మలయాళ టీవీ నటుడు సిద్ధార్థ్ వేణుగోపాల్ 41 ఏళ్ల వయసులో కన్నుమూశారు. గత రెండేళ్లుగా కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన శనివారం తుదిశ్వాస విడిచారు. ఆయనమరణవార్తతోపరిశ్రమలోని అభిమానులు, సహోద్యోగులు దిగ్భ్రాంతికి గురయ్యారు. దీంతో సోషల్ మీడియాలో సహోద్యోగులు, అభిమానులు తీవ్ర సంతాపం తెలిపారు.
నటి సీమా జి. నాయర్ ఫేస్‌బుక్‌లో సిద్ధార్థ్ మరణవార్తను ధృవీకరించారు. ‘‘నా ఆశలన్నీ ఆవిరైపోయాయి. సిద్ధార్థ్ వేణుగోపాల్ బాధలు లేని లోకానికెళ్లిపోయారు. నీ జీవితాన్ని తిరిగి తీసుకురావడానికి చాలా ప్రయత్నించాను. కానీ ఈ రోజు నువ్వు ఇక బాధ పడకూడదని దేవుడు నిర్ణయించాడు. ఈ బాధ భరించలేనుసిద్ధార్థ్, కుప్పకూలిపోయాను’’ అంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. కిషోర్ సత్య కూడా సిద్ధార్థ్‌కు నివాళులర్పించారు.
మలయాళ టీవీ నటుడు,త్రిస్సూర్‌లోని చాలకుడికి చెందిన సిద్ధార్థ్ వేణుగోపాల్ దీర్ఘకాలిక అనారోగ్యంతో పడుతున్నారు. కాలేజీ టైంలోనే నటనపై ఆసక్తి పెంచుకున్నారు. అతను బ్రాడ్‌కాస్టర్‌గా తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించాడు. ఆ తర్వాత అతను కస్తూరిమాన్ , భాగ్యజాతకం వంటి టీవీ సీరియల్స్‌లో నటించాడు.సిద్ధార్థ్ వేణుగోపాల్‌కు అతని తల్లి ,తమ్ముడు ఉన్నారు.
ఇదీ చదవండి: నో షార్ట్‌కర్ట్స్ : 16 కిలోలు తగ్గిన బాడ్మింటన్ కోచ్


