ఒక్కరోజులోనే 1.4 మిలియన్‌ ఫాలోవర్లు | Suriya Thanks Fans For Their Unconditional Love | Sakshi
Sakshi News home page

అపరిమిత ప్రేమకు ధన్యవాదాలు: నటుడు

Jul 25 2020 8:02 PM | Updated on Jul 25 2020 8:33 PM

Suriya Thanks Fans For Their Unconditional Love - Sakshi

తనపై అమితమైన ప్రేమాభిమానాలు చూపుతోన్న అభిమానులకు నటుడు సూర్య ధన్యవాదాలు తెలిపారు. ఇంతలా ప్రేమించే అభిమానులు ఉండటం నిజంగా తన అదృష్టం అంటూ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. ఇంతకు విషయం ఏంటంటే తన 45వ పుట్టిన రోజు(జూలై 23) సందర్భంగా సూర్య ఫోటో షేరింగ్‌ యాప్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో జాయిన్‌ అయ్యారు. తొలిసారి ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంటర్‌ అయిన సూర్యను 24 గంటల వ్యవధిలోనే 1.4 మిలియన్‌ మంది ఫాలో అవుతున్నారు. ఈ క్రమంలో తనమీద అపరిమితమైన ప్రేమను చూపిస్తున్న అభిమానులకు సూర్య కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి అభిమానులు ఉండటం తన అదృష్టం అన్నారు సూర్య. (సూర్య రెండో లుక్‌.. పక్షి ఎందుకుంది?)

రెండు రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ ఒపెన్‌ చేసిన సూర్య ఇప్పటి వరకు మూడు ఫోటోలు షేర్‌ చేశారు. ఒకటి భార్య జ్యోతికతో ఉన్న ఫోటో కాగా.. మరొకటి తనది. ప్రస్తుతం సూర్య ఇన్‌స్టాగ్రామ్‌లో నలుగురినే ఫాలో అవుతున్నారు. వారు సోదరుడు కార్తి, సోదరి బృందా, బెస్ట్ ఫ్రెండ్ రాజశేకర్‌పాండియన్, అతని ప్రొడక్షన్ హౌస్ 2డీ ఎంటర్‌టైన్‌మెంట్. ఇక సూర్య పుట్టినరోజు సందర్భంగా.. నిర్మాత కలైపులి ఎస్ థాను రాబోయే చిత్రం ‘వాడి వాసల్’ పేరుతో ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. వెట్రీ మారన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం జల్లికట్టు ఆధారంగా తెరకెక్కుతున్నట్లు సమాచారం. అయితే దీని గురించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు. (జ్యోతిక వ్యాఖ్యలను సమర్థించిన సూర్య..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement