
హీరోయిన్ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) కొంతకాలంగా తరచూ వార్తల్లో నిలుస్తోంది. మొన్నటివరకు హీరో ధనుష్‌తో డేటింగ్ రూమర్స్‌తో వార్తల్లో నిలిచిన ఆమె ఇటీవలే దానికి ఫుల్‌స్టాప్ పెట్టింది. ధనుష్ తనకు మంచి స్నేహితుడు మాత్రమేనని క్లారిటీ ఇచ్చింది. ఇకపోతే హీరోయిన్ బిపాసా బసు (Bipasha Basu) గురించి ఆమె గతంలో మాట్లాడిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
ఆ హీరోయిన్ మగాడిలా కనిపిస్తుంది
నేను బిపాసా కంటే అందంగా ఉంటాను. ఆమె కండలు తిరిగిన దేహంతో మగాడిలా కనిపిస్తుంది. ఆమెతో పోలిస్తే నేను చాలా బెటర్ అని కామెంట్స్ చేసింది. ఆ వీడియోపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తరుణంలో బిపాసా బసు.. మృణాల్‌కు కౌంటర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆమె పేరును ప్రస్తావించకుండా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది.
మృణాల్‌కు కౌంటర్?
బలమైన మహిళలు ఎల్లప్పుడూ ఒకరి ఉన్నతి కోసం మరొకరు పాటుపడతారు. అందమైన స్త్రీలకు ఆ మజిల్స్ అవసరం. ఎందుకంటే.. మహిళలెప్పుడూ బలంగా, ధృడంగా ఉండాలి. అప్పుడే మనం శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండగలం. స్త్రీలు స్ట్రాంగ్‌గా కనిపించకూడదన్న పాతకాలపు ఆలోచనలను బద్ధలు కొట్టండి అని బిపాసా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది.
