ఓటీటీలో కోర్ట్ రూమ్ థ్రిల్లర్ సినిమా.. ట్రైలర్ రిలీజ్ | Jyotika System Movie OTT Trailer | Sakshi
Sakshi News home page

System OTT Trailer: హార్డ్ హిట్టింగ్ లీగల్ డ్రామా.. ఓటీటీ ట్రైలర్ రిలీజ్

May 12 2026 2:28 PM | Updated on May 12 2026 2:44 PM

Jyotika System Movie OTT Trailer

ఒకప్పుడు తెలుగు, తమిళంలో హీరోయిన్‌గా సినిమాలు చేసిన జ్యోతిక.. రీసెంట్ టైంలో బాలీవుడ్‌పై దృష్టి పెట్టింది. హిందీలోనూ అడపాదడపా మూవీస్ చేస్తోంది. ఈమె నటించిన కోర్ట్ రూమ్ థ్రిల్లర్ చిత్రం ఇప్పుడు నేరుగా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)

'సిస్టమ్' పేరుతో తీసిన సినిమాలో జ్యోతిక, సోనాక్షి సిన్హా, అశుతోష్ గోవారికర్ ప్రధాన పాత్రలు పోషించారు. అశ్విని తివారీ దర్శకురాలు. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చే శుక్రవారం(మే 22) నుంచి ‍స్ట్రీమింగ్ కానుంది. హిందీతో పాటు తెలగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ అందుబాటులోకి రానుంది.

రిలీజ్ చేసిన ట్రైలర్ బట్టి చూస్తే కోర్టులో న్యాయవాదిగా పనిచేసే లాయర్ సోనాక్షి.. న్యాయాన్ని గెలిపించకుండా డబ్బులు తీసుకుని కేసుల్ని తారుమారు చేసే పనిచేస్తుంటుంది. దీనికి జ్యోతిక కూడా సహకరిస్తూ ఉంటుంది. అలాంటి వీళ్ల జీవితాల్లో తర్వాత ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయి. వ్యవస్థ ఏం చేసింది? అనేదే మిగతా స్టోరీలా అనిపిస్తుంది. 

(ఇదీ చదవండి: ప్రభాస్ రీల్ మదర్.. ఒకప్పటి హీరోయిన్.. చాక్లెట్ ఫ్యాక్టరీ ఓనర్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement