వెదురు వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. ఔషధ గుణాల దగ్గరి నుంచి సౌందర్య సాధనాల తయారీలోనూ దీని వినియోగిం పెరిగింది. దీంతో భారత్ సహా చాలా దేశాలు సాగును పెద్దఎత్తున ప్రోత్సహిస్తున్నాయి. అయితే పంటకు ప్రాముఖ్యత ఇచ్చినంత మాత్రన సరిపోదంటున్నారు శాస్త్రవేత్తలు. వెదురు విప్లవం సాగుకే పరిమితం కాకూడదని, దాన్నో ఎకానమీగా మారాలంటే రీసెర్చ్ అవసరమని అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ (నీతిఆయోగ్)–ICAR–నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ సీఈవో డాక్టర్ ఆదర్శ గౌడ. మరి అదెలాగో ఆయన మాటల్లోనే సవివరంగా తెలుసుకుందాం..
వెదురు ఇండస్ట్రీని తీసుకురావాలంటే.. కేవలం భావోద్వేగ ప్రచారాలు, హ్యాష్ ట్యాగులు కాదని.. రీసెర్చులు జరిగితేనే ఆ పరిశ్రమలు నిలబడతాయని చెబుతున్నారు ఆదర్శ గౌడ. ఆ అవసరం ఎందుకో ఆయన వివరించారు.
ఐరన్ వెదురు (Guadua) షూట్స్‌లోని చేదు రుచి కారణమైన బయో–యాక్టివ్ ఫ్లేవనోయిడ్లు, ఫెనాలిక్ కంపౌండ్లు, ప్రాసెసింగ్ చేయకపోతే హానికరమైన సైనోజెనిక్ గ్లైకోసైడ్లను సూచిస్తుందని చెబుతున్నారాయన. ఈ చేదులో ఆంటీ–డయాబెటిక్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలపై ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు సాగుతున్నాయని.. రక్తంలో చక్కెర నియంత్రణకు తోడ్పడే ఫంక్షనల్ ఫుడ్‌గా నిలిచే అవకాశాలు ఉన్నప్పటికీ, శాస్త్రీయ ధృవీకరణ, సేఫ్ ప్రాసెసింగ్ కీలకమని ఆయన హెచ్చరించారు.
అలాగే ఐరన్ వెదురులో తక్కువ సిలికా కంటెంట్ ఉండటంతో ఎకో–టూరిజం పార్కులు, వినోద అరణ్యాలు వంటి పర్యావరణ హితమైనవి తీసుకురావొచ్చని అన్నారు. దీంతోపాటు వెదురు ఫైబర్‌తో తయారయ్యే ఎండీఎఫ్ బోర్డులు రైలు మార్గాల సౌండ్ బ్యారియర్లు, భవనాల ఇన్సులేషన్, అకౌస్టిక్ ప్యానెల్స్ వంటి రంగాల్లో భారీ మార్కెట్‌ను ఆకర్షించే సామర్థ్యం ఉందన్నారు. అలాగే వెదురు ఆకులు, కొమ్మలతో తయారయ్యే బయోడిగ్రేడబుల్ ఎగ్ ట్రేస్, ప్లేట్లు, ప్యాకేజింగ్ పల్ప్ ప్లాస్టిక్‌కి అడ్డుకట్ట వెయ్యొచ్చు. పైగా అగ్రికల్చరల్ వ్యర్థాన్ని ఆదాయంగా మార్చే గొనంన అవకాశం కూడా అని అన్నారు.
ఆఖరికి వెదురు ఆకులు, కొమ్మలతో తయారయ్యే బయోడిగ్రేడబుల్ ఎగ్ ట్రేస్, ప్లేట్లు, ప్యాకేజింగ్ పల్ప్ ప్లాస్టిక్‌కి అడ్డకట్ట వెయ్యొచ్చుని చెప్పారు. అలాగే వెదురు షూట్స్(తినదగిని వెదురు లేత రెమ్మలు) స్నాక్స్‌గా, ఫ్లవర్, ఫెర్మెంటెడ్ ఫుడ్స్, అలాగే టెక్స్‌టైల్ ఫైబర్లు, పశువుల మేత, మెడికల్ ఎక్స్‌ట్రాక్టుల వరకు దీన్ని విస్తరించవచ్చని చెబుతున్నారు.
ఇవన్నీ జరగాలంటే రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ సెంటర్ వల్లే సాధ్యమని, ఇది కేవలం ల్యాబ్ కాదని పరిశ్రమకు బ్రెయిన్ లాంటిదని చెబుతున్నారు.
ఈ సెంటర్ ద్వారా ఉపయోగాలేంటంటే..
ఎలాంటి చోట వెదురు పెంచాలో రైతులకు చెప్పడం
ఎలాంటి వెదురు మొక్కలను పెంచాలో రైతులకు సూచనలు ఇవ్వడం..
ఏ పొడక్ట్‌లకు మార్కెట్ సుస్థిరమో ఇన్వెస్టర్లకు క్లారిటీ
ఏ రంగాల్లో సబ్సిడీలు, ప్రోత్సాహకాలు ఇవ్వాలో ప్రభుత్వానికి గైడ్
స్టాండర్డ్స్, క్వాలిటీ కంట్రోల్, పేటెంటబుల్ ఇన్నొవేషన్లు సిస్టమాటిక్‌గా బయటకు రావడం
అంతేగాదు ఈ ఆర్ అండ్ డీ సెంటర్ వల్ల నేరుగా ఇంజినీర్లు, టెక్నీషియన్లు, ప్రోడక్ట్ డెవలపర్లు, డేటా అనలిస్టులకు ఉద్యోగాలు వస్తాయని, పక్కనే రైతులు, ఇండస్ట్రీ వర్కర్లు, లాజిస్టిక్స్, మార్కెటింగ్, ఎక్స్‌పోర్ట్ రంగాల్లో కూడా కొత్త ఉపాధి అవకాశాలు తెరుచుకుంటాయని తెలిపారు. ఇది “లైవ్‌లీహుడ్ ప్రాజెక్ట్” స్థాయిలో ఉండే వెదురు సాగును, నిజమైన ఆర్థిక రంగంగా మారుస్తుందని డా. గౌడ అభిప్రాయపడ్డారు.
అందువల్ల వీటిని సాగు ఒక్కటే భవిష్యత్తు కాదని, మరింత లోతుగా అధ్యయనం చేయడం దాని వాల్యూ తెలుసుకోవడం అత్యంత ముఖ్యమని నొక్కి చెప్పారు. అందువల్ల ఫిలిప్పీన్స్ వంటి దేశాల్లో వెదురు విప్లవం మొదలైంది. గ్రామీణ సమాజాన్ని పేదరికం నుంచి బయటపడేసే హీరోగా, భూమిని రక్షించే మొక్కగా, అలాగే నిర్మాణ రంగానికి ఆయువు పట్టుగా కీర్తిస్తున్నారు. అలాంటి వెదురు కలప పరిశ్రమ వాస్తవికతలోకి రావాలంటే పరిశోధనల్లో పెట్టుబడులు పెడితేనే సాధ్యమని లేదంటే ప్రచారంగానే మిగిలిపోతుందని హెచ్చరించారాయన.

(చదవండి: ముంచుకొస్తున్న వ్యవసాయ, ఆహార విపత్తు! ఎఫ్‌ఏఓ ఆందోళన)


