
రజనీకాంత్ (Rajinikanth) నడుచుకుంటూ వస్తే చాలు రికార్డులు వాటంతటవే వస్తాయి. బస్ కండక్టర్ నుంచి సూపర్‌స్టార్‌గా ఎదిగిన రజనీ ప్రస్థానం ఎందరికో ఆదర్శనీయం. ఆగస్టు 15 నాటికి రజనీ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి 50 ఏళ్లు పూర్తవుతాయి. ఈ సందర్భంగా రజనీ ఆప్త మిత్రుడు మోహన్‌బాబు (Mohanbabu) కూతురు మంచు లక్ష్మి అనేక విషయాలను పంచుకుంది.
నాన్న చిన్నపిల్లాడిగా..
మంచు లక్ష్మి మాట్లాడుతూ.. రజనీ అంకుల్ మమ్మల్ని ఎంతో ప్రేమిస్తాడు. మాక్కూడా ఆయనంటే చాలా ఇష్టం. అంకుల్ వచ్చాడంటే మా నాన్న చిన్నపిల్లాడయిపోతాడు. ఇప్పటికీ వాళ్లిద్దరూ ఒకరినొకరు సరదాగా ఆట పట్టించుకుంటూ ఉంటారు. 50 ఏళ్లుగా కొనసాగుతున్న అందమైన స్నేహం వారిది. నటులవ్వడానికి ముందు నుంచే ఇద్దరూ మంచి మిత్రులు.
కష్టసుఖాల్లోనూ..
మా నాన్న ఎప్పుడైనా బాధలో ఉంటే అంకుల్ సపోర్ట్‌గా నిలబడతాడు. అలాగే అంకుల్‌కు ఏదైనా కష్టమొచ్చిందంటే నాన్న తోడుగా ఉంటాడు. అన్ని రకాల పరిస్థితుల్లోనూ ఇద్దరూ కలిసే ఉంటారు. అలాంటి ఫ్రెండ్ దొరకాలని ప్రతి ఒక్కరూ ఆ దేవుడిని కోరుకోవాల్సిందే! పెదరాయుడు సినిమాలో అంకుల్ గెస్ట్ రోల్ చేశాడు.
పెదరాయుడు మూవీలో..
నిజానికి ఆయనకు ఆ సినిమా చేయాల్సిన అవసరం లేదు. కానీ కేవలం ఫ్రెండ్‌షిప్ కోసం మాత్రమే ఆ మూవీలో యాక్ట్ చేశాడు. నాన్న కోసం ఆయన స్వయంగా రాయలసీమ రామన్న చౌదరి సినిమా కథ రాసిచ్చాడు. అదీ వారి ఫ్రెండ్‌షిప్ గొప్పదనం. వ్యక్తిగతంగానే కాకుండా కెరీర్‌లోనూ ఒకరికొకరు తోడుగా ఉన్నారు అని మంచు లక్ష్మి చెప్పుకొచ్చింది.
చదవండి: ఆ హీరోయిన్ మగాడిలా ఉంటుందన్న మృణాల్.. కౌంటరిచ్చిన మృణాల్