
కేరళ నర్సు నిమిష ప్రియకు యెమెన్‌లో ఉరిశిక్ష పడకుండా తానే ఆపినట్టు ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను యెమెన్, హూతీ దేశాల ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి, వారిని ఒప్పించినట్టు పాల్ చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో నిమిషను కాపడటంలో మోదీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ తాజాగా ట్విట్టర్ వేదికగా ఓ వీడియోను విడుదల చేశారు. ఈ సందర్బంగా కేఏ పాల్.. మూడు రోజులు రాత్రింభవళ్లు కష్టపడి కేరళ నర్సు నిమిష ప్రియకు యెమెన్‌లో ఉరిశిక్ష పడకుండా ఆపాను. నిమిషాను రక్షించడంలో ఎనిమిది సంవత్సరాలుగా మోదీ ప్రభుత్వం విఫలమైంది. మోదీ గవర్నమెంట్ సన సిటీలో ప్రభుత్వం లేదన్నారని, ఏం చేయలేమని చేతులెత్తేశారు. కానీ అది అబద్ధం. హూతీ సిటీలో ప్రభుత్వం ఉంది. మోస్ట్ పాపులర్ ముస్లీం లీడర్ సెమీ ఆరియన్ షేక్ అహ్మద్ ఎంతో సాయం చేశారు.
Dr. K.A Paul with Yamen leadership One of the 5 key meetings . Both sides the Houthi leaders and Government leaders have finally considering to help Indian Nurse Nimisha Priya released . The victim Talal Mahdi’s family also considering to pardon Priya the indian Nurse in Sanaa… pic.twitter.com/LSE4jH0i4M
— Dr KA Paul (@KAPaulOfficial) July 14, 2025
మూడు రోజులుగా కష్టపడి హూతీ, యెమెన్ ప్రభుత్వ పెద్దలను కలిశాను. వారు సాయం చేశారు. నిమిషకు ఉరిశిక్ష వాయిదా వేయకుండా ఆమె చంపిన కుటుంబానికి మిలియన్ డాలర్లు ఇస్తామని హామీ ఇచ్చానని అన్నారు. అవి కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా.. తనను ఇవ్వమంటారా అని ప్రశ్నించారు. వారం రోజుల్లోనే ఆ డబ్బులు ఇవ్వాలని అన్నారు. ఉరిశిక్ష కేవలం వాయిదా పడిందని.. తాను మళ్లీ యెమన్ లీడర్లను కలుస్తానని చెప్పుకొచ్చారు. దీంతో, ఆయన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఆయన వల్లే ఉరి శిక్ష ఆగిపోయిందా అని మాట్లాడుకుంటున్నారు.