
మెటా కంపెనీ ఆధ్వర్యంలోని ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన వినియోగదారులకు కొత్త అప్‌డేట్ అందుబాటులోకి తీసుకొచ్చింది. వ్యక్తిగత సమాచారంతోపాటు వేడుకలు, ఇతర జ్ఞాపకాలను ముఖ్యమైన వారితో పంచుకోవడానికి వాట్సాప్ స్టేటస్‌ను గతంలోనే తీసుకొచ్చింది. అయితే అందులో ఇప్పటివరకు కేవలం ఒకే ఇమేజ్‌ను అప్‌లోడ్ చేసే వీలుండేది. తాజాగా వాట్సాస్ తీసుకొచ్చిన అప్‌డేట్‌తో స్టేటస్ ఇమేజ్‌లో గరిష్ఠంగా ఆరు ఇమేజ్‌లను అప్‌లోడ్ చేసేలా వెసులుబాటు కల్పించింది.
ఈమేరకు మే 30న కొత్త అప్‌డేట్ అందించింది. స్టేటస్ ద్వారా యూజర్లు మరింత సృజనాత్మకంగా తమ ఇమేజ్‌లను ఇతరులతో పంచుకునేందుకు అవకాశం కల్పించింది. కొత్తగా లేఅవుట్లు, మ్యూజిక్, ఫొటో స్టిక్కర్లు.. వంటి ఫీచర్లతో ‘యాడ్ యువర్స్’ ఆప్షన్ ద్వారా ఇమేజ్‌లను యాడ్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తుంది.

ఇదీ చదవండి: నీరుగారుతున్న ఉపాధి హామీ చట్టం లక్ష్యం
వినియోగదారులు సులభంగా ఉపయోగించేలా ఎడిటింగ్ టూల్స్‌తో గరిష్టంగా ఆరు ఫోటోలను ఒకే ఇమేజ్ స్టేటస్‌లో పొందుపరిచేలా లేఅవుట్‌ను రూపొందించారు. యూజర్లు ఇమేజ్‌లన్నింటినీ ఒకే ఫ్రేమ్‌లో ఎలా చూపించాలనుకుంటున్నారో సరిగ్గా అమర్చుకుంటే సరిపోతుంది. దీనికి అదనంగా మ్యూజిక్‌ను యాడ్ చేసుకోవచ్చు. వినియోగదారుల మానసిక స్థితిని అనుసరించి ట్యూన్ సెట్ చేయవచ్చు. దాంతోపాటు మ్యాజిక్ స్టిక్కర్‌ను ఉపయోగించవచ్చు. ఈ కొత్త ఫీచర్‌ను ఉపయోగించాలంటే వాట్సాప్‌ను అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుందని గుర్తుంచుకోవాలి.