వాషింగ్టన్: ఉద్యోగార్ధులకు ముఖ్య గమనిక!. ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారా?. వరుస పెట్టి రెజ్యూమేలు పంపిస్తున్నారా? అయినా ఇంటర్వ్యూ కాల్స్ రావడం లేదా?. అయితే, ఉద్యోగాల కోసం మీరు చేస్తున్న ప్రయత్నాల్ని వెంటనే ఆపేయండి. జస్ట్ ఈ పనిచేయండి చాలు. కాళ్లరిగేలా ఆఫీసులు చుట్టూ తిరగక్కర్లేదు. రిఫరెన్స్ ఇవ్వమని ప్రాధేయపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. మిమ్మల్నే వెతుక్కుంటూ ఉద్యోగాలు వస్తాయి. ఎలా అంటారా?
కెనడాకు చెందిన మార్మిక్ పటేల్ అమెరికాలో ఐటీ ఉద్యోగం కోసం ప్రయత్నాలు ప్రారంభించాడు. తన ఎడ్యుకేషన్,స్కిల్స్,ఎక్స్‌పీరియన్స్ ఆధారంగా అందరిలాగే తాను రెజ్యూమేలు తయారు చేసి పంపించేవాడు. పదులు,ఇరవైల నుంచి వందల కొద్దీ రెజ్యూమేలు పంపిస్తున్నాడు. ఉద్యోగం కావాలని వేల మంది రిక్రూటర్లకు మెసేజ్‌లు పెడుతున్నారు. రిక్రూటర్ల నుంచి ఎలాంటి స్పందన వచ్చేది కాదు.
ఇక లాభం లేదని రూటు మార్చాడు. అంతే.. ఐదు నెలల్లో 83 మంది రిక్రూటర్లు మా కంపెనీలు ఉద్యోగం ఉందని ఆఫర్ చేసినట్లు చెప్పుకొచ్చాడు. ఇంతకీ మార్మిక్ పటేల్ చేసిందేంటో తెలుసా? పబ్లిసిటీ.
అవును ఆయన గురించి ఆయన గొప్పగా చెప్పుకోవడం. ఇలా చెప్పుకోవడం చేతగాకపోతే ఉద్యోగం చేయడం, బిజినెస్ చేయాలనే ప్రయత్నాలు పక్కన పెట్టాలని సలహా ఇస్తున్నాడు. మీరు ఎంత చదివితేం. మీకంటూ ఓ స్కిల్ ఉందని అందరికి తెలియాలి కదా. అప్పుడే మనమేంటో ఈ ప్రపంచానికి తెలిసేది. చాలా మంది అనుకోవచ్చు. నా గురించి నేను గొప్పలు చెప్పుకుంటే ఏం బాగుంటుందని. అలా చెప్పుకోవాలి బ్రదర్. మార్కెట్‌లో అవకాశాలు సమానంగా పంచరు. 90 శాతం మందిలో 10శాతం మందికి మాత్రమే ఉద్యోగాలు దక్కుతున్నాయి.
ఇప్పుడు వారిలో నేనున్నందుకు సంతోషంగా ఉంది. ఇంతకీ నేను చేసిన పని ఏంటని అనుకుంటున్నారా? సంప్రదాయ పద్ధతిలో ఉద్యోగాలకు దరఖాస్తు చేయడం అత్యంత మూర్ఖమైన పని. అందుకే ఉద్యోగాలకు అప్లయి చేసే స్ట్రాటజీ మార్చాను. నా డొమైన్‌కు సంబంధించిన స్కిల్‌ను బిల్డ్ చేశాను. కంటెంట్ క్రియేట్ చేయడం, నెట్‌వర్కింగ్ పెంచుకుంటూ వెళ్లా. ఫలితంగా ఊహించని విధంగా నా కెరియర్ మలుపు తిరిగింది.
నాకు ఉద్యోగం ఇచ్చేందుకు ఏఐ కంపెనీలు,వైకాంబినేటర్ స్టార్టప్స్,యూనికార్న్ కంపెనీలు ముందుకు వచ్చాయి. ప్రస్తుతం మెటా కంపెనీలో టెక్కీగా విధులు నిర్వహిస్తున్నాడు. జాబ్ కోసం ప్రయత్నించే సమయంలో ఇలాంటి వ్యూహాలు అమలు చేస్తే ఉద్యోగం పక్కగా వస్తుందని చెప్పుకొచ్చాడు. చివరిగా.. విజేతల్నే ప్రపంచం గుర్తుంచుకుంటుంది. విజయం సాధించడం, విజేతలుగా నిలవడం తప్ప మనకు వేరే మార్గం లేదని ముగించాడు.
applying to jobs is the dumbest shit you can ever do.
i learned the hard way. dmed a 1000 recruiters/engineers. did 670 apps. didn't get me anything.
cause its not equally distributed: the top 10% of people take 90% of the jobs.
it's the same everywhere else. the hottest… https://t.co/gEpcaViXS1— Marmik Patel (@Marmik_Patel19) January 12, 2026


