breaking news
K.S Chitra
-
స్టార్ సింగర్ చిత్రకు గాయం.. ఎలా జరిగిందంటే?
స్టార్ సింగర్ కేఎస్ చిత్ర (KS Chitra)ను ఇష్టపడని వాళ్లుండరు. అద్భుత గాత్రంతో ప్రేక్షకులను ఎన్నో ఏళ్లుగా అలరిస్తోంది. ఇటీవల చిత్రకు ప్రమాదం జరిగిందంటూ కొన్ని వార్తలు వెలువడ్డాయి. చేతికి కట్టుతో కనిపించడంతో ఇది నిజమేనని తేలిపోయింది. తాజాగా తనకు జరిగిన ప్రమాదం గురించి వివరాలు బయటపెట్టింది చిత్ర. మలయాళంలో వచ్చే స్టార్ సింగర్ (10వ సీజన్) షోలో చిత్ర మాట్లాడుతూ.. చెన్నై ఎయిర్పోర్టులో ఈ ప్రమాదం జరిగింది.కింద పడిపోయా..హైదరాబాద్ వెళ్లేందుకు చెన్నై విమానాశ్రయానికి వెళ్లాను. అక్కడ సెక్యూరిటీ చెకింగ్ పూర్తి చేసుకుని నా భర్త కోసం ఎదురుచూస్తున్నాను. ఇంతలో అక్కడున్న అభిమానులు నాతో ఫోటోలు దిగేందుకు ముందుకు వచ్చారు. నా వెనకాలే సెక్యూరిటీ వస్తువులు పెట్టే ట్రే ఉంది. నాతో ఫోటో తీసుకునే ఉత్సాహంలో నన్ను కాస్త వెనక్కు నెట్టారు. ఫోటోలు దిగడం అయిపోయాక నేను వెనక్కు తిరిగి ఓ అడుగు వేశాను. అంతే.. నా కాలు ట్రేకు తగలడంతో బ్యాలెన్స్ తప్పి కింద పడిపోయాను.విశ్రాంతిఅప్పుడు నా భుజం ఎముక ఒకటిన్నర అంగుళం కిందకు జరిగింది. డాక్టర్లు దాన్ని సరిచేశారు. కానీ, మూడువారాలు విశ్రాంతి తీసుకోవాలన్నారు. మూడు నెలలపాటు జాగ్రత్తగా ఉండమని సూచించారు అని చెప్పుకొచ్చింది. దీంతో అభిమానులు.. చిత్ర త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ కామెంట్లు చేస్తున్నారు. కాగా చిత్ర.. నాలుగున్నర దశాబ్దాలుగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, ఒరియా, బెంగాలీ భాషల్లో పాటలు పాడుతూ రాణిస్తోంది. ఇప్పటివరకు 25 వేలకుపైగా పాటలు పాడినట్లు తెలుస్తోంది. ఈమెను మెలోడీ క్వీన్ అని పిలుస్తారు. View this post on Instagram A post shared by Asianet (@asianet) చదవండి: Kannappa Review: ‘కన్నప్ప’ మూవీ ట్విటర్ రివ్యూ -
25 వేల పాటలు.. లెక్కలేనన్ని అవార్డులు.. ఈమె ఎవరంటే? (ఫొటోలు)
-
చిత్ర, పద్మలకు 'ఉమెన్ అచీవర్ అవార్డు'
చెన్నై: ప్రముఖ సినీగాయనీ కే.ఎస్ చిత్ర, నర్తకి పద్మ సుబ్రహ్మణంలు "ఉమెన్ అచీవర్ అవార్డులను అందుకోనున్నారు. రెయిన్ డ్రాప్స్ అనే సామాజిక సంస్థ వారి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 9న నిర్వహించే మహిళా దినోత్సవం సందర్భంగా కే.ఎస్ చిత్ర, పద్మ సుబ్రహ్మణంలను ఉమెన్ అచీవర్ అవార్డులతో సత్కరించనున్నారు. రెండవ వార్షికోత్సవంలో భాగంగా మహిళా దినోత్సవం రోజున ఉమెన్ అచీవర్ అవార్డులను వారిద్దరికి ప్రదానం చేయనున్నట్టు రెయిన్ డ్రాప్స్ వెల్లడించింది. అయితే ఈ వేడుకలకు ఏఆర్ రెహానా అధ్యక్షతన వహిస్తున్నట్టు రెయిన్స్ డ్రాప్స్ ఓ ప్రకటనలో పేర్కొంది. చిత్ర, పద్మ సుబ్రహ్మణంతో పాటు మరికొంతమందికి ఉమెన్ అచీవర్ అవార్డులను ప్రదానం చేయనున్నారు. వారిలో గాయనీ నిత్యాశ్రీ మహదేవన్, రచయిత కుట్టి రేవంతి, సామాజిక వ్యవస్థాపకుడు గిరిజ రాఘవన్, కాస్ట్యూమ్ డిజైనర్ వాసుకీ భాస్కర్ పలువురు ఈ అవార్డులు అందుకోనున్నట్టు రెయిన్ డ్రాప్స్ తెలిపింది. కాగా, 2013లో ప్రముఖ సినీగాయనీ పి. సుశీలకు ఉమెన్ అచీవర్ అవార్డును ప్రదానం చేశారు.