జనాదరణ పొందిన బరువు తగ్గించే మందుల వల్ల కండరాలు మరింత క్షీణించవచ్చని తాజా అధ్యయనం వెల్లడించింది. నార్త్ కరోలినా విశ్వవిద్యాలయానికి (UNC) చెందిన స్కూల్ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు జరిపిన తాజా అధ్యయనంలో ఈ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. బరువు తగ్గడానికి ప్రస్తుతం బాగా ప్రాచుర్యం పొందిన సెమాగ్లుటైడ్ (Semaglutide) మరియు తిర్జెపాటైడ్ (Tirzepatide) వంటి ఇంక్రిటిన్ ఆధారిత మందుల వల్ల ఆశించిన దానికంటే ఎక్కువగా కండరాల క్షీణత (Muscle Loss) జరుగుతున్నట్లు ఈ పరిశోధన తేల్చింది.ఈ మందులు టైప్ 2 డయాబెటిస్ , ఊబకాయం తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తున్నప్పటికీ, కండరాల నష్టం విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇటీవల జరిపిన ఒక అధ్యయనంలో, బరువు తగ్గే ఇంక్రిటిన్ ఆధారిత మందుల వల్ల, ఊహించిన దానికంటే ఎక్కువ కండరాల క్షీణతకు దారితీస్తుందని తేలింది. ఈ అధ్యయనం 'అన్నల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్' అనే జర్నల్‌లో ప్రచురితమైనాయి. దీనికి యూఎన్‌సీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ మరియు యూఎన్‌సీ గిల్లింగ్స్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌లో ఊబకాయం మరియు పోషణ నిపుణుడైన డాక్టర్ జాన్ ఎ. బాట్సిస్ నాయకత్వం వహించారు.
ఈ అధ్యయనం ప్రకారం ఈ మందులు వాడుతున్న వారిలో తగ్గుతున్న మొత్తం బరువులో దాదాపు 35శాతం కండరాలకు సంబంధించిందే అని తేలింది. సాధారణంగా ఆహార నియమాల ద్వారా బరువు తగ్గితే కండరాల నష్టం 2-10శాతం మాత్రమే ఉంటుంది, కానీ ఈ మందుల వల్ల అది చాలా ఎక్కువగా ఉంది.
ఇదీ చదవండి: అపుడు సస్పెన్షన్, ఇపుడు సీఎం యోగీ ఎలివేషన్, ఎవరీ దుర్గా శక్తి?
కండరాల నష్టం ఎందుకు జరుగుతుంది?
మనం కేలరీలను తక్కువగా తీసుకున్నప్పుడు శరీరం శక్తి కోసం కండరాల ప్రోటీన్లను విచ్ఛిన్నం చేస్తుంది. ఈ కొత్త మందులు ఆకలిని 16-39% వరకు తగ్గిస్తాయి. దీనివల్ల వేగంగా బరువు తగ్గుతారు, కానీ తగినంత వ్యాయామం (Resistance training) లేకపోతే కొవ్వుతో పాటు కండరాలు కూడా కరిగిపోతాయి.
ఇదీ చదవండి: కాన్పూర్ కవలల విషాదం, షాకింగ్ విషయాలు వెలుగులోకి
కండరాల క్షీణత, నష్టాలు
మెటబాలిజం మందగిస్తుంది. కండరాలు విశ్రాంతి సమయంలో కూడా కేలరీలను ఖర్చు చేస్తాయి. అవి తగ్గితే మెటబాలిక్ రేటు తగ్గి, భవిష్యత్తులో బరువు పెరగడం సులభం అవుతుంది. అలాగే దైనందిన పనులు (మెట్లు ఎక్కడం, బరువులు మోయడం) చేసుకోవడం కష్టమవుతుంది. త్వరగా అలసట వస్తుంది. కండరాలు బలహీనపడితే శరీర సమతుల్యత దెబ్బతిని, కింద పడటం మరియు ఎముకలు విరగడం వంటి ప్రమాదాలు పెరుగుతాయి. రికవరీ ఆలస్యమవుతుంది. గాయాలు త్వరగా మానవు. వ్యాయామం తర్వాత వచ్చే నొప్పులు ఎక్కువ కాలం వేధిస్తాయి. ముఖ్యంగా వృద్ధులలోఈ ప్రమాదం ఎక్కువ అని తేల్చారు. 60 ఏళ్లు పైబడిన వారిలో ఇది మరింత ప్రమాదకరం. ఇది వారిని ఇతరులపై ఆధారపడేలా చేస్తుంది.
ఇదీ చదవండి : విషాదం : టీవీ నటుడు సిద్ధార్థ్ కన్నుమూత
దీన్ని ఎలా అరికట్టవచ్చు
బరువు తగ్గే ప్రక్రియలో కండరాలను కాపాడుకోవడానికి జీవనశైలిలో మార్పులు చేసుకోవాలని పరిశోధకులు చెబుతున్నారు కండరాల మరమ్మత్తుకు అవసరమైన ప్రోటీన్లను అధికంగా తీసుకోవాలి. రెసిస్టెన్స్ ట్రైనింగ్ అవసరం. అంటే బరువులు ఎత్తడం వంటి వ్యాయామాలు చేయడం వల్ల కండరాల సాంద్రత పెరిగి, అవి కరిగిపోకుండా ఉంటాయి. బరువు తగ్గే క్రమంలో కేవలం మెషిన్ మీద అంకెలను మాత్రమే కాకుండా, శరీరంలోని 'లీన్ మాస్'ఎంత ఉందో నిరంతరం గమనిస్తూ ఉండాలి.


