
సీరియల్ నటిగా కెరీర్ మొదలుపెట్టిన సౌమ్యరావు (Sowmya Rao) జబర్దస్త్ షోతో యాంకర్‌గా మారింది. కన్నడ నటి అయినప్పటికీ కష్టపడి తెలుగు నేర్చుకోవడమేకాకుండా తెలుగులో ఓ పాట కూడా పాడి అందరినీ ఆశ్చర్యపరిచింది. సౌమ్య జీవితంలో ఏదైనా వెలితి ఉందంటే అది తల్లిని కోల్పోవడమే! బ్రెయిన్ క్యాన్సర్‌తో సౌమ్య తల్లి మరణించింది.
అర్ధరాత్రి బస్టాండ్‌లో నిద్ర
తాజాగా ఓ ఇంటర్వ్యూలో సౌమ్య రావు తన జర్నీ గురించి మాట్లాడింది. 'నేను చాలా పేదరికం అనుభవించాను. ఓ రోజు అర్ధరాత్రి అమ్మ, నేను, సోదరుడు.. ముగ్గురం బస్టాప్‌లో పడుకున్నాం. రెండురోజులదాకా నేను అన్నం తినలేదు. తిరుపతి వెళ్లినప్పుడు దైవదర్శనం కంటే కూడా నాకు తిండి ఎప్పుడు పెడతారా? అని ఎదురుచూసేదాన్ని. అంతటి దీనస్థితిలో బతికా..

సిండికేట్
ఈ బుల్లితెర ఇండస్ట్రీలో నెగ్గాలంటే టాలెంట్ ఉంటే సరిపోదు, లక్ ఉండాలి. కొందరికి అదృష్టం కలిసొచ్చి, మరికొందరు ఏవో జిమ్మిక్కులు చేసి ఇండస్ట్రీలోకి వచ్చారు. ఇంకా అలా వస్తూనే ఉంటారు. ఉదయభాను అన్నట్లు ఇక్కడ పెద్ద సిండికేటు ఉంది. దానివల్ల నేను కూడా ఎఫెక్ట్ అయ్యాను. నేను ఓ సీరియల్ చేశాను. అందులోని హీరోహీరోయిన్లకు మధ్య ఏదో వ్యవహారం నడుస్తోంది. షూటింగ్ ప్యాకప్ చెప్పాక హీరో వచ్చి నాతో ఏదో చెప్తూ ఉంటే.. ఆ హీరోయిన్ కారును రివర్స్ గేర్‌లో తీసుకొచ్చి నన్ను ఢీ కొట్టింది. అదొక భయంకరమైన అనుభవం. ఇండస్ట్రీ నాకు ఇచ్చినదానికన్నా నేను పోగొట్టుకుందే ఎక్కువ.
యాక్సిడెంట్
ఒకసారి ఓ పెద్ద హీరోను ఇంటర్వ్యూ చేయాల్సి ఉంది. త్వరగా వెళ్లాలని కారును స్పీడ్‌గా పోనిచ్చాను. అప్పుడు యాక్సిడెంట్ జరిగి కాలుకు దెబ్బ బలంగా తగిలి చాలా రక్తం పోయింది. ఇలా చాలా కష్టాలు చూశాను' అని చెప్పుకొచ్చింది. ఇకపోతే ఓసారి విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు ఓ పెద్ద హీరో కలిసి.. తనతో మాట్లాడాలని ఫోన్ నెంబర్ కూడా తీసుకున్నాడంది. అయితే ఆ హీరో ఎవరన్నది మాత్రం చెప్పలేదు. తనకున్న ఏకైక వెలితి అమ్మ అని.. ఇంకొన్నాళ్లు తనుంటే బాగుండేదని అభిప్రాయపడింది. తనకు బ్రెయిన్ క్యాన్సర్ రాకపోయుంటే బాగుండని చెప్తూ సౌమ్య ఎమోషనలైంది.
చదవండి: కన్నడ సినిమాలు ఆడుతున్నాయా? చులకన చేసిన స్టార్ హీరో