
‘మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్’ చిత్రాల ఫేమ్ సంగీత్ శోభన్ హీరోగా రూపొందిన చిత్రం ‘గ్యాంబ్లర్స్’. కేఎస్‌కే చైతన్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రశాంతి చారులింగ హీరోయిన్‌గా, రాకింగ్ రాకేశ్ ముఖ్యపాత్రలో నటించారు. సునీత, రాజ్‌కుమార్ బృందావనం నిర్మించారు. నిర్మాణానంతర పనులు తుది దశకు చేరుకున్న ఈ చిత్రాన్ని జూన్ 6న విడుదల చేయనున్నట్లు ప్రకటించి, సంగీత్ ఫస్ట లుక్‌ను విడుదల చేశారు.
కేఎస్‌కే చైతన్య మాట్లాడుతూ– ‘‘మిస్టరీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రం ‘గ్యాంబ్లర్స్’. థ్రిల్లింగ్ అంశాలు, ట్విస్ట్‌లు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయి. సంగీత్ నటనలోని మరో కోణాన్ని ఆవిష్కరించేలా ఈ చిత్రం ఉంటుంది’’ అన్నారు. ‘‘కొత్త కాన్సెప్ట్‌తో పూర్తి థ్రిల్లింగ్ అంశాలతో రూపొందిన మా సినిమా అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అని సునీత, రాజ్‌కుమార్ తెలిపారు.