
బాలీవుడ్ నటి శిల్పా శిరోద్కర్ (Shilpa shirodkar) రోడ్డు ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డారు. ఇదే విషయాన్ని తెలుపుతూ సోషల్‌మీడియాలో ఆమె పోస్ట్ చేసింది. ఈ క్రమంలో తన కారు ఫోటోలను కూడా పంచుకుంది. మహేశ్‌బాబు మరదలు, నమత్రా శిరోద్కర్‌కు ఆమె సోదరి అవుతారనే విషయం తెలిసిందే. 'బ్రహ్మ' సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఆమె పలు హిందీ సీరియళ్లలో కీలక పాత్రలు పోషించింది. ఆపై ‘బిగ్‌బాస్ 18’ (హిందీ) కంటెస్టెంట్‌గా కూడా మెప్పించింది.
ముంబైలో తాను ప్రయాణిస్తున్న కారును ఒక ప్రైవేట్ బస్సు ఢీ కొట్టిందని శిల్పా శిరోద్కర్ పేర్కొంది. అయితే, ఈ ప్రమాదంలో తనకు ఎలాంటి గాయాలు కాలేదని చెప్పింది. కానీ, తన కారుకు మాత్రమే డ్యామేజ్ అయిందని ఆమె ఇలా చెప్పింది. ఆ బస్సు ఏ కంపెనీ కోసం అయితే పనిచేస్తుందో ఆ యాజమాన్యంపై శిల్పా ఫిర్యాదు చేసింది. అయితే, ఎవరికీ గాయాలు కాలేదు కదా అంటూ.. ఈ సంఘటనకు తమ కంపెనీ బాధ్యత వహించడానికి సిద్ధంగా లేదని సదరు కంపెనీ చెప్పినట్లు ఆమె పేర్కొంది.
ముంబైలోని ఆ ఆఫీసుకు ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తులు యోగేష్ కదమ్, విలాస్ ఇది తమ కంపెనీ బాధ్యత కాదని, డ్రైవర్ బాధ్యత అని వెళ్లిపోయారని శిల్పా శిరోద్కర్ పేర్కొంది. ఈ వ్యక్తులు ఎంత క్రూరంగా ఉన్నారు..? డ్రైవర్ ఎంత సంపాదిస్తున్నాడు..? అని సోషల్‌మీడియాలో ఆమె రాసింది. ఈ విషయంలో ముంబై పోలీసులు వెంటనే రియాక్ట్ అయ్యారని వారు సరైనా న్యాయం చేశారని ఆమె తెలిపింది.