యాపిల్, మెటాకు ఈయూ షాక్‌  | Commission Finds Apple And Meta In Breach Of The Digital Markets Act, More Details Inside | Sakshi
Sakshi News home page

యాపిల్, మెటాకు ఈయూ షాక్‌ 

Apr 24 2025 5:58 AM | Updated on Apr 24 2025 10:19 AM

Commission finds Apple and Meta in breach of the Digital Markets Act

డిజిటల్‌ కేసుల్లో భారీగా జరిమానా 

లండన్‌: డిజిటల్‌ కాంపిటీషన్‌ చట్టాల ఉల్లంఘనకు గాను అమెరికన్‌ టెక్‌ దిగ్గజాలు యాపిల్, మెటాకు యూరోపియన్‌ కమిషన్‌ షాకిచి్చంది. రెండు వేర్వేరు కేసుల్లో యాపిల్‌పై 500 మిలియన్‌ యూరోలు, మెటాపై 200 మిలియన్‌ యూరోల జరిమానా విధించింది. యాప్‌ స్టోర్‌ వెలుపల చౌక ఆప్షన్ల గురించి యూజర్లకు తెలియనివ్వకుండా యాప్‌ల తయారీదారులను నియంత్రించిందుకు గాను యాపిల్‌కి పెనాల్టీ విధించింది.

 వ్యక్తిగతీకరించిన యాడ్‌లను చూడాలని లేదా వాటిని తప్పించుకోవాలంటే కొంత రుసుములు చెల్లించాలని ఇన్‌స్ట్రాగామ్, ఫేస్‌బుక్‌ యూజర్లపై ఆంక్షలు విధించినందుకు జరిమానా కట్టాలంటూ యూరోపియన్‌ కమిషన్‌ ఆదేశించింది. రెండు కంపెనీలు 60 రోజుల్లోగా ఈ ఆదేశాలు పాటించకపోతే మరిన్ని పెనాల్టీ మరింత పెరుగుతుందని పేర్కొంది. గతంలో బిలియన్‌ డాలర్ల స్థాయిలో విధించిన జరిమానాలతో పోలిస్తే తాజా పెనాలీ్టలు గణనీయంగా తక్కువగా ఉండటం గమనార్హం.   

Advertisement
 
Advertisement
Advertisement