breaking news
Sowmya Rao
-
‘నీకు కూతురు ఉందా? ‘పెద్దమనిషి’ అయిందా?’ అని అడిగేవాళ్లు.. : సౌమ్య రావు
చిత్ర పరిశ్రమ అనేది రంగుల ప్రపంచం. బయటకు మాత్రం అందంగానే కనిపిస్తుంది. కానీ లోపలకు తొంగి చూస్తే.. అక్కడ కూడా కష్టాలు, బాధలు ఉంటాయి. తెర ముందు ముఖానికి రంగు వేసుకొని జనాలకు ఎంటర్టైన్మెంట్ అందిస్తున్న చాలా మంది నటీనటులు తెర వెనుక చాలా కష్టాలను అనుభవించినవాళ్లే. తినడానికి తిండిలేని పరిస్థితులను ఎదుర్కొని ఉన్నవాళ్లు చాలా మందే ఇండస్ట్రీలో ఉన్నారు. అలాంటి వారిలో కన్నడ నటి, యాంకర్ సౌమ్యరావు(Sowmya Rao) కూడా ఒకరు. ‘జబర్దస్త్’ షో ద్వారా తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరైన ఈ కన్నడ బ్యూటీ.. రియల్ లైఫ్‌లో చాలా కష్టాలను అనుభవించింది. తినేందుకు తిండిలేక పస్తులు ఉన్న రోజులు కూడా చాలానే ఉన్నాయట. తాజాగా ఓ టీవీ చానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తను పడిన కష్టాలను చెబుతూ సౌమ్య ఎమోషనల్ అయింది.అప్పుల బాధలు తట్టుకోలేక.. నా చిన్నప్పుడు నాన్న బాగా అప్పులు చేశాడు. ఆ డబ్బుతో ఏం చేశాడో తెలియదు కానీ అప్పు ఇచ్చిన వాళ్లంతా మా ఇంటికి వచ్చి గొడవ చేసేవాళ్లు. నాన్న చేసిన అప్పులకు అమ్మ మాటలు పడాల్సి వచ్చేంది. కొంతమంది అయితే వల్గర్‌గా మాట్లాడేవాళ్లు. ‘నీకు కూతురు ఉందా? పెద్దమనిషి అయిందా?’ అంటూ అసభ్యకరంగా మాట్లాడేవాళ్లు. వారి బాధలు తప్పుకోలేక ఓ రోజు రాత్రి మా అమ్మ నన్ను, బ్రదర్‌ని తీసుకొని తిరుపతి వచ్చింది. అప్పుడు అమ్మ చేతిలో కేవలం రూ. 100 మాత్రమే ఉన్నాయి. రాత్రంతా బస్టాండ్‌లో నిద్రపోయాం. ఉదయం గుడిలో పెట్టే అన్న కోసం చాలా ఎదురు చూశాం. దేవుడి దర్శనం కంటే అక్కడ పెట్టే అన్నంపైనే మా దృష్టి ఉండేది. మా ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే.. చుట్టు పక్కల వాళ్లు తలుపులు వేసుకునేవాళ్లు. ఎందుకంటే చుట్టాలకు టీ లేదా అన్నం పెట్టాలన్నా.. పక్కింటివాళ్లనే అడిగేవాళ్లం. అందుకే బంధువులు వస్తే.. అంతా తలుపులు మూసుకునే వాళ్లు.టైపింగ్ నేర్పిస్తానంటూ మిస్ బిహేవ్ చేశాడునేను కాలేజీలో ఉన్నప్పటి నుంచే పార్ట్ టైం జాబ్ చేసేదాన్ని. అలా ఓ సారి ఓ లాయర్ దగ్గర పని చేశాను. ఆయన ఇంట్లోనే వర్క్ ఉండేది. పని కోసం వెళ్తే..