
కోలీవుడ్ స్టార్ హీరో సతీమణి జ్యోతిక ప్రస్తుతం బాలీవుడ్‌లో నటిస్తోంది. తాజాగా ఆమె డబ్బా కార్టెల్ అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారామె. అయితే ఈ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా వరుసగా ఇంటర్వ్యూలకు హాజరువుతున్నారు. ఈ సందర్భంగా తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన జ్యోతిక తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. బాలీవుడ్‌లో నటించడంపై ఆమె మాట్లాడారు.
బాలీవుడ్‌తో నా తొలిచిత్రం అక్షయ్ ఖన్నాతో నటించానని తెలిపింది. ఆ సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు.. అందువల్లే ఆ తర్వాత ఆఫర్లు రాలేదని వివరించింది. అది చేసే సమయంలో ఓ దక్షిణాది సినిమాకు సైన్ చేశానట్లు వెల్లడించింది. కోలీవుడ్‌లో తొలి సినిమానే నా భర్త సూర్యతో చేయడం ఎప్పటికీ మర్చిపోలేనని పేర్కొంది. స్టార్‌డమ్ గురించి ఆమెను ప్రశ్నించగా.. ఇంటికి వెళ్లేముందే బయటే తమ స్టార్‌డమ్‌ను వదిలేస్తామని తెలిపింది. ఇంట్లోకి అడుగుపెట్టగానే మా పిల్లలకు తల్లిదండ్రులుగానే ఉంటాం.. ప్రతి ఉదయం వారి బాక్స్‌ల గురించే ఆలోచిస్తామని.. వాళ్ల పనులకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తామని జ్యోతిక వెల్లడించింది.
కాగా.. తాజా వెబ్ సిరీస్ డబ్బా కార్టెల్‌లో.. షబానా అజ్మీ, గజరాజ్, జ్యోతిక, నిమేషా సజయన్, షాలినీ పాండే ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సిరీస్‌ను హితేష్ భాటియా దర్శకత్వంలో తెరకెక్కించారు. ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సిరీస్ ఫిబ్రవరి 28వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ వెబ్ సిరీస్‌ను క్రైమ్ థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ముంబయిలో డబ్బావాలా బాగా ఫేమస్. ఆ కోణంలోనే ఈ సిరీస్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఫుడ్ డబ్బాల్లో లంచ్‌తో పాటు డ్రగ్స్ కూడా సరఫరా చేసే ఐదుగురు గృహిణుల చుట్టూ తిరిగే స్టోరీగా డబ్బా కార్టెల్ రూపొందించారు. ఈ సిరీస్‌లో అంజలి ప్రసాద్, సాయి తమంకర్ కీలకపాత్రలు పోషించారు.