
జీవిత బీమా కంపెనీలకు ఏజంట్ల రిటెన్షన్ (వారు వైదొలగకుండా అట్టే పెట్టుకోవడం) సవాలుగా ఉంటోందని టాటా ఏఐఏ చీఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్ (ప్రొప్రైటరీ బిజినెస్, అలైడ్ చానల్స్) అమిత్ దవే తెలిపారు. బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐ 2023–24 వార్షిక నివేదిక ప్రకారం పరిశ్రమలో కొత్తగా 9.7 లక్షల మంది జీవిత బీమా ఏజంట్లు చేరగా, 6.9 లక్షల మంది నిష్క్రమించినట్లు చెప్పారు.
సత్వర ప్రయోజనాలు లభిస్తాయంటూ పరిశ్రమపై నెలకొన్న అభిప్రాయమే ఇందుకు కారణంగా ఉంటోందని తెలిపారు. ఇలా ఏజంట్ల నిష్క్రమణ అనేది వ్యాపారాన్ని స్థిరంగా కొనసాగించడానికి, కస్టమర్ల నమ్మకాన్ని పొందడానికి సవాలుగా ఉంటోందని దవే తెలిపారు. ఈ నేపథ్యంలో ఏజంట్లను రిటైన్ చేసుకునేందుకు పరిశ్రమ పలు ప్రయత్నాలు చేస్తోందని పేర్కొన్నారు.
క్లయింట్ కమ్యూనికేషన్, డిజిటల్ టూల్స్ మొదలైన వాటిల్లో కంపెనీలు శిక్షణనిస్తున్నాయని తెలిపారు. అధునాతన టెక్నాలజీ, మౌలిక సదుపాయాలను అందుబాటులో ఉంచుతున్నాయన్నారు.
ఇదీ చదవండి: బంగారాన్నే నమ్ముతా: జోహో సీఈఓ శ్రీధర్ వెంబు