వెకేషన్‌లో సూర్య దంపతులు.. వీడియో షేర్ చేసిన జ్యోతిక! | Kollywood Star Hero Suriya Enjoying Vacation With Wife Jyotika In Seychelles, Video Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

Suriya- Jyotika: వెకేషన్‌లో సూర్య దంపతులు.. వీడియో వైరల్!

Jun 29 2025 7:56 PM | Updated on Jun 30 2025 12:25 PM

Kollywood Star Hero Suriya Vacation With Wife Jyotika Goes Viral

రెట్రో మూవీ తర్వాత కోలీవుడ్ స్టార్ హీరో సూర్య టాలీవుడ్ డైరెక్టర్‌తో జతకట్టారు. ప్రస్తుతం ఆయన వెంకీ అట్లూరితో కలిపి పనిచేస్తున్నారు. ఇటీవలే ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో హీరో సూర్య తన కూతురితో కలిసి పాల్గొన్నారు. ఈ చిత్రంలో ప్రేమలు ఫేమ్ మమతా బైజు హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లో సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.

అయితే ప్రస్తుతం షూటింగ్‌కు కాస్తా విరామం రావడంతో విదేశాల్లో వాలిపోయారు సూర్య. తన భార్య జ్యోతికతో కలిసి ఫారిన్‌లో చిల్ అవుతున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈస్ట్‌ ఆఫ్రికాలోని సీషెల్స్‌ ఈ జంట ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరలవుతున్నాయి. ఇవీ చూసిన అభిమానులు సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement