్య అమ్మానాన్నలిద్దరూ కళాకారులే. సామాన్య కుటుంబం కావడంతో ఉద్యోగం మీదనే దృష్టి పెట్టాల్సి వచ్చింది. శ్రవ్య జీవితంలో నాట్యం, చదువు రెండూ సమతూకంగానే పెరిగాయి. ఎంటెక్ పూర్తి కాగానే హైదరాబాద్ మెట్రో రైల్లో ఉద్యోగం వచ్చింది. కానీ కళ కోసం ఉద్యోగాన్ని వదిలేయాల్సి వచ్చింది. దేశవిదేశాల్లో ఆమె ప్రదర్శనలు పద్దెనిమిది వందలు దాటాయి. ఆమె అకాడెమీలో శిక్షణ తీసుకున్న విద్యార్థుల సంఖ్య మూడు వేలు దాటింది. అధ్యయనమే గెలిపిస్తోంది! ‘నాట్యసాధనలో నిత్యం మేధోమధనం జరుగుతూ ఉండాలి. గురువులు నేర్పించిన జ్ఞానంతో సరిపుచ్చుకుంటే అక్కడే ఆగిపోతాం’ అంటారు శ్రవ్య. మిస్ వరల్డ్ 2025 పోటీల్లో బుద్ధవనంలో ప్రదర్శన బుద్ధుడి ఇతివృత్తంగా ఉండాలన్నారు నిర్వహకులు. వారం రోజుల్లో బౌద్ధాన్ని అధ్యయనం చేసి, కాస్ట్యూమ్స్ లేత రంగులతో నిరాడంబరంగా డిజైన్ చేసి, బృందం మొత్తానికి కుట్టించడం వరకు ఎందులోనూ రాజీ పడలేదామె. అలాగే చౌమొహల్లా ప్యాలెస్ ప్రదర్శనకు సితార్ వంటి నిజాం సంగీత శైలితో సెమీ క్లాసికల్ రూపొందించి ప్రదర్శించారు. పోచంపల్లిలో తెలుగు జానపదం కోలాటం, శిల్పారామంలో బృందావనం, బంజారా, రాసలీలలు ప్రదర్శించి చూపారు. ఆర్ద్రతే కళ క్యాన్సర్ పేషెంట్‌కి విగ్ తయారు చేయడానికి సహజమైన కేశాలు అవసరమని తెలిసి గుండు చేయించుకుని తన కేశాలనిచ్చారు శ్రవ్య. కళాకారులను బతికించేది మనసు లోతుల్లోంచి ఉబికి వచ్చే ఎమోషనే. ఈ సున్నితత్వాన్ని తనలో పదిలపరుచుకుంటున్నారామె. అబుదాబిలో శ్రీనివాస కల్యాణం ప్రదర్శనకు స్టాండింగ్ ఒవేషన్ రావడం మధురానుభూతి, యాసిడ్ సర్వైవర్ మనోగతాన్ని ఆవిష్కరించడం నర్తకిగా ఆమె సామాజిక బాధ్యత. కళాకారులు సామాజిక సమస్యల మీద స్పందించడంతోపాటు సాంకేతికంగా కూడా ఎప్పటికప్పుడు తమను తాము అప్డేట్ చేసుకోవాలి. చెయ్యి పట్టుకుని నడిపించే గాడ్ఫాదర్లు లేని శ్రవ్య మానస... డిజిటల్ వేదికగా ప్రపంచానికి సుపరిచితం కావడం వల్లనే మిస్ వరల్డ్ 2025 కార్యక్రమాల్లో నాట్య ప్రదర్శన అవకాశం ఆమెను వెతుక్కుంటూ వచ్చింది. ‘వ్యక్తిగా పరిపూర్ణత సాధించిన బ్యూటీ ప్రాజంట్స్ నుంచి చాలా నేర్చుకున్నాను’... అన్నప్పుడు ఆమెలో శిఖరాన్ని అధిరోహించిన సంతోషం వ్యక్తమైంది. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
అలరించిన మహా నృత్యోత్సవం..
తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో శ్రీ నాట్య శిల్పి ఆర్ట్స్ అకాడమీ 35వ ఉచిత నాట్య శిక్షణ శిబిరం ముగింపు వేడుకలు రవీంద్రభారతిలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉచిత శిక్షణ పొందిన వంద మంది చిన్నారులు మహా నృత్యోత్సవం పేరిట కూచిపూడి, జానపద, దాండియా నృత్యాలతో అలరించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ ఛైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్‌రావు మాట్లాడుతూ.. చిన్నారులకు ఉచితంగా శాస్త్రీయ సంగీత కళలపై శిక్షణ ఇవ్వడం అభినందనీయమన్నారు. అంతకు ముందు అకాడమీ వ్యవస్థాపకులు వాసుకి శ్రీనివాస్ దర్శకత్వంలో ప్రదర్శించిన లైట్ ఆఫ్ బుద్ద నాటకం హైలెట్‌గా నిలిచింది. ఈ కార్యక్రమంలో సంఘ సేవకులు లయన్ సర్దార్ హర్బీందర్ సింగ్, సనత్‌నగర్ కార్పొరేటర్ కొలను లక్ష్మీ బాల్‌రెడ్డి, అకాడమీ డైరెక్టర్ పుష్పలత పాల్గొన్నారు. (చదవండి: విశ్వ వేదికపై.. నాటు పాట..! వైరల్‌గా తెలుగు పాటలు..) -
టాలీవుడ్ ప్రిన్స్ దీపావళి సర్ప్రైజ్.. సితార అదిరిపోయే ఫర్మామెన్స్
టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుకు తన గారాల పట్టి సితార అంటే పిచ్చి ప్రేమ. తండ్రితో కలిసి సితార ఎప్పుడు సోషల్ మీడియాలో చురుకుగా ఉంటారు. ఎక్కడికెళ్లినా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులకు సర్ప్రైజ్లు ఇస్తుంటారు. తాజాగా ఇవాళ దీపావళిని పురస్కరించుకుని చేసిన షేర్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎప్పటిలా కాకుండా కాస్త భిన్నంగా అభిమానులకు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు. దీపావళి సందర్భంగా సితార క్లాసికల్ డ్యాన్స్‌తో అదరగొట్టింది. దీనికి సంబంధిత ఆ వీడియోను పోస్ట్ చేస్తూ అభిమానులందరికీ విషెస్ తెలిపింది. తన గురువు మహతీ భిక్షుతో కలిసి నృత్యం చేయటం చాలా సంతోషంగా ఉందని సితార తెలిపింది. ఆ వీడియో చూసిన పలువురు నెటిజన్లు సితార డ్యాన్స్‌ను మెచ్చుకుంటున్నారు. తన కూతురు సితార డ్యాన్స్ చేసిన వీడియోను మహేశ్ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. (చదవండి: ఆ సినిమా బాహుబలి కంటే హిట్ అయ్యేది.. ఆర్జీవీ ట్వీట్ వైరల్) మహేశ్ బాబు తన ఇన్‌స్టాలో రాస్తూ..'నన్ను గర్వపడేలా చేయటంలో నువ్వు ఎప్పుడూ ఫెయిల్ కావు. ఈ ప్రదర్శన ఇలాగే కొనసాగించు చిట్టి తల్లి. నీకు నేర్పిన గురువులకు నా ప్రత్యేక ధన్యవాదాలు. ' అంటూ కితాబిచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సితారకు ఫ్యాన్స్ కంగ్రాట్స్ చెబుతున్నారు. View this post on Instagram A post shared by Mahesh Babu (@urstrulymahesh) -
పుష్కర హేల.. ఆనంద డోల