ఆయన నాతో మిస్ బిహేవ్ చేసేవాడు. టైపింగ్ నేర్పిస్తా అంటూ నాపై చేతులు వేసేవాడు. ఆయన భార్య, తల్లి బయటకు వెళ్లగానే నాతో మిస్ బిహేవ్ చేసేవాడు. నా పరిస్థితి ఆయనకు తెలుసు. దాన్న ఆయన అలుసుగా తీసుకున్నాడు. అందుకే మన కష్టాలను, బాధలను ఇతరులతో షేర్ చేసుకోవద్దు. మనకు కష్టం ఉంది, పరిస్థితి బాలేదు అని తెలిస్తే మనతో ఆడుకుంటారు.స్టార్ హీరో ఇంటర్వ్యూకి వెళ్తుండగా ప్రమాదంన్యూస్ రీడర్‌గా కన్నడలో నా కెరీర్ ప్రారంభం అయింది. కెరీర్ ప్రారంభంలో చాలా కష్టపడ్డాను. ఒకేసారి మూడు చానళ్లలో పని చేశాను. ఒక రోజు ఒక పెద్ద హీరోని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. నా కాలికి తీవ్రంగా గాయం అయింది. అందరూ ఆస్పత్రికి వెళ్దాం.. అంటే నేను షూట్‌కి వెళ్లాను. స్టూడియోలో నన్ను చూసి అందరూ భయపడ్డారు. కాలికి తీవ్రంగా గాయం అయిందని.. ముందు ఆస్పత్రికి వెళ్లమని చెప్పాను. కానీ నాకేమో నొప్పి కంటే ఎక్కువగా ఇంటర్వ్యూ మిస్ అయితే డబ్బులు రావు కదా అనే బాధే ఎక్కువగా ఉంది. నేను జీరో నుంచి వచ్చాను .అందుకే సెలెబ్రిటీ అనే ఫీలింగ్ నాకు ఉండదు. ఇప్పటికే ఏదైనా ఈవెంట్ ఉంటే ఆటోలో కూడా వెళ్తుంటాను’ అని సౌమ్యరావు చెప్పుకొచ్చింది. -
అర్ధరాత్రి బస్టాండ్‌లో నిద్ర.. ఆ హీరో నా నెంబర్ తీసుకుని..: సౌమ్యరావు
సీరియల్ నటిగా కెరీర్ మొదలుపెట్టిన సౌమ్యరావు (Sowmya Rao) జబర్దస్త్ షోతో యాంకర్‌గా మారింది. కన్నడ నటి అయినప్పటికీ కష్టపడి తెలుగు నేర్చుకోవడమేకాకుండా తెలుగులో ఓ పాట కూడా పాడి అందరినీ ఆశ్చర్యపరిచింది. సౌమ్య జీవితంలో ఏదైనా వెలితి ఉందంటే అది తల్లిని కోల్పోవడమే! బ్రెయిన్ క్యాన్సర్‌తో సౌమ్య తల్లి మరణించింది. అర్ధరాత్రి బస్టాండ్‌లో నిద్రతాజాగా ఓ ఇంటర్వ్యూలో సౌమ్య రావు తన జర్నీ గురించి మాట్లాడింది. 'నేను చాలా పేదరికం అనుభవించాను. ఓ రోజు అర్ధరాత్రి అమ్మ, నేను, సోదరుడు.. ముగ్గురం బస్టాప్‌లో పడుకున్నాం. రెండురోజులదాకా నేను అన్నం తినలేదు. తిరుపతి వెళ్లినప్పుడు దైవదర్శనం కంటే కూడా నాకు తిండి ఎప్పుడు పెడతారా? అని ఎదురుచూసేదాన్ని. అంతటి దీనస్థితిలో బతికా.. సిండికేట్ఈ బుల్లితెర ఇండస్ట్రీలో నెగ్గాలంటే టాలెంట్ ఉంటే సరిపోదు, లక్ ఉండాలి. కొందరికి అదృష్టం కలిసొచ్చి, మరికొందరు ఏవో జిమ్మిక్కులు చేసి ఇండస్ట్రీలోకి వచ్చారు. ఇంకా అలా వస్తూనే ఉంటారు. ఉదయభాను అన్నట్లు ఇక్కడ పెద్ద సిండికేటు ఉంది. దానివల్ల నేను కూడా ఎఫెక్ట్ అయ్యాను. నేను ఓ సీరియల్ చేశాను. అందులోని