 
													చిన్న చిత్రంగా వచ్చి పెద్ద విజయం సాధించిన మూవీ ‘మ్యాడ్’. కాలేజీ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, గౌరీ ప్రియారెడ్డి, అనంతిక, గోపికా ఉద్యాన్ కీలక పాత్రల్లో నటించారు. కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో నటించిన వారంతా కొత్తవారే అయినప్పటికీ ప్రచార చిత్రాలతో తొలి నుంచే మ్యాడ్‌పై హైప్ క్రియేట్ అయింది.
అక్టోబర్ 6న థియేటర్స్‌లో విడుదలైన ఈ చిత్రం..అంచనాలకు తగ్గట్టే మంచి విజయం సాధించింది. త్వరలోనే ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను అలరించనుంది. ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ని సొంతం చేసుకున్న ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్..తాజాగా రిలీజ్ డేట్‌ని ప్రకటించింది. నవంబర్ 3 నుంచి ఈ చిత్రం నెట్‌ఫిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా తెలియజేస్తూ..‘మిమ్మలందర్ని పిచ్చెక్కించే ఒక శుభవార్త. మ్యాడ్ చిత్రం నవంబర్ 3 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది’ అని రాసుకొచ్చింది.
‘మ్యాడ్’ కథేంటి?
మనోజ్ (రామ్ నితిన్), దామోదర్ అలియాస్ డీడీ (సంగీత్ శోభన్), అశోక్ (నార్నే నితిన్) ముగ్గురూ.. రీజీనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజీ మొదటి సంవత్సరంలో జాయిన్ అవుతారు. వీరితో పాటు లడ్డు అనే కుర్రాడు కూడా అదే కాలేజీలో చేరుతాడు.ఈ నలుగురు మంచి స్నేహితులవుతారు. అశోక్ ఇంట్రావర్ట్‌గా ఉంటాడు. మనోజ్..కనిపించిన ప్రతి అమ్మాయితో పులిహోర కలుపుతాడు. డీడీ ఏమో తనకు ఏ అమ్మాయిలు పడరని దూరంగా ఉంటూ సోలో లైపే సో బెటర్ అని పాటలు పాడుతుంటాడు.
అశోక్‌ను అదే కాలేజీకి చెందిన జెన్నీ(అనంతిక సనీల్ కుమార్) ఇష్టపడుతుంది. అశోక్‌కి కూడా ఆమె అంటే ఇష్టమే. కానీ తమ ప్రేమ విషయాన్ని ఒకరికొకరు చెప్పుకోరు. మరోవైపు మనోజ్.. బస్సులో శృతి((శ్రీ గౌరీ ప్రియా రెడ్డి)ని చూసి నిజంగానే ప్రేమలో పడతాడు. ఆమె కూడా కొన్నాళ్లు మనోజ్‌తో స్నేహం చేసి ఓ కారణంతో అమెరికాకు వెళ్లిపోతుంది. ఇక డీడీకి ఓ అజ్ఞాత అమ్మాయి నుంచి ప్రేమ లేఖ వస్తుంది. వెన్నెల పేరుతో ఫోన్‌లో పరిచయం చేసుకొని.. ప్రేమాయణం సాగిస్తుంటారు. మరి ఈ ముగ్గురి ప్రేమ కథలు ఎలా ముగిశాయి? శృతి ఎందుకు అమెరికా వెళ్లింది? అశోక్, జెన్నీలు ఒకరి మనస్సులో మాట మరొకరకు చెప్పుకున్నారా? డీడీకి ప్రేమ లేఖ రాసిన వెన్నెల ఎవరు? ఇంజనీరింగ్ కాలేజీలో MAD(మనోజ్, అశోక్, దామోదర్) చేసిన అల్లరి ఏంటి? అనేదే మిగతా కథ.
Mimmalnandarini picchekinche oka subhavaartha. MAD cinema 3rd November nunchi Netflix lo stream avabothundhi. #MADonNetflix pic.twitter.com/m5xKGH1vwj
— Netflix India South (@Netflix_INSouth) October 30, 2023

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
