
గతంలో బాక్సాఫీస్ వద్ద యూత్‌ను అలరించిన సినిమా మ్యాడ్. ఈ సినిమాకు సీక్వెల్‌గా వస్తోన్న మ్యాడ్ స్క్వేర్‌తో మరోసారి కడుపుబ్బా నవ్వించేందుకు ప్రేక్షకుల ముందుకొస్తున్నారు మన యంగ్ హీరోలు సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్. ఈ చిత్రాన్ని కల్యాణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ మూవీని సూర్యదేవర నాగవంశీ సమర్పణలో హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఉగాది కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది.
ఈ నేపథ్యంలోనే మ్యాడ్ మూవీ మేకర్స్ మరో అప్‌డేట్ ఇచ్చారు. మ్యాడ్ స్క్వేర్ సెన్సార్ పూర్తయినట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ప్రత్యేక వీడియోను పోస్ట్ చేశారు. ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేషన్ వచ్చినట్లు మేకర్స్ వెల్లడించారు. కాగా.. ఈ సినిమా మార్చి 28న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
Manaki yedi thinnaga jaragavu gaa…
Idhi anthe …
Mission Censor: Completed ☑️#MADSquare certified U/A for a fun packed theatrical ride ❤️
Theatres lo kooda anni light lu velige entertainment tho siddam 😎
In cinemas worldwide from MARCH 28th! 🥳@NarneNithiin… pic.twitter.com/HRDODIX4ib— Sithara Entertainments (@SitharaEnts) March 24, 2025