Sakshi News home page

దెయ్యాలు వేదాలు వల్లిస్తే.. మస్క్‌పై ప్రశంసలు.. జుకర్‌బర్గ్‌పై అసహ్యంతో థ్రెడ్స్‌పై సెటైర్లు

Published Tue, Jul 11 2023 9:15 PM

Why Afghan Talibans Praise Twitter Boss Elon Musk Here The Reason - Sakshi

ఎలన్‌ మస్క్‌తో పాటు ఎవరూ కూడా ఇలాంటి ఓ పరిణామం జరుగుతుందని ఊహించి ఉండరు. అదేంటో తెలుసా?..  తాలిబన్ల ఆయన్ని ఆరాధించడం. అవును.. ట్విటర్‌ను అద్భుతంగా నడిపిస్తూ తమకెంతో ప్రియపాత్రుడిగా నిలిచిపోయాడంటూ ఎలన్‌ మస్క్‌ను ఇష్టపడుతున్నారు వాళ్లు.  అదే సమయంలో మార్క్‌ జుకర్‌బర్గ్‌ పేరు చెబితేనే అసహ్యించుకుంటున్నారు. ఎందుకంటే..

అఫ్గనిస్తాన్‌లో అనధికార ప్రభుత్వాన్ని నడిపిస్తున్న తాలిబన్లు ట్విటర్‌పై.. దాని ఓనర్‌ ఎలన్‌ మస్క్‌పై ప్రశంసలు గుప్పిస్తున్నారు. తాజాగా.. తాలిబన్‌ నేత అనాస్‌ హక్కానీ సైతం మస్క్‌ను ఆకాశానికి ఎత్తేశాడు.  భావ ప్రకటనకు సోషల్‌ మీడియాల్లో  ట్విటర్‌ మాత్రమే సరైన వేదిక. దానిని సమర్థవంతంగా నడిపిస్తున్న ఎలన్‌ మస్క్‌కు తాలిబన్ల తరపున అభినందనలు. అందుకే ఆయనంటే మాకు ఎంతో గౌరవం అంటూ పేర్కొన్నారు.

‘‘ ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల కంటే Twitter ద్వారా రెండు అడ్వాంటేజ్‌లు ఉన్నాయి.  మొదటిది వాక్ స్వాతంత్ర్యం హక్కు. రెండోది Twitter స్వభావమైన విశ్వసనీయత. మెటాలాంటి అసహన విధానానికి ట్విటర్‌ దూరంగా ఉంటుంది. వేరొకటి దానిని భర్తీ చేయలేదు అంటూ మెటా థ్రెడ్స్‌ను ఉద్దేశించి పరోక్షంగా ట్వీట్‌ చేశారాయన.  

కారణం ఇదే.. 
మెటాను(ఒకప్పటి ఫేస్‌బుక్‌)ను తాలిబన్లు ద్వేషించడానికి ప్రధాన కారణం .. తాలిబన్‌ అనే పదాన్ని ఆ ప్లాట్‌ఫారమ్‌ పరిగణించే విధానం. పక్కా టైర్‌ 1 ఉగ్రవాద సంస్థగా తాలిబన్‌ను చూపిస్తోంది ఇది. పైగా తాలిబన్‌కు మురికి అనే అర్థం కట్టబెట్టింది.  ఈ కారణం వల్లే ఫేస్‌బుక్‌(మెటా)లో తాలిబన్‌ లీడర్లు తమ అభిప్రాయాలను పంచుకోలేకపోతున్నారు.. అసహ్యించుకుంటున్నారు. అదే ట్విటర్‌లో అయితే యధేచ్ఛగా తమ పోస్టులను పెడుతున్నారు. ఇస్లామిక్‌ ఎమిరేట్‌ అఫ్గ్‌ పేరిట తాలిబన్‌ గ్రూప్‌కు ట్విటర్‌లో ఓ అధికారిక అకౌంట్‌ కూడా ఉంది. 

నాటో బలగాల ఉపసంహరణ తర్వాత తాలిబన్లు తిరిగి అఫ్గనిస్థాన్‌ను స్వాధీనం చేసుకున్నాయి. ఇకపై  ప్రజాస్వామ్య యుతంగా.. పాలన సాగిస్తామని, ఏ వర్గానికి హక్కుల్ని దూరం చేయబోమని ప్రకటించుకుని పాలన మొదలుపెట్టింది. పైగా ఈ ప్రచారంతోనే గ్లోబల్‌ గుర్తింపు, అటుపై ఆర్థిక సాయం.. ఒప్పందాల కోసం తాలిబన్‌ ప్రభుత్వం ఎదురు చూస్తోంది. కానీ, తుపాకీ రాజ్యంలో మహిళలు, పిల్లల హక్కులను కాలరాస్తూనే వస్తోంది. ఈ క్రమంలో ఇప్పుడు ఫ్రీడమ్‌ ఆఫ్‌ స్పీచ్‌ గురించి తాలిబన్లు మాట్లాడుతుంటే.. దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది కదా!.

ఇదీ చదవండి: ఒంటి కన్ను దొంగ.. భలే భలే కథ
 

Advertisement

What’s your opinion

Advertisement