హీరోహీరోయిన్లకు మధ్య ఏదో వ్యవహారం నడుస్తోంది. షూటింగ్ ప్యాకప్ చెప్పాక హీరో వచ్చి నాతో ఏదో చెప్తూ ఉంటే.. ఆ హీరోయిన్ కారును రివర్స్ గేర్‌లో తీసుకొచ్చి నన్ను ఢీ కొట్టింది. అదొక భయంకరమైన అనుభవం. ఇండస్ట్రీ నాకు ఇచ్చినదానికన్నా నేను పోగొట్టుకుందే ఎక్కువ. యాక్సిడెంట్ఒకసారి ఓ పెద్ద హీరోను ఇంటర్వ్యూ చేయాల్సి ఉంది. త్వరగా వెళ్లాలని కారును స్పీడ్‌గా పోనిచ్చాను. అప్పుడు యాక్సిడెంట్ జరిగి కాలుకు దెబ్బ బలంగా తగిలి చాలా రక్తం పోయింది. ఇలా చాలా కష్టాలు చూశాను' అని చెప్పుకొచ్చింది. ఇకపోతే ఓసారి విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు ఓ పెద్ద హీరో కలిసి.. తనతో మాట్లాడాలని ఫోన్ నెంబర్ కూడా తీసుకున్నాడంది. అయితే ఆ హీరో ఎవరన్నది మాత్రం చెప్పలేదు. తనకున్న ఏకైక వెలితి అమ్మ అని.. ఇంకొన్నాళ్లు తనుంటే బాగుండేదని అభిప్రాయపడింది. తనకు బ్రెయిన్ క్యాన్సర్ రాకపోయుంటే బాగుండని చెప్తూ సౌమ్య ఎమోషనలైంది.చదవండి: కన్నడ సినిమాలు ఆడుతున్నాయా? చులకన చేసిన స్టార్ హీరో -
అమ్మకు బ్రెయిన్ క్యాన్సర్.. నన్ను కూడా గుర్తుపట్టలేదు: యాంకర్
నటిగా కెరీర్ మొదలుపెట్టిన సౌమ్య రావు జబర్దస్త్ షోతో యాంకర్‌గా మారింది. పైకి నవ్వుతూ, పంచులు విసురుతూ చలాకీగా కనిపించే ఆమె జీవితంలో మాత్రం ఎంతో విషాదం దాగి ఉంది. తల్లి క్యాన్సర్‌తో పోరాడి కన్నుమూయడం ఆమెను ఎంతగానో కుంగదీసింది. చివరి రోజుల్లో తల్లి అనుభవించిన నరకాన్ని చూసి తల్లడిల్లిపోయింది. తాజాగా ఓ షోలో హైపర్ ఆది.. సౌమ్య రావుకు ఆమె తల్లి జ్ఞాపకార్థం ఓ ఫోటో ఫ్రేమ్ ఇచ్చాడు. ఇది చూసి స్టేజీపైనే ఏడ్చేసింది సౌమ్య రావు. ఆమె మాట్లాడుతూ.. 'ఒకరోజు అమ్మకు బాగా తలనొప్పి వచ్చింది. ఆస్పత్రికి తీసుకెళ్తే బ్రెయిన్ క్యాన్సర్ అన్నారు. తను నెమ్మదిగా జ్ఞాపకశక్తిని కోల్పోతూ వచ్చింది. ఆఖరికి నన్ను కూడా మర్చిపోయింది. తనను మూడున్నరేళ్లపాటు బెడ్‌పైనే చూసుకున్నాను. ఆ దేవుడు అమ్మను ఇంతటి దారుణ స్థితిలో వదిలేస్తాడని అసలు ఊహించలేదు. అమ్మ మళ్లీ నా కడుపులో పుట్టాలని కోరుకుంటున్నాను' అంటూ కన్నీళ్లు పెట్టుకుంది సౌమ్య. మొన్నామధ్య మాతృ దినోత్సవం సందర్భంగానూ తల్లిని గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనైంది సౌమ్య. తల్లి కోసం భగవంతుడికి ఎన్నో పూజలు చేసినా, ఉపవాసాలు ఉన్నా ఆ దేవుడు కరుణించలేదని