భారతదేశంలో నివసించే ప్రతి ఒక్కరికీ ఆధార్ కార్డు చాలా అవసరం. ఇది కేవలం మనకు గుర్తింపుగా మాత్రమే కాకుండా.. అనేక వ్యవహారాల్లో ఉపయోగపడుతుంది. అయితే దీనిని డౌన్‌లోడ్ చేసుకోవాలంటే.. కొన్నిసార్లు ఆధార్ సెంటర్లకు లేదా ఇంటర్నెట్ సెంటర్లకు వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు భారత ప్రభుత్వం ఆధార్ కార్డు డౌన్‌లోడ్ ప్రక్రియను మరింత సులభతరం చేసి.. వాట్సాప్ ద్వారానే డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించింది.
ఇదివరకు యూఐడీఏఐ పోర్టల్ లేదా డిజిలాకర్ ద్వారా ఆధార్ డౌన్‌లోడ్లు సాధ్యమయ్యేవి. తాజా ఫీచర్‌తో వాట్సాప్‌లోనే ఆధార్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అయితే.. ఈ సేవను ఉపయోగించడానికి, కార్డుదారులు తమ ఆధార్‌తో లింక్ చేసిన డిజిలాకర్ ఖాతాను కలిగి ఉండాలి. వారి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ యాక్టివ్‌గా ఉండాలి. మైగవ్ హెల్ప్‌డెస్క్ +91-9013151515 నంబర్ ద్వారా పనిచేస్తుంది.
వాట్సాప్ ద్వారా ఆధార్ డౌన్‌లోడ్
➤ముందుగా మీ మొబైల్‌లో మైగవ్ హెల్ప్ డెస్క్ నెంబరు +91-9013151515 ను సేవ్ చేయండి
➤నెంబర్ సేవ్ చేసుకున్న తరువాత.. వాట్సాప్ ఓపెన్ చేసి ఆ నంబర్‌కు "హాయ్" లేదా "నమస్తే" వంటి మెసేజ్ పంపండి.
➤చాట్‌బాట్ అందించే ఎంపికల నుంచి డిజిలాకర్ సేవలను ఎంచుకోండి
➤మీ డిజిలాకర్ ఖాతాను వెరిఫై చేసి.. మీ 12 అంకెల ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి.
➤వెరిఫికేషన్ కోసం మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబరుకు పంపిన ఓటీపీని ఎంటర్ చేయాలి.
➤వెరిఫికేషన్ పూర్తియన తర్వాత, చాట్‌బాట్ అందుబాటులో ఉన్న పత్రాల జాబితాను ప్రదర్శిస్తుంది.
➤అందులో నుంచి ఆధార్ కార్డును ఎంచుకుంటే.. అది పీడీఎఫ్ ఫార్మాట్‌లో వాట్సాప్‌లో కనిపిస్తుంది.
యూజర్లు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఒకేసారి ఒక పత్రాన్ని మాత్రమే పొందవచ్చు. ఆధార్ ఇప్పటికే డిజిలాకర్‌లో లింక్ చేసి ఉండాలి. లింక్ చేయకపోతే వాట్సాప్ ఎంపికను ఉపయోగించే ముందు డిజిలాకర్ వెబ్సైట్ లేదా యాప్ ద్వారా వివరాలను అప్డేట్ చేయాలి.
ఇదీ చదవండి: 70/10/10/10 ఫార్ములా: ఇలా పొదుపు చేస్తే.. నెల మొత్తం హ్యాపీ!


