
సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా కొత్త సినిమా ఆరంభమైంది. మానస శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ‘కమిటీ కుర్రోళ్ళు’ వంటి హిట్ చిత్రం తర్వాత పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై నిహారిక కొణిదెల నిర్మిస్తున్న ద్వితీయ సినిమా ఇది. ముహూర్తపు సన్నివేశానికి డైరెక్టర్స్ వశిష్ట కెమెరా స్విచ్ ఆన్ చేయగా, నాగ్ అశ్విన్ క్లాప్ కొట్టారు. తొలి సన్నివేశానికి దర్శకుడు కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. ‘‘ఫ్యాంటసీ, కామెడీ జోనర్ తెరకెక్కనున్న చిత్రమిది.
రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 15 నుంచి హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో జరగనుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ‘వెన్నెల’ కిషోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్థి, గెటప్ శీను, సుఖ్వీందర్ సింగ్, అరుణ భిక్షు, రమణ భార్గవ్, వాసు ఇంటూరి, రోహిణి, రోహన్ ఇతర పాత్రలు పోషించనున్న ఈ సినిమాకి సంగీతం: అనుదీప్ దేవ్, కెమేరా: రాజు ఎడురోలు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మన్యం రమేష్.