స్టార్‌ సింగర్‌ చిత్రకు గాయం.. ఎలా జరిగిందంటే? | Singer KS Chitra Reveals Details About Her Injury, Watch Video Inside | Sakshi
Sakshi News home page

Singer Chitra Shoulder Injury: ఎయిర్‌పోర్టులో గాయపడ్డ స్టార్‌ సింగర్‌.. అసలేమైందో చెప్పిన చిత్ర

Jun 27 2025 9:11 AM | Updated on Jun 27 2025 9:36 AM

Singer KS Chitra Reveals Details About Her Injury

స్టార్‌ సింగర్‌ కేఎస్‌ చిత్ర (KS Chitra)ను ఇష్టపడని వాళ్లుండరు. అద్భుత గాత్రంతో ప్రేక్షకులను ఎన్నో ఏళ్లుగా అలరిస్తోంది. ఇటీవల చిత్రకు ప్రమాదం జరిగిందంటూ కొన్ని వార్తలు వెలువడ్డాయి. చేతికి కట్టుతో కనిపించడంతో ఇది నిజమేనని తేలిపోయింది. తాజాగా తనకు జరిగిన ప్రమాదం గురించి వివరాలు బయటపెట్టింది చిత్ర. మలయాళంలో వచ్చే స్టార్‌ సింగర్‌ (10వ సీజన్‌) షోలో చిత్ర మాట్లాడుతూ.. చెన్నై ఎయిర్‌పోర్టులో ఈ ప్రమాదం జరిగింది.

కింద పడిపోయా..
హైదరాబాద్‌ వెళ్లేందుకు చెన్నై విమానాశ్రయానికి వెళ్లాను. అక్కడ సెక్యూరిటీ చెకింగ్‌ పూర్తి చేసుకుని నా భర్త కోసం ఎదురుచూస్తున్నాను. ఇంతలో అక్కడున్న అభిమానులు నాతో ఫోటోలు దిగేందుకు ముందుకు వచ్చారు. నా వెనకాలే సెక్యూరిటీ వస్తువులు పెట్టే ట్రే ఉంది. నాతో ఫోటో తీసుకునే ఉత్సాహంలో నన్ను కాస్త వెనక్కు నెట్టారు. ఫోటోలు దిగడం అయిపోయాక నేను వెనక్కు తిరిగి ఓ అడుగు వేశాను. అంతే.. నా కాలు ట్రేకు తగలడంతో బ్యాలెన్స్‌ తప్పి కింద పడిపోయాను.

విశ్రాంతి
అప్పుడు నా భుజం ఎముక ఒకటిన్నర అంగుళం కిందకు జరిగింది. డాక్టర్లు దాన్ని సరిచేశారు. కానీ, మూడువారాలు విశ్రాంతి తీసుకోవాలన్నారు. మూడు నెలలపాటు జాగ్రత్తగా ఉండమని సూచించారు అని చెప్పుకొచ్చింది. దీంతో అభిమానులు.. చిత్ర త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ కామెంట్లు చేస్తున్నారు. కాగా చిత్ర.. నాలుగున్నర దశాబ్దాలుగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, ఒరియా, బెంగాలీ భాషల్లో పాటలు పాడుతూ రాణిస్తోంది. ఇప్పటివరకు 25 వేలకుపైగా పాటలు పాడినట్లు తెలుస్తోంది. ఈమెను మెలోడీ క్వీన్‌ అని పిలుస్తారు.

 

 

చదవండి: Kannappa Review: ‘కన్నప్ప’ మూవీ ట్విటర్‌ రివ్యూ

Advertisement
 
Advertisement
Advertisement