నాకంటే బాగా నటించిందట.. | Jyotika acted better than me, says Suriya | Sakshi
Sakshi News home page

నాకంటే బాగా నటించిందట..

May 28 2015 2:54 PM | Updated on Sep 3 2017 2:50 AM

నాకంటే  బాగా నటించిందట..

నాకంటే బాగా నటించిందట..

రెండువారాల క్రితం విడుదలైన, విజయవంతంగా నడుస్తున్న 36 వయదినిలే సినిమా సక్సెస్తో సినీజంట సూర్య, జ్యోతిక మరింత ఉత్సాహంగా కనిపిస్తున్నారు. తాజాగా తామిద్దరం కలిసి త్వరలో తమిళంలో ఒక సినిమా చేస్తున్నామని సూర్య ప్రకటించారు.

చెన్నైః   రెండువారాల క్రితం విడుదలైన, విజయవంతంగా నడుస్తున్న 36 వయదినిలే  సినిమా సక్సెస్తో సినీ జంట సూర్య, జ్యోతిక మరింత ఉత్సాహంగా కనిపిస్తున్నారు.  అన్నీ కుదిరితే ఈ భార్యభర్తలిద్దరూ జంటగా నటించి  ప్రేక్షకులను అలరించనున్నారట. 36 వయదినిలే సినిమా సక్సెస్ మీట్లో మాట్లాడిన సూర్య స్వయంగా  ఈ విషయాన్ని వెల్లడించారు. ''మేమిద్దరం కలిసి త్వరలో  తమిళంలో ఒక సినిమా చేస్తున్నాం.. కథలను పరిశీలిస్తున్నాం.. అన్నీ అనుకున్నట్టుగా  జరిగితే మేమిద్దరం కలిసి వచ్చే ఏడాదే ఓ మూవీ చేయబోతున్నాం'' అని నిర్మాత కమ్ యాక్టర్ సూర్య తెలిపారు.

తాను  ఊహించిన దానికంటే ఎక్కువగా  అద్భుతమైన విజయం సాధించిందని సూర్య సంబరపడుతున్నారు.  ప్రేక్షకుల ఆదరణ చాలా బాగుందన్నారు. ఇంత బాగా ఆదరించిన ప్రేక్షక దేవుళ్లక... సినిమా విజయంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికి  ఆయన ధన్యవాదాలు తెలిపారు.  సినిమా రిలీజైన దగ్గరనుంచి జ్యోతికకు నిరంతరాయంగా  ఫోన్ కాల్స్  చాలా  వస్తూనే ఉన్నాయ న్నారు.  ఈ సినిమాతో తానేంటో నిరూపించుకుంది మా జో అని సూర్య తెగ మురిసిపోతున్నాడు. నాకంటే జో చాలా బాగా నటించిదని అమ్మా నాన్న చెప్పారనీ.. దీనికి తాను గర్వంగా ఫీలవుతున్నానని అన్నారు.  

కాగా  తమిళ హీరో సూర్యను పెళ్లి చేసుకున్న  హీరోయిన్  జ్యోతిక 36 వయదినిలే సినిమాతో  రీ ఎంట్రీ  ఇచ్చింది. తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న జ్యోతిక తన  సెకండ్ ఇన్నింగ్స్లో కూడా అదరగొట్టింది. రోషన్ ఏండ్రూస్ దర్శకత్వంలో స్వయంగా  హీరో సూర్య నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీసు దగ్గర భారీ విజయాన్ని నమోదు చేసింది. విడుదలైన రెండు వారాల్లో 10  కోట్లకు పైగా బిజినెస్ సాధించింది.

Advertisement
 
Advertisement
Advertisement