
బంగారం ధరలు రోజురోజుకూ పెరుగుతూ ఆకాశాన్ని తాకుతున్నాయి. అదే సమయంలో క్రిప్టో కరెన్సీకి కూడా క్రేజ్ పెరుగుతోంది. అయితే స్వదేశీ సాంకేతిక ఆవిష్కరణలతో వార్తల్లో నిలుస్తున్న జోహో (Zoho)వ్యవస్థాపకుడు, సీఈవో శ్రీధర్ వెంబు.. తాను బంగారాన్నే(Gold) నమ్ముతా అంటున్నారు.
క్రిప్టో క్రేజ్ లేదా తాజా మార్కెట్ ట్రెండ్లకు లోనుకాకుండా బంగారాన్ని సంపదకు విశ్వసనీయమైన నిల్వగా కొనసాగిస్తున్నారు. కరెన్సీ క్షీణతకు రక్షణగా బంగారాన్ని భావించే శిబిరంలో 25 సంవత్సరాలుగా కొనసాగుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
ఈమేరకు శ్రీధర్ వెంబు (Sridhar Vembu) ‘ఎక్స్’(ట్విటర్)లో ఓ పోప్ట్ పెట్టారు. తనకు క్రిప్టోకరెన్సీలపై ఆసక్తి లేదని, బంగారాన్ని స్థిరమైన, కాలాతీత పెట్టుబడిగా చూస్తానని పేర్కొన్నారు. లిన్ ఆల్డెన్ అనే స్థూల ఆర్థిక వ్యూహకర్త చేసిన విశ్లేషణలో కూడా ఇదే భావనను సమర్థిస్తుందని ప్రస్తావించారు. ఆమె పరిశోధన ప్రకారం, అమెరికా ట్రెజరీ బాండ్లు, స్టాక్స్,రియల్ ఎస్టేట్ వంటి ఆస్తులు ద్రవ్యోల్బణాన్ని అనుసరించే బంగారాన్ని దీర్ఘకాలంలో అధిగమించలేకపోయాయి.
ఆల్డెన్ చెప్పినట్లు, కేవలం 4 శాతం స్టాకులే మార్కెట్ రాబడికి ముఖ్య కారణమవుతాయి. రియల్ ఎస్టేట్ కూడా పన్నులు, నిర్వహణ ఖర్చులు, ద్రవ్యోల్బణం వంటి అంశాల వల్ల బంగారంతో పోలిస్తే తక్కువ పనితీరు చూపించింది.
ఇదిలా ఉండగా, 2025లో ట్రంప్ విధించిన వాణిజ్య సుంకాలు, అమెరికా-చైనా ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణ భయాలు వంటివి బంగారం ధరలు ఔన్స్కు 4,000 డాలర్లు (రూ. 3.57 లక్షలు) దాటేలా చేశాయి. ఈ పరిణామాలు వెంబు నమ్మకాన్ని మరింత బలపరుస్తున్నాయి.
ఇదీ చదవండి: ఆ ఇన్వెస్ట్‌మెంట్ ఫార్ములా చచ్చింది.. కొత్తది వచ్చింది: రాబర్ట్ కియోసాకి
శ్రీధర్ వెంబు లాజిక్ స్పష్టంగా ఉంది. బంగారం తక్షణ లాభాల కోసం కాదు, ఇది దీర్ఘకాలిక ఆర్థిక భద్రత కోసం. “బంగారం ఓర్పునకు సంబంధించినది” అని చెబుతూ, ఆధునిక హైప్‌తో నిండిన పెట్టుబడి ప్రపంచంలో ఆయన దృఢమైన వైఖరి విశిష్టంగా నిలుస్తోంది.
I have long been in the "gold as insurance against currency debasement" camp, for over 25 years now. Over the long term, gold has held its purchasing power in terms of commodities like petroleum, and gold has held its own against broad stock market indexes. No, I am not… pic.twitter.com/dyfnCFa7T6
— Sridhar Vembu (@svembu) October 12, 2025