వాట్సప్‌లో మరో అదిరిపోయే ఫీచర్‌!

Whatsapp Rolling Out Protect Ip Address In Calls - Sakshi

ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సప్‌ మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. అగంతకుల నుంచి వచ్చే కాల్స్‌ నుంచి యూజర్లను కాపాడేలా ఐపీ అడ్రస్‌ను ఈ ఫీచర్‌ సురక్షితంగా ఉంచనుంది. 

వాట్సాప్‌కు సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు అందించే వాబీటా ఇన్ఫో ఈ ఫీచర్‌ను గుర్తించింది. ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న ఈ ఫీచర్‌ ఎంపిక చేసిన వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. వాట్సప్‌లో ఎబుల్‌, డిసేబుల్‌ ఆప్షన్‌లను ఎంపిక చేసుకోవడం ద్వారా యూజర్ల ఐపీ అడ్రస్‌లకు రక్షణ కవచంలా ఉంటుంది. 

నివేదిక ప్రకారం.. యూజర్లు వాట్సప్‌లో వాయిస్స్‌ కాల్స్‌, వీడియో కాల్స్‌ చేసే సమయంలో సురక్షితంగా ఉండేలా ప్రైవసీ సెట్టింగ్‌ స్క్రీన్‌లో అడ్వాన్డ్స్‌ అనే సెక్షన్‌లో ‘ప్రొటెక్ట్‌ ఐపీ అడ్రస్‌ ఇన్‌ కాల్స్‌’ ఎనేబుల్‌ చేసుకోవాలి. తద్వారా, ఇతరులు మీరు కాల్స్‌ మాట్లాడే సమయంలో మీరు ఎక్కడ నుంచి ఫోన్‌ మాట్లాడుతున్నారు. ఐపీ అడ్రస్‌ ఏంటనేది తెలుసుకునే అవకాశం ఉండదు. 

 ఫిల్టరింగ్‌ ఫర్‌ చానెల్‌ 
ఛానెల్ అప్‌డేట్‌ల కోసం రియాక్షన్‌లను ఫిల్టర్ చేసేలా వాట్సప్‌ మరో ఫీచర్‌ను విడుదల చేయనుంది. కాంటాక్ట్‌లలో ఎవరైనా ఎమోజీని ఉపయోగించి కంటెంట్‌కి ప్రతిస్పందించినట్లయితే వెంటనే గుర్తించడానికి ఛానెల్ యజమానులకు ఇది సహాయపడుతుంది. ఈ ఫీచర్ ఇప్పుడు కొంతమంది బీటా టెస్టర్లకు అందుబాటులో ఉందని  వాబీటా నివేదించింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top