బాధపడింది. ఆ భగవంతుడు తనకే ఎందుకిలా చేశాడని ఆవేదన చెందింది. అందరూ అమ్మ ఫోటో షేర్ చేసి మదర్స్ డే శుభాకాంక్షలు చెప్తుంటే తనకు మాత్రం చివరి రోజుల్లో తల్లి పడ్డ బాధే కళ్ల ముందు మెదులుతోందని కన్నీళ్లు పెట్టుకుంది.. అమ్మ లేకుండా తన జీవితం అసంపూర్తిగా మిగిలిపోయిందని పేర్కొంది. ప్రతిరోజు, ప్రతిక్షణం తల్లిని మిస్ అవుతూనే ఉంటానని ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది. View this post on Instagram A post shared by Sowmya Rao (@sowmya.sharada) చదవండి: వెకేషన్‌కు మెగాస్టార్ దంపతులు -
నేను చేసిన పూజలు, ఉపవాసాలు వృథా.. జబర్దస్త్ యాంకర్ వీడియో వైరల్
-
ఆ దేవుడు నన్ను కరుణించలేదు: జబర్దస్త్ యాంకర్ ఎమోషనల్
సీరియల్స్‌తో నటిగా కెరీర్ ఆరంభించిన సౌమ్య రావు జబర్దస్త్‌తో యాంకర్‌గా మారింది. షోలో నవ్వుతూ, చలాకీగా ఉంటూ, కంటెస్టెంట్లపై పంచులు విసిరే ఆమె వ్యక్తిగతంగా మాత్రం ఎంతో బాధను అనుభవిస్తున్నట్లు తెలుస్తోంది. సౌమ్య తల్లి క్యాన్సర్‌తో పోరాడి కన్నుమూశారు. చివరి రోజుల్లో తన తల్లి ఎదుర్కొన్న నరకం గురించి వివరిస్తూ ఇటీవల ఓ వీడియో షేర్ చేసింది. ఈ వీడియోలో సౌమ్య రావు ఆస్పత్రి బెడ్ మీద ఉన్న తల్లిని కంటికి రెప్పలా చూసుకుంటూ తనను నవ్వించేందుకు ప్రయత్నించింది. తన తల్లి అనుభవించిన నరకం ఏ తల్లికీ రాకూడదని ఎమోషనలైంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 'అంబులెన్స్, డాక్టర్స్.. ట్రీట్మెంట్.. మందులు.. ఎంతో బాధ అనుభవించావు. నీ కోసం ఆ భగవంతుడికి ఎన్నో పూజలు చేశాను. ఉపవాసాలు ఉన్నాను. అయినా ఆ దేవుడు కరుణించలేదు. ఆ భగవంతుడు నాకెందుకిలా చేశాడని బాధేస్తోంది. అందరూ అమ్మ ఫోటో షేర్ చేసి మదర్స్ డే శుభాకాంక్షలు చెప్తుంటే నాకు మాత్రం చివరి రోజుల్లో నువ్వు పడ్డ బాధే గుర్తొస్తోంది. దాన్ని మర్చిపోలేకపోతున్నాను. రేయిపగలు నీకు సేవ చేసినా, భగవంతుడికి పూజ చేసినా అన్నీ వృథా అయ్యాయి. నువ్వు లేకుండా నా జీవితం అసంపూర్తిగా మిగిలింది. ప్రతిరోజు, ప్రతిక్షణం నిన్ను మిస్ అవుతూనే ఉన్నాను. అమ్మా, నాకోసం మళ్లీ పుడతావని వేయి కళ్లతో ఎదురు చూస్తున్నాను. దేవుడా.. మా అమ్మానాన్నలను మళ్లీ నాకివ్వు. నిన్ను చాలా మిస్ అవుతున్నా అమ్మా.. లవ్ యూ సోమచ్' అని రాసుకొచ్చింది. చదవండి: పొద్దున ఆరు గంటలకే చికెన్ తిన్న ఎన్టీఆర్.. నాక్కూడా : రామ్ చరణ్