జూదం కోసం సీక్రెట్‌ సొసైటీ.. ఆసక్తికరంగా ‘గ్యాంబ్లర్స్‌’ ట్రైలర్‌ | Gamblers Trailer Out | Sakshi
Sakshi News home page

జూదం కోసం సీక్రెట్‌ సొసైటీ.. ఆసక్తికరంగా ‘గ్యాంబ్లర్స్‌’ ట్రైలర్‌

Jun 1 2025 2:45 PM | Updated on Jun 1 2025 2:45 PM

Gamblers Trailer Out

సంగీత్‌ శోభన్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గ్యాంబ్లర్స్‌’ (Gamblers). చైతన్య దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్‌ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ని చిత్రబృందం విడుదల చేసింది. ‘ఆడడం చేతగానివాడికి జూదం అంటే నేరం అనిపిస్తుంది. ఆడడం తెలిసిన వాడికి జూదం నేరం కాదు’ అనే డైలాగ్‌తో ట్రైలర్‌ ఆసక్తికరంగా ప్రారంభం అయింది. సీక్రెట్‌ సొసైటీలోకి ఆహ్వానించడం.. అక్కడ ఏది నిజం కాదు చెప్పడం.. రూ.100 కోట్ల డైమండ్‌ మిస్‌ అయినట్లు ట్రైలర్‌లో చూపించి సినిమాపై ఆసక్తిని పెంచేశారు.

ట్రైలర్‌ రిలీజ్‌ సందర్భంగా నిర్మాత రాజ్‌ కుమార్‌ బృందావనం మాట్లాడుతూ '' గతంలో మా సంస్థలో  ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్‌ దర్శకత్వంలో 'శ్రీవల్లి' అనే సినిమాను నిర్మించాం. తాజాగా మరో వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో తాజాగా 'గ్యాంబ్లర్స్‌' చిత్రాన్ని నిర్మించాం. సినిమాలో అన్ని వర్గాలను అలరించే అంశాలున్నాయి. మాస్‌ అండ్‌ క్లాస్‌ ఎంటర్‌టైనర్‌గా అందరి మనసులను ఈ చిత్రం దోచుకుంటుంది' అన్నారు. మరో నిర్మాత సునీత మాట్లాడుతూ ''యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా అన్ని ఎమోషన్స్‌ ఈ చిత్రంలో ఉంటాయి. మా సంస్థ నుంచి రాబోతున్న మరో వైవిధ్యమైన చిత్ర. మా బ్యానర్ నుంచి కొత్త కాన్సెప్ట్‌లు చిత్రాలు అందించాలన్నదే మా లక్ష్యం.

ఈ సినిమాలో డిఫరెంట్‌ సంగీత్‌ శోభన్‌ను చూడబోతున్నారు. ఆయన పర్‌ఫార్మెన్స్‌ కూడా చాలా కొత్తగా ఉంటుంది.  సినిమాలోని ప్రతి పాత్ర, ప్రతి అంశం ఎంతో థ్రిల్లింగ్‌గా ఉంటుంది. నూతన ప్రతిభను ప్రోత్సాహించాలనే లక్ష్యంతో మా బ్యానర్‌లో సినిమాలు చేస్తున్నాం. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నైజాంలో విడుదల చేస్తున్నాం. ఆదిత్య మ్యూజిక్‌ ద్వారా మా పాటలను విడుదల చేశాం' అన్నారు. దర్శకుడు కేఎస్‌కే చైతన్య మాట్లాడుతూ '' ఈ చిత్ర కథ చెప్పగానే నిర్మాతలు ఎంతో ఎక్జ్సైట్ అయ్యారు. ఫుల్‌ ఫ్యాకేజీలా ఈ సినిమా ఉంటుంది. అన్ని ఎమోషన్స్‌ ఈ చిత్రంలో ఉంటాయి. కామెడీ, గ్లామర్‌, మిస్టరీ కలబోతగా ఈ సినిమా ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపు ఓ కొత్త లోకంలో ఉంటారు. సరికొత్తగా ప్రేక్షకులకు సరికొత్త ఎక్స్‌ పీరియన్స్‌ ఇస్తున్నాం. ఈ చిత్రంలో సంగీత్‌ శోభన్‌ పర్‌పార్మెన్స్‌ పొటెన్షియాలిటీని చూడబోతున్నారు అన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement