సాత్విక్ వర్మ (Satwik Varma), ప్రీతి నేహా (Preeti Varma) హీరో హీరోయిన్లు గా నటిస్తున్న చిత్రం 'ప్రేమిస్తున్నా'(Premistunna).
కనకదుర్గారావు పప్పుల నిర్మాతగా భాను దర్శకత్వంలో సరికొత్త ప్రేమకథతో వస్తున్నా చిత్రమిది. పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబర్ 7న థియేటర్స్ లో విడుదల కానుంది.
ఈ సందర్భంగా హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రోషన్ కనకాల, ఆకాష్ పూరి ముఖ్య అతిథిగా విచ్చేశారు.


