సినిమాల్లోకి రాకముందే ఐశ్వర్యరాయ్ యాడ్ ఫిల్మ్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాటోగ్రాఫర్ రాజీవ్ మీనన్‌తో కలిసి పలు ప్రకటనల్లో పనిచేశారు. ఆ సమయంలోనే దర్శకుడు మణిరత్నం తన సినిమాలో ఐశ్వర్యని హీరోయిన్‌గా తీసుకోవాలని అనుకున్నారు. అదే సంగతి రాజీవ్ మీనన్ ఐష్‌కి చెప్పారు. దీంతో తనని ఆటపట్టిస్తున్నారని ఈమె అనుకుంది. అదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
'రాజీవ్ మీనన్‌తో నేను ఎన్నో యాడ్ ఫిల్మ్స్‌లో పనిచేశా. అప్పటికే నేను మణిరత్నంకు అభిమానిని అనే విషయం ఆయనకు తెలుసు. షూటింగ్ టైంలో మణిరత్నం సినిమాల్లోని పాటలని రోజూ వినిపించేవారు. ఓ రోజు మణిరత్నం తన సినిమాలో నన్ను తీసుకోవాలని భావిస్తున్నట్లు రాజీవ్ చెప్పారు. కానీ ఆయన నన్ను ఆటపట్టిస్తున్నారని అనుకున్నాను. ఆ తర్వాత మణిరత్నంను కలిసినప్పుడు.. ‘ఇరువర్’( తెలుగులో ఇద్దరు )నటించడానికి ఆసక్తి ఉందా? అని ఎంతో సున్నితంగా అడిగారు' అని ఐశ్వర్యరాయ్ చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం మణిరత్నం.. విజయ్ సేతుపతి, సాయిపల్లవి జంటగా ఓ సినిమా తీస్తున్నారు. రొమాంటిక్ డ్రామా కాన్సెప్ట్. కాగా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక ఐశ్వర్య విషయానికొస్తే.. ‘ఇరువర్,( తెలుగులో ఇద్దరు) తర్వాత ‘గురు’, ‘రావణ్’ చిత్రాల్లోనూ మణిరత్నంతో కలిసి పనిచేశారు. వీరి కాంబినేషన్‌లో వచ్చిన చివరి చిత్రం 'పొన్నియిన్ సెల్వన్'. ప్రస్తుతం ఐష్ కొత్తగా మూవీస్ చేయట్లేదు.


