హైదరాబాద్‌కు గుడ్‌బై.. షిఫ్ట్‌ అవుతున్న అల్లు అర్జున్‌! | Allu Arjun Shifted to mumbai with his family | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌కు గుడ్‌బై.. షిఫ్ట్‌ అవుతున్న అల్లు అర్జున్‌!

Apr 20 2026 11:17 AM | Updated on Apr 20 2026 11:22 AM

Allu Arjun Shifted to mumbai with his family

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ తన కుటుంబంతో పాటు ముంబైలో తాత్కాలికంగా స్థిరపడనున్నారని తెలుస్తోంది. తను నటిస్తున్న కొత్త సినిమా రాకా షూటింగ్‌ ఎక్కువగా ముంబైలోనే జరుగుతుండటంతో ఆయన ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం. ఒకవేళ ఇది నిజమైతే, సినిమా  కఠినమైన షూటింగ్ షెడ్యూల్‌ను నిర్వహించడానికి అవకాశం దొరుకుతుంది. ఆపై రెండు నగరాల మధ్య నిరంతర ప్రయాణాన్ని తగ్గించుకోని సినిమా కోసం మరింత సమయం కేటాయించవచ్చని బన్నీ ఆలోచిస్తున్నాడట.

బాలీవుడ్‌లో వస్తున్న వార్తల ప్రకారం అల్లు అర్జున్ తన తదుపరి చిత్రానికి పూర్తిగా అంకితమవ్వడానికి రాబోయే రెండు, మూడు సంవత్సరాల పాటు ముంబైలోనే ఉండాలని ప్లాన్‌ చేస్తున్నారట. తరచూ ప్రయాణాల వల్ల కలిగే అలసట లేకుండా ఉండాలని అనుకున్నారట. ఈ సమయం షూటింగ్‌పై దృష్టి పెట్టడానికి తనకు సహాయపడుతుందని ఆయన భావిస్తున్నారని సమాచారం. రాకా మూవీలోని పాత్ర కోసం ఆయన శారీరకంగా పెద్ద మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. రాకాలో తన పాత్ర కోసం ప్రతిరోజూ దాదాపు నాలుగు గంటల పాటు ప్రాస్థెటిక్ మేకప్‌పై గడుపుతున్నారని, ఆ తర్వాత దానిని తొలగించడానికి మరో రెండు గంటలు వెచ్చిస్తున్నారని సమాచారం. అందుకే ముంబైలోనే ఉంటే సమయం కాస్త కలిసొస్తుందని బన్నీ ఉన్నారట.

అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాకా చిత్రాన్ని  సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ కొద్దిరోజుల క్రితం విడుదలై అందరి దృష్టినీ ఆకర్షించింది. అల్లు అర్జున్‌ సరికొత్త అవతారంలో కనిపించి సినిమాపైన బారీ బజ్‌ను క్రియేట్‌ చేశారు. ముంబైలోనే ఎక్కువగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ ప్రాజెక్ట్‌లో బాలీవుడ్‌ స్టార్‌ షారుక్‌ ఖాన్‌ అతిథి పాత్రలో నటిస్తున్నారనే ప్రచారం ఉంది.  ఈ మూవీ ఆలస్యం అవుతుందనే వదంతులు ఉన్నప్పటికీ, సినిమా షెడ్యూల్ ప్రకారమే కొనసాగుతోంది. ఈ ఏడాది చివరి నాటికి అల్లు అర్జున్ తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణను పూర్తి చేస్తారని భావిస్తున్నారు.  ఈ చిత్రానికి విస్తృతమైన పోస్ట్-ప్రొడక్షన్ , విఎఫ్ఎక్స్ పనులు జరుగుతుండగా, చిత్ర బృందం 2027 ద్వితీయార్థంలో థియేటర్లలో విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement